Stroke Symptoms Explained : స్ట్రోక్ అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు లేదా మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దీనిని సమయానికి గుర్తించి వెంటనే చికిత్స అందిస్తే.. మరణం లేదా పక్షవాతం రాకుండా నివారించవచ్చు. అందుకే శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలను విస్మరించకూడదని చెప్తున్నారు వైద్యులు. సరైన అవగాహనతో వాటిని గుర్తించి.. వెంటనే అలెర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటంటే..

Continues below advertisement

ముఖం వంగిపోవడం

హఠాత్తుగా ముఖం ఒక వైపు వంగిపోవడం లేదా మొద్దుబారడం జరుగుతుంది. ఇది స్ట్రోక్ ముఖ్యమైన సంకేతం. నవ్వుతున్నప్పుడు ముఖంలో మార్పులు కనిపిస్తే.. వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.

చేతి బలహీనత

ఒక చేయి లేదా కాలు హఠాత్తుగా బలహీనంగా అనిపించడం.. లేదా చలనం కోల్పోవడం స్ట్రోక్ లక్షణమే. ఇలాంటి లక్షణం గుర్తిస్తే రెండు చేతులనూ పైకి లేపాలి. ఓ చేయి ప్రమేయం లేకుండా జారిపడితే అది ప్రమాద సంకేతం.

Continues below advertisement

మాట్లాడటంలో ఇబ్బంది

మాటలు తడబడడం, మాట్లాడుతుంటే అర్థం కాకపోవడం, లేదా నార్మల్ వర్డ్స్ కూడా సరిగ్గా పలకలేకపోవడం కూడా స్ట్రోక్ సంకేతాలే. ఈ లక్షణం గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

చూపు మసకబారడం

ఒక కన్ను లేదా రెండు కళ్లలో హఠాత్తుగా చూపు తగ్గడం, మసకగా కనిపించడం, లేదా రెండుగా కనిపించడం స్ట్రోక్ లక్షణాలు కావచ్చు. ఇలాంటి పరిస్థితి నిర్లక్ష్యం చేయకూడదు.

తీవ్రమైన తలనొప్పి

ముందెప్పుడూ రాని విధంగా హఠాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం స్ట్రోక్ హెచ్చరికల్లో భాగమే. ఈ నొప్పికి సాధారణ కారణం లేకుండా ఉంటే.. అది మెదడులో రక్తస్రావానికి సూచన అయి ఉండవచ్చు.

పై లక్షణాలలో ఏదైనా కనిపిస్తే.. నిమిషం కూడా వృధా చేయకుండా 108కి కాల్ చేయండి. లేదా సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లండి. స్ట్రోక్ విషయంలో సమయమే మీరు అందించే చికిత్స అవుతుంది. 

స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్ట్రోక్ రాకూడదనుకుంటే.. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడం, స్మోకింగ్ మానేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం చాలా అవసరం. ఆయిల్, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ.. హెల్తీ లైఫ్​ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని చాలావరకు దూరం చేసుకోవచ్చు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.