Stroke Signs and Riskn Factors : స్ట్రోక్ రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఒక్కసారి వచ్చిందంటే.. దాని గురించి లైఫ్లాంగ్ జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే దీని గురించి అందరూ తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు. చాలామంది స్ట్రోక్ అంటే ఒకటే అనుకుంటారు. కానీ దానిలో కొన్ని రకాలు ఉంటాయి. ఈ స్ట్రోక్ రావడానికి కొన్ని అంశాలు ప్రేరేపిస్తాయి. మరికొన్ని పరిస్థితిని దారుణం చేస్తాయి. ఇలా స్ట్రోక్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో? దాని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

స్ట్రోక్​ రకాలు 

స్ట్రోక్​లో మూడు రకాలు ఉంటాయి. ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్, టెంపరెరీ ఇస్కీమిక్ అటాక్. ఇస్కీమిక్ స్ట్రోక్​లో రక్తం గడ్డకట్టి మెదడులోని ఒక భాగానికి రక్త ప్రవాహం అడ్డుకుంటుంది. ఇది అత్యంత సాధారణమైన రకం. హెమరేజిక్ స్ట్రోక్​లో రక్తనాళం చీలిపోయి మెదడులోకి రక్తస్రావం కావడం వల్ల వస్తుంది. మినీ స్ట్రోక్​ని టెంపరెరీ స్ట్రోక్ అటాక్ అంటారు. ఇది వస్తే దాని లక్షణాలు గంట కంటే తక్కువగా ఉంటాయి. ఇది ఫ్యూచర్​లో స్ట్రోక్​ వచ్చే అవకాశాలను పెంచుతుందనడానికి హెచ్చరికగా తీసుకోవాలని అంటున్నారు. 

స్ట్రోక్ కారణాలు 

బీపీ : స్ట్రోక్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అధిక రక్తపోటు స్ట్రోక్​ రావడానికి ప్రధాన కారణంగా చెప్తారు. బీపీ పెరిగినప్పుడు, దీర్ఘకాలికంగా బీపీతో ఇబ్బంది పడేవారు స్ట్రోక్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తనాళాల గోడలు దెబ్బతిని.. చీలికగా ఏర్పడి, అడ్డంగా మారి.. స్ట్రోక్​కి కారణమవుతాయి. 

అధిక కొలెస్ట్రాల్ : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. ధమనులలో ఫలకం ఏర్పడుతుంది. ఇది రక్తప్రవాహాన్ని తగ్గించి.. గడ్డకట్టడాన్ని కారణమవుతుంది. ఇది స్ట్రోక్​కి కారణమవుతుంది. 

మధుమేహం : మధుమేహం రక్తంలో చక్కెరను స్థాయిలను పెంచుతుంది. ఇది రక్త నాళాలను దెబ్బతీసి.. స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. 

ధూమపానం : ధూమపానం రక్తనాళాలను దెబ్బతీసి.. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. 

స్థూలకాయం : అధిక బరువు లేదా ఊబకాయం గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. అధిక రక్తపోటు, మధుమేహానికి దారి తీస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. 

స్ట్రోక్ సంకేతాలు ఇవే 

ముఖం ఓ వైపు తిమ్మిరిగా అనిపించడం, సాగిపోవడం దీనిలో భాగమే. ముఖంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. చేతులు బలహీనంగా మారిపోతాయి. మాట్లాడటంలో ఇబ్బందులు ఉంటాయి. సరిగ్గా మాట్లాడలేరు. మాట మందగిస్తుంది. 

స్ట్రోక్ ప్రమాద కారకాలు ఇవే 

కొన్ని కారకాలు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. లైఫ్​స్టైల్​లో మార్పులు చేస్తే అవి కంట్రోల్ అవుతాయి. వయసు పెరిగే కొద్ది స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. 55 శాతం కంటే ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ ఉంటే వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గుండె జబ్బులు, స్లీప్ ఆప్నియా వంటి కొన్ని మెడికల్ కండీషన్స్ కూడా స్ట్రోక్​కి కారణమవుతాయి.

చికిత్స 

స్ట్రోక్ లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. వైద్యులు మీ పరిస్థితిని నాడీ సంబంధిత పనితీరును, స్ట్రోక్ లక్షణాలు అంచనా వేసి ట్రీట్​మెంట్ అందిస్తారు. స్ట్రోక్, దాని రకాన్ని గుర్తించడానికి, CT స్కాన్‌, MRIలు చేస్తారు. న్యూరాలజిస్టులు వాటికి అనుగుణంగా ట్రీట్​మెంట్ ఇస్తారు. ఎంత తొందరగా వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే అంత తొందరగా ప్రమదాన్ని తగ్గించవచ్చు. 

Also Read : కిడ్నీల వ్యాధులను నివారించే మార్గాలు ఇవే.. సమ్మర్​లో మూత్రపిండాలను ఇలా కాపాడుకోవాలట