Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్నని శివన్నారాయణ కోపంగా పిలిచి నాతో ఎందుకు అబద్ధం చెప్పించావు.. ఎందుకు నన్ను అబద్ధాలతో నమ్మించావని అడుగుతాడు. తాత ఏ విషయం గురించి అడుగుతున్నాడా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఏమైందని సుమిత్ర అడిగితే కంపెనీ నష్టాల్లో ఉంటే అకౌంట్స్‌లో లాభాలు చూపించిందని సీఈవో చేసి కంపెనీ చేతిలో పెడితే నా నమ్మకం మీద చావు దెబ్బ కొట్టిందని కంపెనీలో పరువు తీసిందని శివన్నారాయణ అంటాడు.
దశరథ్: ఎవరు చేసిన తప్పు అయినా ఎప్పటికైనా బయట పడాల్సిందే నాన్న. జ్యోత్స్నని గుడ్డిగా నమ్మావు. ఎంప్లాస్ గొడవ టైంలోనే నీ నమ్మకం జ్యోత్స్న పొగొట్టుకుందని అర్థమైంది.సుమిత్ర: దొంగ లెక్కలు రాసి లాభాలు చూపించాల్సిన అవసరం ఏముందే. శివన్నారాయణ: భయం మనముందు తన చేతకాని తనం ఎక్కడ బయట పడుతుంది భయపడింది. ఫెయిల్ అయింది. అకౌంట్స్ విషయంలో రెస్టారెంట్ కొనడంతో చివరకు అకౌంట్స్ మేనేజ్‌మెంట్ విషయంలో కూడా ఫెయిల్ అయింది. టోటల్‌గా ఫెయిల్ అయ్యావు జ్యోత్స్న.దశరథ్: దీని అంతటికి కారణం మనం జ్యోత్స్నని గుడ్డిగా నమ్మడమే నాన్న.శివన్నారాయణ: కాదు కార్తీక్. జ్యోత్స్న బుర్రని కార్తీక్ అనే పురుగు తొలి చేస్తుంది. ఇది 24 గంటలు వాడి చుట్టే తిరుగుతుంది. వాడు ఛీ కొడుతున్నా వాడి వెంటే పడుతుంది. ఇప్పుడు జ్యోత్స్నకి మనం మందు వేయకపోతే ఇప్పుడు కార్తీక్ అనే పురుగుదీన్ని పూర్తిగా తినేస్తుంది. అన్నింటికీ ఒకటే మందు జ్యోత్స్న పెళ్లి. త్వరగా పెళ్లి చేయాలి.జ్యోత్స్న: నేను చేసుకోను.దశరథ్: చేసుకోకుండా ఏం చేస్తావ్ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ మమల్ని బాధ పెడతావా. జ్యోత్స్న: బావే నా భర్త.శివన్నారాయణ: ఛీ నోరు మూయ్. ఛీ నిన్ను వద్దనుకున్న మనిషి కోసం వెంపర్లాడటం నీకు ఇష్టం లేదా. నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాం. అందులో నువ్వు నచ్చిన వాడిని చెప్తే ఒకే లేదంటే మాకు నచ్చినవాడితో నీ పెళ్లి అంతే. జ్యోత్స్న: పెళ్లి విషయంలో నా మనసు మారదు. బావే నా భర్త.శివన్నారాయణ: దాని విషయంలో తప్పు మనదే ఉంది. దాని మనసుతో మనమే ఆడుకున్నాం. ఏడిపించినా బుజ్జగించినా అది మన ఇంటి బిడ్డ. ఒక్క గానొక్క వారసురాలు. మనం చేసిన తప్పుని మన చేతులతో మనమే కడుక్కుందాం.దశరథ్: నువ్వు ఏ తప్పు చేయలేదు నాన్న తప్పు ఏమైనా జరిగితే అది నా వల్ల నా కూతురి వల్ల.సుమిత్ర: మామయ్య గారు జ్యోత్స్నని ఎంత బాగా అర్థం చేసుకున్నారు. అందరినీ ఇలాగే అర్థం చేసుకుంటే ఎంత బాగున్నో.
కార్తీక్, దీపలు రెస్టారెంట్‌ని కొబ్బరి కాయ కొట్టి శ్రీకారం చుడతారు. పూర్తిలో రెస్టారెంట్‌ని మళ్లీ కొత్తగా మార్చాలని రెస్టారెంట్‌ని స్టాఫ్‌ని సొంత మనషులుగా చూసుకుంటానని తప్పు చేస్తే కొడతానని రెస్టారెంట్ అంతా క్లీన్ చేయమని చెప్తాడు. మొదటి కస్టమర్ వస్తే టుడే స్పెషల్ ఉమ్మా బిర్యాని అని రాయమని చెప్తుంది. చెఫ్ నాకు అది చేయడం రాదు అంటే దీప నేను చెప్తా అని అంటుంది. మొదటి కస్టమర్ ఉప్మా బిర్యాని ఆర్డర్ చేస్తారు. దీప కిచెన్‌కి వెళ్తుంది. మరోవైపు జ్యోత్స్న కూడా వస్తుంది. కార్తీక్, జ్యోత్స్నలు ఢీ కొట్టుకుంటారు. నువ్వేంటి ఇక్కడ అని కార్తీక్ అడిగితే కస్టమర్ బావ నేను అని అంటుంది. ఇక ఉప్మా బిర్యాని ఆర్డర్ పెడుతుంది.
దీపని జ్యోత్స్న పలకరిస్తుంది. దీప బెల్లం పట్టుకొని ఈ వెధవ చీమలు ఏంటో జ్యోత్స్న వెతుక్కుంటూ వస్తాయి. ఈ సారి ఈ బెల్లం నా దగ్గరకు ఉంది ఊరికే చీమలు వస్తే కండలు పీకేస్తా అని అంటుంది. జ్యోత్స్న దీపతో ఆల్‌ది బెస్ట్ చెప్పి కండలు పీక్కో అంటుంది. జ్యోత్స్న ఉప్మా బిర్యాని తిని టేస్ట్ బాగుంది అంటుంది. మీ టేస్ట్‌లు బాగున్నా నేను సోషల్ మీడియాలో బ్యాడ్ రేటింగ్ పెడతా అని అంటుంది. జ్యోత్స్న ఈ రెస్టారెంట్‌కి బేరం పెడితే 150 ఇచ్చి బయల్దేరు అని కార్తీక్ అంటాడు. ఇక దీప జ్యోత్స్నతో నువ్వు నిద్ర లేవకపోతే సూర్యుడు ఉదయించనట్లు కాదని కార్తీక్‌ని తాను గెలిపిస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.