Satyabhama Serial Today Episode సత్యతో మిస్ బిహేవ్ చేశాడని చెప్పి క్రిష్‌ సంజయ్‌ని చితక్కొడతాడు. బామ్మ తిడుతుంది. క్రిష్ అబద్ధం చెప్తున్నాడని సంజయ్ అంటాడు. సత్య కావాలనే నిందలు వేస్తుందని చెప్తాడు. సత్య నిందలు వేస్తున్నందుకు పర్సనల్‌గా మాట్లాడి నా బతుకు బతనివ్వమని చెప్పాలి అనుకున్నా అని కానీ సత్య గది నుంచి వెళ్లిపోమని చెప్పందని క్షమాపణ చెప్పమని చేతులు పట్టుకుంటే దాన్ని తప్పుగా భావించి మెట్ల మీద నుంచి తోసుకొస్తూ కొడుకుతున్నారని చెప్తారు. తప్పు చేసి మమల్నే భద్నాం చేస్తావా అని క్రిష్‌ సంజయ్‌ని పిచ్చ కొట్టుడు కొడతాడు. పొడవడానికి చాకు తీస్తాడు.

మహదేవయ్య: ఆపరా.. అని క్రిష్‌ని ఇష్టం ఇచ్చినట్లు తంటాడు. కొడతాడు.క్రిష్‌: బాపు..మహదేవయ్య: ఇంకొక్కసారి బాపు అని పిలిస్తే నాలుక చీరేస్తా. నా దెబ్బ ఎట్లా ఉంటుందో తెలీక రెచ్చిపోతున్నావ్.రుద్ర: ఆపినా ఆగడం లేదు బాపు నీ తర్వాత వాడే ఇంటి పెద్దలా రెచ్చిపోతున్నాడు. పెద్దోడిని నేను ఆపినా ఆగడం లేదు. క్రిష్: మహదేవయ్య చాకు క్రిష్ మెడ మీద పెట్టడంతో.. నీ కోసం నేను ప్రాణం ఇస్తా కదా బాపు ఇప్పుడు నా ప్రాణం తీయాలని ఎందుకు అనుకుంటున్నావ్. అంత తప్పు నేను ఏ చేశాను.భైరవి: పెళ్లాంతో కుమ్మక్కయ్ సంజయ్ ప్రాణం తీయాలి అనుకున్నావ్ కదరా. తప్పు కదరా పాపం ఎట్లా గిల గిలా కొట్టుకుంటున్నాడో చూడురా.మహదేవయ్య: మనసులో చిన్నా గాడు నా కొడుకు కాదని రుజువు చేయడం చేతకాక నా కన్న కొడుకు సంజయ్ మీద పగపట్టావా కోడలా.క్రిష్‌: నేను చెప్పేది విను బాపు నేను చెప్పింది తప్పు అని పిస్తే చంపేయ్ ఎదురు చెప్పను.మహదేవయ్య: ఛీ నీ ముఖం చూడాలి అంటే అసహ్యాంగా ఉందిరా ఇంక మాటలేంటి. సంజయ్: ఏడుపు నటిస్తూ వీళ్లిద్దరూ నా నుంచి బయటకు గెంటేయాలి అని చూస్తున్నారు. ఈ ఇళ్లు నాది అనుకున్నా మీలో నా అమ్మానాన్నని చూస్తున్నా మీరంతా నా ఆప్తులు అనుకున్నా. జీవితాంతం మీతో సంతోషంగా ఉండాలి అనుకున్నా. ఇందంతా  ఓ భ్రమ అని తేలిపోయింది. వీళ్లిద్దరికీ నేను ఇక్కడ ఉండాలని లేదు. మీ పుణ్యం అని ఈ రోజు నాకు చావు గండం పోయింది. మీరు లేనప్పుడు వాడు నన్ను ఏమైనా చేయొచ్చు.క్రిష్: రేయ్ సంజయ్.. అవన్నీ అబద్దాలు బాపు.సత్య: అవన్నీ అబద్ధాలు అని ఆ పెద్ద మనిషికి తెలుసు. ఈ సంజయ్ చరిత్ర ఏంటో ఆయనకు బాగా తెలుసు.సంజయ్: చరిత్ర ఏంటి.సత్య: నోర్ముయ్. నాటకాలు ఆడకు. ఈ ఇంటి కోడలి మీద దౌర్జన్యం జరిగింది అంటే ఇంటి పెద్దగా ఈయన గారు ఏం చేయాలి. ఈ సంజయ్ షర్ట్ పట్టుకొని నిలదీయాలి. నిజం రాబట్టాలి. అదేమీ చేయకుండా సరాసరి వచ్చి నీ గుండెల మీద తన్నాడు అంటే అర్థమేంటి. హా.. అడుగు మీ బాపుని క్రిష్‌. క్రిష్: చెప్పు బాపు సత్య అడిగిన దానికి సమాధానం చెప్పు. సత్య: తమ్ముడి కొడుకు తప్పు చేస్తే పట్టించుకోకుండా ఏ కన్న తండ్రి అయినా కన్న కొడుకుని చంపడానికి సిద్ధ పడలేదు. ఇదెక్కడి న్యాయం నేను ఎక్కడా ఇంత వరకు వినలేదు. చూడలేదు. కారణం ఏంటి తెలుసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంత చిన్న ప్రశ్నకు మీ బాపు ఎందుకు సమాధానం చెప్పడం లేదు క్రిష్. పోనీ నువ్వు అంటే ఇష్టం లేదు అందుకే తన్నారు అంటే అలాంటి ఛాన్సే లేదు. ఎందుకు అంటే నువ్వు అంటే ఆయనకు నువ్వు ప్రాణం గుండెల మీద నీ పేరు పచ్చ బొట్టు వేయించుకున్నారు. నిన్ను తక్కువ చేస్తూ సంజయ్‌కి విలువ ఇస్తున్నారు అంటే ఏదో పెద్ద కారణం ఉంది కదా చెప్పమను  క్రిష్. ఆ మౌనానికి అర్థమేంటి. అయినా మన ఇంట్లో ఈ కొట్టు కోవడాలు మామూలే కదా మరి దీనికి ఇంత రాద్దాంతం ఎందుకు. అక్క దేవుడి దగ్గర హారతి తీసుకురా. రుద్ర: ఏయ్ ఇప్పుడు అది ఎందుకు.సత్య: హారతి పళ్లెంతో మామయ్య ఈ హారతి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. క్రిష్: బాపుమహదేవయ్య: మర్చిపో ఇంక ఆ పిలుపు మర్చిపో. నువ్వు నా రక్తం పంచుకొని పుట్టలేదు. నీలో ఉన్నది నా రక్తం కాదు. అందరూ బిత్తర పోతారు. నువ్వు మాకు పుట్టిన బిడ్డవి కాదు మా కొడుకువే కాదు. క్రిష్: తండ్రి గడ్డం పట్టుకొని.. అట్లా అనొద్దు బాపు. కోపం వస్తే నన్ను కొట్టు ఆ కత్తితో పొడిచేయ్. అంతేకానీ నన్ను మజాక్‌కి కూడా అలా అనొద్దు.మహదేవయ్య: నువ్వు తట్టుకున్నా తట్టుకోకపోయినా ఇదే నిజం. నువ్వు నా కొడుకువి కాదు. నువ్వు బుద్ధిగా ఉండి ఉంటే పాతికేళ్లగా దాచుకున్న ఈ నిజం ఎప్పటికీ నా గుండెల్లోనే దాచుకునేవాడిని. ఎప్పటికీ నా కొడుకులా చూసుకునేవాడిని. కానీ గీత దాటావు. ఈ స్థానంలో ఉండాల్సింది వీడు నా అసలైన కొడుకు నా చిన్న కొడుకు సంజయ్. క్రిష్: కుప్పుకూలిపోయి.. నేను బాపు కొడుకుని కాదట పరాయి వాడినంట. నా గుండెల మీద ఎవరో కాళ్లు వేసి తొక్కుతున్నట్లుంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొడుకు కాదు అంటే నేను ఏమైపోవాలి సత్య. బాపు కాదన్నా కూడా నేను బాపు కొడుకునే. ఇక్కడ గుండె నిండా ప్రేమ ఉంది నా ప్రేమ చావదు. శాంతమ్మ: ఒరేయ్ చూడరా వాడు ఎలా ఏడుస్తున్నాడో చూడరా. మహదేవయ్య: వాడిని నా అవసరం కోసం తెచ్చుకున్నా.. అని భైరవి డెలివరీ టైంలో జరిగింది చెప్తాడు. తన చిన్న కొడుకుని చక్రవర్తి కొడుకుతో మార్చాను.శాంతమ్మ: అంటే చిన్నా..మహదేవయ్య: చక్రవర్తి కొడుకు చక్రవర్తి దగ్గర పెరిగిన సంజయ్ నా కొడుకు. సంజయ్, రుద్రల్ని చెరో వైపు పట్టుకొని.. ఇది నా ఫ్యామిలీ మహదేవయ్య కొడుకులు. నా రెండు భుజాలు. క్రిష్: తప్పు చేసినావ్ బాపు.మహదేవయ్య: నిన్ను మా ఇంటికి తీసుకొచ్చా.క్రిష్: కాదు నిజం బయటకు చెప్పి. నిజం చెప్పే కంటే నన్ను చంపేసుంటే బాగుండేది. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాల కోసం గడప దాటిన త్రిపుర.. ఫణి పేరున రిజిస్ట్రేషన్ ఆపుతుందా!!