High Blood Pressure : అధిక రక్తపోటు అనేది ఈ మధ్యకాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. బీపీ ఎక్కువైతే.. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే దానిని కంట్రోల్​లో ఉంచుకునేందుకు వైద్యులు సూచించే మందులు కచ్చితంగా వాడాలి. అలాగే బీపీని తగ్గించుకోవడంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. ఇలాంటి సమయంలో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు తినకూడని ఫుడ్స్ ఏంటో.. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బీపీ తగ్గుతుందో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

అధిక ఉప్పు 

బీపీ ఎక్కువగా ఉన్నవారు ఉప్పు అధికంగా ఉండే ఫుడ్స్ తినకూడదు. చిప్స్, పికిల్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ మరింత పెరుగుతుంది.

ప్రాసెస్ చేసిన మీట్..

సాసేజ్, రెడ్ మీట్​లలో కూడా సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీపిని అదుపులో ఉంచుకునేందుకు లిమిటెడ్​గా ఫ్రెష్ మీట్ తీసుకోవచ్చు. కానీ ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్​ జోలికి వెళ్లకూడదు. 

Continues below advertisement

ఫాస్ట్ ఫుడ్

బర్గర్, పిజ్జా, ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫాస్ట్​ ఫుడ్​కి దూరంగా ఉండాలి. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటుంది.  ఇది గుండెపై మరింత భారం పెంచి.. బీపిని మరింత ఎక్కువ చేస్తుంది. 

షుగర్ డ్రింక్స్

చాలా డ్రింక్స్​లలో షుగర్ ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. సోడా, ప్యాక్డ్ జ్యూస్​లు చూసేందుకు హెల్తీగా కనిపించినా వాటిలో చక్కెర ఎక్కువ ఉంటుంది. వీటిని తాగడం వల్ల బీపీతో పాటు బరువు పెరుగుతారు. 

ఆల్కహాల్.. 

మద్యం రక్తపోటును పెంచి గుండెపై ఒత్తిడి కలిగిస్తుంది. మీకు బీపీ ఉందని తెలిస్తే ఆల్కహాల్, స్మోకింగ్​కి వీలైనంత దూరంగా ఉండడం మంచిదని చెప్తున్నారు నిపుణులు. 

హై బీపీ ఉన్నవారు తినాల్సిన ఫుడ్స్..

రక్తపోటు అధికంగా ఉన్నవారు పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అరటి, కీరదోస, పాలకూర వంటివి డైట్​లో చేర్చుకోవాలి. ఇవి సోడియం ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఓట్స్, బీన్స్, నట్స్​ వంటి ఫైబర్ ఎక్కువగా ఉండేవి తినాలి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొవ్వులేని పాలు, పెరుగు తీసుకోవచ్చు. కాల్షియంతో నిండిన ఈ ఫుడ్స్ బీపీని అదుపులో ఉంచుతాయి. నారింజ, క్యారెట్, బ్రోకోలీ వంటి పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్స్ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. బాదం, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ హార్ట్ హెల్త్‌కు మంచివి.

డైట్​తో బీపీ తగ్గుతుందా?

ఫుడ్​లో మార్పులు చేస్తే కచ్చితంగా బీపీ కంట్రోల్ అవుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. DASH Diet అనుసరించినవారిలో బీపీ గణనీయంగా తగ్గిందని అనేక అధ్యయనాలు తెలిపాయి. ఉప్పు(సోడియం) 1500 mg లోపు తీసుకున్నవారికి బీపీ కంట్రోల్ అయినట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది. పండ్లు, కూరగాయలు, లో-ఫ్యాట్ ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనలు సూచించాయి. 

బీపీని తగ్గించే మరిన్ని అలవాట్లు.. 

బీపీ అదుపులో ఉంచుకోవాలనుకుంటే రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. అలాగే ఉప్పును తగ్గించాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి. రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకోవాలి. స్మోకింగ్ మానేసి.. వైద్యులు సూచించిన మందులు తీసుకుంటే కచ్చితంగా బీపీ అదుపులో ఉంటుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.