చలికాలం వచ్చేస్తోంది. రాత్రిళ్లు చలి మెల్లగా పెరిగిపోతోంది. చలికాలం వచ్చినా, రాకపోయినా ఎంతో మంది ఏసీలో రోజంతా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్ల కోసం రోజంతా ఏసీ ఉంచుతారు. ఉద్యోగులు కూడా ఏసీలోనే ఉంటున్నారు. దీని వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కొంతమంది చలిని తట్టుకోగలరు, కానీ చాలా మంది తట్టుకోలేరు. వారికి తెలియకుండానే ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గుండె చాలా ప్రభావితం అవుతుంది. ఏసీల్లో ఎక్కువ సేపు ఉండడం వల్ల మనకు తెలియకుండానే చిన్నగా వణుకు పుడుతుంది. ఇది గుండెకు అంత మంచిది కాదు. శరీరంలోని హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తాయి. దీని వల్ల రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు రక్తప్రసారానికి అడ్డుగా వస్తాయి. దీని వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. 


చలికాలంలో రక్తపోటు పెరగడం, తరగడం జరుగుతూ ఉంటాయి. దీని వల్ల బీపీ సమస్య రావచ్చు.  ఆ ప్రభావం గుండెపై ప్రభావం పడుతుంది. గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆస్తమా వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. ఏసీలో నిత్యం ఉండే వాళ్లకి ఊపిరితిత్తుల సమస్యలు త్వరగా వస్తాయి. ఊపిరితిత్తుల్లోకి గాలి సరిపడా అందక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీని వల్ల గుండె సమస్యలు రావచ్చు. గుండె పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. 


రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉన్న వారు ఏసీల్లో ఎక్కువ సేపు ఉండడం వల్ల కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉప్పు, కారాలు, మసాలాలు, నూనెలు వంటివి నిండుగా ఉన్న ఆహారం తినడం వల్ల గుండె మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఏసీల్లో ఉండడం వల్ల శరీరం ఆహారాన్ని అరిగించుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి రాత్రి పూట చాలా తేలికపాలి ఆహారాన్ని తినాలి. ఏసీల్లో ఎక్కువ సమయం ఉండే వారిలో ముక్కు, గొంతు సమస్యలు వస్తాయి. గొంతు పొడి బారుతుంది. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. 


ఎవరైతే ఏసీలో అధికంగా గడుపుతారో వారికి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఏసీ వేయడం వల్ల గది అంతా పొడిగా మారుతుంది. దీని వల్ల ఏసీల్లో ఉన్న మనుషులంతా డీ హైడ్రేషన్ బారిన పడతారు. కనీసం వారు ఆ విషయాన్ని గుర్తించలేరు. చర్మం పొడి బారే సమస్య కూడా పెరుగుతుంది. చర్మంపై దురదలు కూడా వస్తాయి. కాబట్టి ఏసీ వాడకాన్ని తగ్గించాలి. చల్లదనం శరీరానికి అంత మంచిది కాదు. కాబట్టి రోజులో కనీసం గంట సేపైనా ఎండలో తిరిగేందుకు ప్రయత్నించాలి. 


Also read: పీడకలలు వస్తుంటే తేలికగా తీసుకుంటున్నారా? వాటి ఫలితం ఇదే












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.