Brain Boosting Snacks : ఎంత చదివినా గుర్తుండట్లేదు.. ఈ పని చేయాలనుకుని మరిచిపోయి వేరే పనిని చేసేస్తున్నాను. అసలు ఈ మధ్య నా బ్రెయిన్ పని చేయట్లేదనిపిస్తుంది. దీనివల్ల నా వర్క్ ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ఎన్నో కంప్లైయింట్స్.. చిన్నా, పెద్దా తేడా లేకుండా మనం రోజూవారి జీవితాల్లో వింటూ ఉంటాము. దీని అంతటికీ కారణం బ్రెయిన్ హెల్త్ సరిగ్గా లేకపోవడమే. 


అందుకే బ్రెయిన్ షార్ప్​గా పనిచేయడానికి.. హెల్తీగా ఉంచుకోవడానికి కొన్ని ఫుడ్స్ రోజూ తినాలంటున్నారు నిపుణులు. వాటిని తినడం వల్ల బ్రెయిన్ హెల్త్ మెరుగై.. జ్ఞాపకశక్తిని పెంచడంలో, పనిపై శ్రద్ధ వహించి ఫోకస్ చేయడంలో హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? వాటి ప్రభావం బ్రెయిన్​పై ఎలా ఉంటుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


వాల్​నట్స్


వాల్​నట్స్​లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ ఉంటుంది. ఇవి జ్ఞాపకశక్తి మెరుగుదలకు హెల్ప్ చేస్తాయి. వీటిని బ్రేక్​ఫాస్ట్​లో కలిపి తీసుకుంటే మెదడు కణాలు యాక్టివ్ అవుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో హెల్పే చేస్తుంది. 


బ్లూబెర్రీలు 


బ్లూబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్​లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును వృద్ధాప్య సమస్యల నుంచి కాపాడుతాయి. నాడీ సంబంధ సమస్యలు రాకుండా మెరుగుపరుస్తాయి. కాబట్టి వీటిని నేరుగా తినేయొచ్చు. యోగర్ట్​తో తింటే దీని రుచి మరింత మెరుగవుతుంది. 


డార్క్ చాక్లెట్ 


డార్క్​చాక్లెట్​లో 70 శాతం కోకో ఉంటుంది. వీటిలో ఫ్లేవనాయిడ్స్, కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫోకస్​ని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. 


గుమ్మడి గింజలు 


గుమ్మడి సీడ్స్​లో మెగ్నీషియం, జింక్, ఇనుము, కాపర్ వంటి మినరల్స్​తో నిండి ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని సలాడ్స్​లో లేదా నేరుగా స్నాక్స్​గా తీసుకోవచ్చు. ఇవి ఒత్తిడిని తగ్గించి.. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. 


బాయిల్డ్ ఎగ్స్


గుడ్లలో కోలిన్ ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచి.. మెదడు అభివృద్ధి చెందడంలో హెల్ప్ చేస్తుంది. ఉడికించిన గుడ్లను చిన్నపిల్లలనుంచి పెద్దలవరకు అందరూ తినొచ్చు. ఇది మెదడుకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. పైగా ప్రోటీన్​ కూడా పుష్కలంగా లభిస్తుంది. 



ఇవే కాకుండా యోగర్ట్​, క్యారెట్స్, వోట్మీల్, అవకాడో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యోగర్ట్​ని నేరుగా తింటే మంచిదే కానీ.. ఫ్లేవర్స్​ ఉండేది తినకపోవడమే మంచిది. ఇవన్నీ మెరుగైన జ్ఞానాన్ని అందించి.. మెదడు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మతిమరుపు, వృద్ధాప్యంలో వచ్చే మెదడు సమస్యలను దూరం చేస్తుంది. అందుకే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు. అయితే వీటిని డైట్​లో చేర్చుకునే ముందు నిపుణుల సలహా కూడా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. 


Also Read : మహిళల్లో పొట్ట పెరగడానికి కారణాలివే.. ఫ్లాట్ బెల్లీ కోసం ఈ డ్రింక్స్ తాగేయండి




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.