Can wet hair make you fall sick : తడి జుట్టుతో బయటకు వెళ్తే పెద్దలు మందలిస్తూ ఉంటారు. తడి జుట్టుతో ఉండకూడదని తిడతారు. వారి కోపం వెనుక కారణం ఉందంటున్నారు నిపుణులు. తడి జుట్టుతో బయటకు వెళ్లినా.. నిద్రపోయినా.. ఇబ్బందులు తప్పవంటున్నారు. జలుబు, న్యుమోనియా లాంటి సమస్యలకు కారణం అవుతుందంటున్నారు. అసలు తడి జుట్టుతో కలిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు చూద్దాం..


తడి జుట్టుతో బయటికి వెళ్తే న్యుమోనియా వస్తుందా?   


తడి జుట్టుతో బయటకు వెళ్లడం వల్ల నేరుగా న్యుమోనియా రాదు. కానీ, రోగ నిరోధక శక్తి బలహీనం అవుతుంది. జలుబు సహా పలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందంటున్నారు పల్మొనాలజిస్టులు. న్యుమోనియా ప్రధానంగా బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు ఊపిరితిత్తులకు సోకడం వస్తుంది. జలుబు కూడా శ్వాస అవయవాలకు వైరస్ సోకడం వల్ల వస్తుంది. తడి జుట్టు అనేది శరీర ఉష్ణోగ్రత తగ్గించి శ్వాస సంబంధ సమస్యలు పెంచే అవకాశం ఉంటుంది. నేరుగా న్యుమోనియాకు తడి జుట్టుకు సంబంధం లేకపోయినా, ఇన్ డైరెక్ట్ గా కారణం అవుతుంది.  


తడిజుట్టుతో నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురికావడం పట్ల ఎలాంటి కచ్చితమైన అధ్యయనం లేదు. కానీ, UK నేషనల్ హెల్త్ సర్వీస్ రిపోర్టు ప్రకారం తడి జట్టు జలుబుకు కారణం అవుతుంది. తడి జుట్టు పలు శ్వాస సమస్యలకు కారణం అయ్యే సూక్ష్మజీవుల ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఈ వైరస్ లు శరీరంలోకి వెళ్లి న్యుమోనియా, జలుబుకు కారణం అవుతాయి.  


1.జుట్టు డ్యామేజ్ అయ్యే అవకాశం


తడి జుట్టుతో పడుకోవడం వల్ల హెయిర్ బాగా డ్యామేజ్ అవుతుంది. తడి కారణంగా జుట్టు పెళుసుగా తయారవుతుంది. ఈజీగా విరిగిపోతుంది.


2.నిద్రకు భంగం కలుగుతుంది


తడి జుట్టు శరీర ఉష్ణోగ్రతను మరింత తగ్గిస్తుంది. ఏసీ రూమ్ లో ఉండే వారికి మరింత చల్లగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది.  


3.రోగనిరోధక శక్తిని బలహీనం అవుతుంది


తడి జుట్టు రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. చల్లదనం శరీరంపై ఒత్తిడి కలిగిస్తుంది. అంతేకాదు, వ్యాధికారక సూక్ష్మక్రిములు పెరిగి, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది.


4.బ్యాక్టీరియా పెరుగుదలను అనుకూలం


తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా ఈజీగా పెరుగుతుంది. తడి జుట్టుతో నిద్రించడం పట్ల దిండు చుట్టూ తేమ ఏర్పడి శ్వాస సంబంధ సమస్యలకు కారణం అయ్యే వైరస్ లు పెరుగుతాయి. 


5.చుండ్రుకు కారణం కావచ్చు


తడి జుట్టు చుండ్రుకు కారణం అవుతుంది. తడిదనం తల మీద ఈస్ట్ లాంటి శిలీంధ్రాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇది చుండ్రు ఏర్పడటానికి కారణం అవుతుంది.  


సో, తన స్నానం చేయగానే వీలైనంత వరకు ఆరేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తేమను గ్రహించడానికి టవల్ లేదంటే హెయిర్ ర్యాప్ ఉపయోగించాలి. తడి జుట్టును ఆరబెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.


Read Also: మీ పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తింటున్నారా? జరిగేది ఇదే.. జాగ్రత్త!