రీరానికి నిద్ర చాలా అవసరం. మీరు రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. రోజుకు కనీసం 7 గంటలు నిద్ర ఉండాలి. సరిగా నిద్రపోకపోతే అది మీ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర తక్కువ అయితే రోజంతా బడలికగా, కళ్ళు మంటలు పుడుతూ నీరసంగా ఉంటారు. ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం ఎంత ముఖ్యమో.. రాత్రి నిద్ర కూడా అంతే ముఖ్యం. రాత్రి నిద్రతో పోల్చుకుంటే పగటి నిద్ర ప్రభావం వేరుగా ఉంటుంది. మీరు నిద్రలేమితో బాధపడుతుంటే వ్యాధులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల శరీరం బాగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. నిద్ర లేమి వల్ల రోగనిరోధక శక్తి, నాడీ వ్యవస్థ, శరీర అవయవాల పనితీరు గాడి తప్పుతాయి. 


నిద్ర వల్ల కలిగే లాభాలు 


⦿ కణాల పునరుద్ధరణకు నిద్ర చాలా సహాయపడుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు శరీరంలోని కణాలు మరియు కండరాలు తమను తాము రిపేర్ చేసుకుంటాయి. కణాల పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. కణజాలాలను నిర్మించి మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది. 


⦿ మెదడు సక్రమంగా పని చెయ్యడానికి నిద్ర బాగా అవసరం. నిద్రపోతున్నపుడు మెదడు నాడీ వ్యవస్థ నుంచి అన్ని వ్యర్థాలను తొలగిస్తుంది. మీరు ఉదయం లేచినప్పుడు మెదడు బాగా పని చెయ్యడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి , నేర్చుకోవడం వంటి విధులను ప్రభావితం చేయడంలో నిద్ర కీలకంగా వ్యహరిస్తుంది. 


⦿ రోగనిరోధక శక్తిని పెంచేందుకు నిద్ర సహాయపడుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం సైటోకిన్ లను విడుదల చేస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, వైరస్ లతో పోరాడేందుకు సహకరిస్తుంది. మనం కనుక సరిగా నిద్రపోకపోతే సైటోకిన్ విడుదల సక్రమంగా జరగదు. ఫలితంగా మనం అనారోగ్యానికి గురికావలసి వస్తుంది. 


నిద్రలేమి వల్ల నష్టాలు 


⦿ నిద్ర లేకపోతే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 


⦿ డిప్రెషన్, అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.


⦿ ఆలోచనవిధానం మందగిస్తుంది.  


⦿ సరిపడినంత నిద్ర లేకపోతే ఊబకాయం, అధిక బరువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిద్ర లేమి వల్ల ఆకలి పెరుగుతుంది. దీని వల్ల ఎక్కువ కేలరీలు తీసుకునే ప్రమాదం ఉంది. 


⦿ నిద్ర గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. సరిగా నిద్రపోకపోతే రక్తపోటు స్థాయిలు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. 


గమనిక: పలు అధ్యయనాలుపరిశోధనలుహెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also read: ఈ పదార్థాలు ఇచ్చిన డేట్ కంటే ముందే ఎక్స్‌పైర్ అవుతాయి , జాగ్రత్త పడండి


Also read: మీ పిల్లలు తొమ్మిది గంటలకన్నా తక్కువ నిద్రపోతున్నారా? ఈ నష్టాలు తప్పవంటున్న కొత్త అధ్యయనం