Fish: ఎంతోమంది నాన్ వెజ్ ప్రియులకు చేపలు అంటే చాలా ఇష్టం. వాటిని రకరకాలుగా వండుకొని తింటారు. వానాకాలంలో కూడా చేపలు అధికంగానే తినే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే పోషకాహారం నిపుణులు చెబుతున్న ప్రకారం వర్షాకాలంలో చేపలు తినడం సరైన పద్ధతి కాదు. చేపలకు బదులు ఇతర మాంసాహారాలతో సరిపెట్టుకోవడమే మంచిది. వానాకాలంలో చేపలు తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు.


వానా కాలం అనేది చేపలకు గుడ్లు పెట్టి పొదిగే కాలం. మీకు దొరికే చేపలన్నీ అంతకుముందే పట్టి... ఫ్రీజర్లో దాచి అమ్ముతూ ఉంటారు. వానాకాలంలో సముద్రంలో చేపలు పట్టేందుకు  అనుమతి లేదు. భారీ వర్షాలు, గాలి ఉన్నప్పుడు ఎవరు చేపలు పట్టేందుకు వెళ్లరు. అలాంటప్పుడు మార్కెట్లో చేపలు ఎలా లభిస్తాయి? అవన్నీ కూడా ఫ్రీజర్లో రోజులపాటు నిల్వచేసిన చేపలే. ఇలా నిలువ చేసేందుకు కొన్ని రసాయనాలను కూడా వాడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి చేపలను కొనక పోవడమే మంచిది. లేకుంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది.


ఫ్రీజర్లో కొన్ని రోజులపాటు ఉంచిన చేపలు చప్పగా అయిపోతాయి. వాటిలో ఎలాంటి నాణ్యత ఉండదు. చూసేందుకు చేపలే కానీ వాటిని వండుకొని తింటే తెలుస్తుంది. వాటి రుచి ఎంత చెత్తగా ఉంటుందో. అంతేకాదు వర్షాకాలంలో కలుషిత నీరు నదులు, సముద్రాల్లో ప్రవేశిస్తాయి. ఆ సమయంలో ఆ నీటిలోనే చేపలు గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ కలుషిత నీటిలో ఉన్న చేపలను పట్టి  అమ్ముకునే వారు కూడా ఉన్నారు. అలాంటి చేపలు తినడం వల్ల పచ్చకామెర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


కాబట్టి వానాకాలంలో రెండు నెలలు పాటు చేపలు పూర్తిగా తినక పోవడమే మంచిది. తాజాగా కనిపించేలా చేయడం కోసం  సల్ఫేట్లు, ఫాలీఫాస్పేట్లు వంటి రసాయనాలు వాడతారు. ఇవి మన ఆరోగ్యానికి హాని చేసేవి. కాబట్టి వానాకాలం ముగిసే వరకు చేపలకు దూరంగా ఉంటే ఎంతో మంచిది. భారీ వర్షాలు పడేటప్పుడు చేపలు, రొయ్యలు వంటివి తినడం వల్ల టైఫాయిడ్, పచ్చకామెర్లు, డయేరియా వంటివి వచ్చే అవకాశం ఎక్కువ. సైనసైటిస్, మైగ్రేన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వంటివి వానాకాలంలోని చేపలు తినడం వల్ల వస్తాయి. వానాకాలం దాటాక మిగతా కాలాల్లో చేపలు తినడం వల్ల మాత్రం ఆరోగ్యం బావుంటుంది. 


Also read: చాక్లెట్ అతిగా తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రాక తప్పవు



Also read: ఈ ఉద్యోగాలు చేసే మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన త్వరగా పడతారు



































































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.