క్రిస్మస్ రోజు  ఫ్రూట్ కేక్‌లు కట్ చేస్తారు చాలా మంది. ఆ కేకును కొనుక్కునే బదులు ఇంట్లోనే తయారుచేసుకుంటే బావుంటుంది. ఈ కేకును తయారుచేసి క్రిస్మస్ పండుగను చేసుకునే మీ స్నేహితులకు గిఫ్ట్‌గా కూడా ఇవ్వచ్చు. అయితే మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదు, అందుకే గోధుమపిండితో కేకును చేసుకోమని సిఫారసు చేస్తున్నాం. 


కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - ఒక కప్పు
రవ్వ - ముప్పావు కప్పు
దాల్చిన చెక్క పొడి - ఒక టీస్పూను
అల్లం పొడి - ఒక టీస్పూను
పెరుగు - ఒక కప్పు
బేకింగ్ సోడా - ఒక టీస్పూను
బేకింగ్ పొడి - ఒక టీస్పూను
ఖర్జూరాలు, జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, పిస్తాలు - ఒక కప్పు 
నూనె - వంద గ్రాములు
డేట్స్ సిరప్ - అరకప్పు


తయారీ ఇలా...
రెండు గంటల ముందే డ్రై ఫ్రూట్స్ నీటిలో నానబెట్టుకోండి. గోధుమ పిండి ఉండల్లేకుండా జల్లించి ఒక గిన్నెలో వేసుకోండి. ఆ పిండిలోనే రవ్వ, అల్లం పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పొడి, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మరొక గిన్నెలో పెరుగు (శాకాహారులు పెరుగు వేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్లు గుడ్లు వాడుకోవచ్చు) వేసుకోవాలి. ఆ పెరుగులో ముందుగా డేట్ సిరప్, వంటనూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బీటర్ తో బాగా కలుపుకున్నాక, ముందుగా నానబెట్టిన డ్రైఫ్రూట్స్ ను కలుపుకోవాలి. తరువాత గోధుమపిండి మిశ్రమాన్ని వేసి బాగా బీట్ చేయాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుని అడుగున వెన్న రాసి కొంచెం గోధుమపిండి చల్లాలి. కేకు మిశ్రమాన్ని మౌల్డ్ లో పోసి, పైన పిస్తాలు, బాదంలు చల్లాలి. ఈ లోపే ఓవెన్ ను 180 డిగ్రీల వద్దకు వేడి చేసుకోవాలి. ఓవెన్లో ఈ మౌల్డ్ ను పెట్టి 45 నిమిషాల పాటూ ఉంచాలి. తరువాత తీసి చూస్తే యమ్మీ ఫ్రూట్ కేక్ రెడీ. 



Also read: రెడ్ వైన్ తాగితే బరువు నుంచి డిప్రెషన్ వరకు ఏదైనా తగ్గాల్సిందే, మధుమేహులకు మరీ మంచిది



Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్









ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.