మనసులోని ప్రేమను వ్యక్తపరిచే భావనల్లో ‘ముద్దు’ది ప్రథమ స్థానం. ముద్దంటే కేవలం ప్రియుడికో, ప్రియురాలికో మాత్రమే పెట్టేది కాదు. తల్లి బిడ్డకు, భార్య భర్తకు, అన్నయ్య చెల్లికి... ఇలా ఎవరికి పెట్టినా ఆ ముద్దు చెప్పేది ఒక్కటే... ‘నువ్వంటే నాకెంతో ప్రేమ’అని. ఆ ముద్దు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.


ఆ  ముద్దు ప్రత్యేకం...
ప్రేయసీ ప్రియులు, లేదా భార్యా భర్తల మధ్య ముద్దుకు మాత్రం చాలా ప్రాధాన్యత ఉందని చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు. వారు ముద్దు పెట్టుకుంటే చెంపల మీదో, నుదుటి మీదో పెట్టుకోకపోవచ్చు. నేరుగా పెదాల మీదే, కాబట్టి ఆ ముద్దు మాత్రం ప్రత్యేకం. ముద్దు పెట్టేటప్పుడు వారిద్దరి మానసిక స్థితి మామూలుగా ఉండదు. తమ చుట్టూ అందమైన సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టు  హృదయం ఉప్పొంగిపోతుంది. ఆ జంటల ముఖాల్లో యవ్వన మెరుపు తొణికసలాడుతుంది. ఆ మెరుపు వల్ల వారి అందం రెట్టింపవుతుంది. ఒత్తిడి వల్ల చర్మం మెరుపును కోల్పోయినట్టు మారుతుంది, ఆ మెరుపును సులువుగా తిరిగి తెచ్చేది ముద్దేనట.  అంతేకాదు ముద్దు మెదుడుపై పడే ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట.


అంతసేపా?
మీకు తెలుసా? ఒక సాధారణ వ్యక్తి తన జీవిత కాలంలో 20,000 నిమిషాలు ముద్దుకే కేటాయిస్తాడు. కొందరిలో చర్మం, ముక్కు సంబంధిత అంశాలు చాలా సున్నితంగా ఉంటాయి. వారిలో హైపర్ సెన్సిటివ్ చర్యలను తగ్గించేందుకు ముద్దు సహకరిస్తుందట. అంతేకాదు మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సాయపడుతుంది. 


ఈ కండరాలన్నీ కష్టపడతాయి
ఒక్క ముద్దు... చెప్పడానికి చాలా సింపుల్. కానీ ఆ ఒక్క ముద్దు పెట్టడానికి ముఖంలో ఎన్ని కండరాలు కష్టపడతాయో తెలుసా? 34 ముఖ కండరాలు, 112 పోస్చురల్ కండరాలు(పొట్ట, వీపు ఇలాంటి చోట్ల ఉండే కండరాలు) కష్టపడతాయి. ముద్దు పెట్టుకోవడం వల్ల ఈ కండరాలన్నింటిలోనూ కదలికలు వచ్చి బిగుతుగా మారతాయి. ముఖ కండరాల కదలిక వల్ల చెంపలు జారినట్టు అవ్వకుండా బిగుతుగా మారి అందంగా కనిపిస్తాయి. అంతేకాదు కండరాలలో కలిగే ఒత్తిడి చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. చెంపల్లో రక్త ప్రసరణను పెంచుతుంది. 


పెదవులు, నాలుక, బుగ్గలు, ముఖం, దవడలు, మెడ కండరాలకు మంచి వ్యాయామాన్ని ఇచ్చేది ముద్దే. ముఖంలో ఉండే అతి చిన్న ముఖ కండరాలు కూడా కిస్ చేసేటప్పుడు పనిచేస్తాయి కాబట్టి రక్తప్రసరణ పెరుగుతుంది. అప్పుడు ముఖంపై పడే ముడతలు తగ్గుతాయి. త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించవు. మిమ్మల్ని యవ్వనంగా ఉంచేందుకు ముద్దు చాలా సహకరిస్తుంది. 


Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్
Also Read: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...
Also Read: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Also Read: చీరకట్టుకూ రవీంద్రనాథ్ ఠాగూర్‌ కుటుంబానికి మధ్య బంధమేంటి?








ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.