రెడ్ వైన్... నల్లద్రాక్ష రసాన్ని పులియబెట్టి చేసే ఒక పానీయం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ పానీయం తాగనిదే రోజు గడవదు చాలా మందికి. ఈ రెడ్ వైన్ కేవలం పానీయంగానే తీసుకోవడం లేదు, దీని వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కూడా ఉన్నాయి అంటున్నాయి కొన్ని అధ్యయనాలు.
రెడ్ వైన్ ఆల్కహాలేనా?
రెడ్ వైన్ పూర్తిస్థాయిలో ఆల్కహాల్ కాదు. కాకపోతే 12 నుంచి 15 శాతం వరకు ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. అయితే అధికంగా తాగితే మాత్రం అనారోగ్యం తప్పదు. తగిన మోతాదులో తీసుకుంటే దీని వల్ల కలిగే లాభాలు ఇన్నీ అన్నీ కావు.
రోజుకి ఎంత మోతాదు?
అధ్యయనాల ప్రకారం మహిళలు రోజుకి 150 ఎమ్ఎల్ రెడ్ వైన్ తాగొచ్చు. మగవారైతే 300 ఎమ్ఎల్ అంటే రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగవచ్చు.
ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో...
1. డయాబెటిక్ రోగులకు రెడ్‌వైన్ చాలా మేలు చేస్తుంది. వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. అయితే మితంగా తాగడం చాలా ముఖ్యం.
2. రెడ్ వైన్లోని పోషకాలు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
3. రెడ్ వైన్లో ఎపికాటెచిన్, కాటెచిన్, ప్రోయాంతోసైనిడిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లో నిండి ఉంటుంది. దీన్ని సంపూర్ణ పోషకాహారంగా చెప్పుకోవచ్చు.
4. జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్లను రాకుండా చేస్తుంది.
5. ఈ పానీయం మీ బరువుు అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. పిసిటానాల్ అనే రసాయన సమ్మేళనం శరీరంలోని కొవ్వు కణాలను తగ్గిస్తుంది.
6. రెడ్ వైన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ పానీయం పెద్దపేగు, ప్రొస్టేట్, కార్సినోమా, అండాశయ క్యాన్సర్లను నివారించడంలో ముందుంటుందని అధ్యయనాలు నిరూపించాయి. రెడ్ వైన్‌ను క్రమం తప్పకుండా మితంగా తీసుకోవడం క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
7. ఈ పానీయం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ, ఒత్తిడి వంటి సమస్యల నుంచి బయటపడచ్చు. ఇది మీ నరాలకు విశ్రాంతినిస్తుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: ముద్దు ప్రేమనే కాదు... అందాన్నీ పెంచుతుంది, ఇంకెందుకాలస్యం కానీయండి
Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్