Russian Woman Most Child Birth News : ప్రస్తుతం కాలంలో ఎవరినైనా పిల్లలు ఎంతమంది అంటే ఒకరు లేదా ఇద్దరు అని చెప్తారు. మరికొందరు అసలు పిల్లలే వద్దు డింక్ కల్చర్ అంటారు. వీరి కన్నా ముందుతరం వారు మాత్రం కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనేవారు. వారికంటే ముందుతరం వారు 7 లేదా 8 మందికి బర్త్ ఇచ్చేవారు. కానీ ఓ మహిళ మాత్రం 69 మందికి జన్మనిచ్చి గిన్నీస్ రికార్డ్(Guinness Records)​ను అందుకుంది. కేవలం 40 ఏళ్లల్లో 69 మందికి బర్త్​నివ్వగా.. 67 మంది హెల్తీగా పుట్టారట. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి?


40 ఏళ్ల వ్యవధిలో 69 మంది..


పిల్లలు పుట్టాలంటే ఉమెన్స్ రిప్రొడెక్టివ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్​గా ఉండాలి. రష్యాకు చెందిన ఓ మహిళ మాత్రం 67మంది పిల్లలకు జన్మనిచ్చి.. సూపర్ ఉమెన్​గా నిలిచింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పిల్లలను కంటూ వెళ్లిపోయింది. ఆమె పేరే వాలెంటీనా వాసిలీవ్. రష్యాకు చెందిన ఈ మహిళ 40 సంవత్సరాల వ్యవధిలో 69మంది పిల్లలను కన్నది. మొత్తంగా ఆమె జీవితంలో 27 సార్లు గర్భందాల్చింది. అత్యధిక పిల్లలకు జన్మనిచ్చిన మహిళగా గిన్నిస్ రికార్డు సృష్టించిది. 


27.. 69 సెట్ అవ్వట్లేదే.. 


ఖుషి మూవీలో పదేళ్లకు 17మంది పిల్లలు పుడతారు? 8సార్లు ప్రెగ్నెంట్ అయితే 17 ఎలా అని అడగ్గా 7 సార్లు కవలలు పుట్టగా ఎనిమిదోసారి ముగ్గురు అంటూ పవన్ కళ్యాణ్ నవ్వేస్తాడు. ఇదే డౌట్ వాలెంటీనా విషయంలో కూడా వస్తుంది. 27 సార్లు ప్రెగ్నెంట్ అయితే 69 మంది ఎలా పుట్టారనే డౌట్ చాలామందిలో ఉంటుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం.. ఆమెకు 16 కాన్పులలో కవలలు అంటే 32 మంది, ఏడు కాన్పులలో ముగ్గురు అంటే 21 మంది, నాలుగు సార్లు నలుగురు అంటే 16 మంది జన్మించారు. ఇది ఒక పెద్దవింతనే చెప్పవచ్చు. ఎందుకంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలకు జన్మనివ్వడమనేది సాధారణ విషయం కాదు. 


రిప్రొడెక్టివ్ హెల్త్..


సాధారణంగా ఓ మహిళ తన జీవితకాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందనే దానిపై సరైన సమాధానం లేదు. కానీ కొన్నిసమయాల్లో ఇది సాధ్యం కావొచ్చని చెప్తున్నారు. ఒకరిని కనేందుకే మహిళలు ఇబ్బందులు పడుతుంటే.. వాసిలీవ్ 69మందికి జన్మనిచ్చి స్ట్రాంగ్ లేడీ అనిపించుకుంది. అయితే నిపుణులు మాత్రం ఆమె రిప్రొడెక్టివ్ హెల్త్ చాలా స్ట్రాంగ్​గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే స్త్రీ గర్భం దాల్చడం చాలా కష్టమైన పని. శారీరకంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల్ని కంటూ ఉన్నా ఆమెకు మళ్లీ గర్భం వచ్చిందంటే కారణం ఆమెకు మంచి రిప్రొడెక్టివ్ హెల్త్​ ఉందనే అర్థమని అంటున్నారు. అందుకే వాసిలీవ్ ఎలాంటి సమస్యలు లేకుండా 27సార్లు గర్భం దాల్చి.. 69 మందికి జన్మనిచ్చింది. 



రికార్డ్ బ్రేక్ కష్టమే..


రష్యాకు చెంది వాలెంటినా వాసిలీవా రైతు కుటుంబానికి చెందిన మహిళ. ఈమె 1725 నుంచి 1765 మధ్య కాలంలో 27 సార్లు గర్భం దాల్చి 69మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఈమె భర్తకు ఈమె రెండో భార్య అట. మొదటి భార్యకు 8 మంది పిల్లలు కాగా.. రెండో భార్య అయిన వాసిలీవాకు 69మంది పుట్టారు. వారిలో 67 మంది హెల్తీగా ఉంటే.. మరో ఇద్దరు ఆరోగ్య సమస్యలతో చనిపోయారు. ఇలా ఎక్కువమంది పిల్లలను కన్న తల్లిగా వాసిలీవా గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకుంది. ఈ రికార్డును బ్రేక్​ చేయడం మరి ఎవరి వల్ల కాదేమో..



Also Read : పెళ్లికాకుండానే ఎగ్​ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? బెనిఫిట్స్ ఏంటి? దీంతో ఎంత లేట్​గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు?