Festival Dessert Recipes : సాధారణంగా పండుగల సమయంలో స్వీట్స్​ని ఎక్కువగా చేసుకుంటారు. పిల్లలనుంచి పెద్దలవరకు అందరూ ఈ స్వీట్స్, పిండి వంటల గురించి ఎదురు చూస్తారు. అలా నోటికి రుచిగా, టేస్ట్​లో మంచి అనుభూతిని అందించే స్వీట్ రెసిపీ ఇక్కడుంది. అదే ఖర్జూర హల్వా. దీనిని తయారు చేయడం చాలా తేలిక. దసరా, దీపావళిరోజుల్లో ఇంట్లో చక్కగా.. అతి తక్కువ పదార్థాలతో ఈ ఖర్జూర హల్వా(Dates Halwa Recipe)ను టేస్టీగా చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


ఖర్జూరం - 500 గ్రాములు


పంచదార - 250 గ్రాములు


నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు


పాలు - రెండు కప్పులు


యాలకుల పొడి - 1 టీస్పూన్


బాదం - 1 టేబుల్ స్పూన్ 


పిస్తాపప్పు - 1 టేబుల్ స్పూన్


తయారీ విధానం


ముందుగా డేట్స్​లోపలి గింజలు తీసేయండి. గింజలు లేని ఖర్జూరాలను వేడి నీటిలో వేయాలి. వీటిని గంటపాటు పక్కన వదిలేయాలి. అనంతరం నానిన ఖర్జూరాలను బ్లెండర్​లో వేసి.. గుజ్జుగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై మందపాటి కడాయి పెట్టాలి. దానిలో నెయ్యి వేసి.. ఖర్జూరం గుజ్జు వేసి బాగా కలపాలి. ఖర్జూరాన్ని బాగా కలిపి.. స్టౌవ్ మంటను తగ్గించి ఉడికించుకోవాలి. దానిలో పాలు, పంచదార వేసి ఉండలు చుట్టూకోకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. కలపకుంటే అడుగు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 


Also Read : సరస్వతీ దేవి రూపంలో అమ్మవారికి దద్దోజనంతో పాటు సమర్పించే నైవేద్యం ఇదే.. నవరాత్రుల్లో ఏడో రోజు ఇవి చేయాలట


పంచదార కరిగిన తర్వాత.. మిశ్రమాన్ని బాగా కలపి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఖర్జూర మిశ్రమం ఉడికి.. గట్టిపడుతుంది. ఆ సమయంలో మిశ్రమం పాన్​ని వదిలేస్తుంది. అలా పాన్​ని అంటుకోకుండా ఖర్జూరం సిద్ధమవుతున్న సమయంలో యాలకుల పొడి వేయాలి. అది కలిసేవరకు బాగా కలిపి.. స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ టేస్టీ ఖర్జూరం హల్వా రెడీ. సర్వ్ చేసుకునేప్పుడు బాదం, పిస్తా పలుకులు చల్లి సర్వ్ చేసుకోవచ్చు. దీనిని వేడిగా తిన్నా రుచిగానే ఉంటుంది. ఫ్రిజ్​లో పెట్టుకుని తిన్నా మంచి రుచినే ఇస్తుంది. 



ఒకవేళ మీరు హల్వాను నేరుగా కాకుండా.. నచ్చిన రూపాల్లో తీసుకోవాలనుకుంటే.. ఈ హల్వాను నెయ్యి రాసిన ప్లేట్​పై పరిచి.. 20 నిమిషాలు పక్కన ఉంచేయాలి. హల్వా చల్లారిన తర్వాత దానిని ముక్కలుగా కట్ చేసి.. ప్లేట్​ నుంచి వేరు చేసుకోవచ్చు. దీనిని ఇలా ముక్కలుగా కూడా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకు దీనిని బ్రౌనీలు, చాక్లెట్ల మాదిరి అందించవచ్చు. దీపావళి సమయంలో ఈ తరహా స్వీట్ చేసి.. బంధు, మిత్రులతో షేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ దీనిని ఇష్టంగా స్వీకరిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పండక్కీ మీరు కూడా ఈ టేస్టీ స్వీట్ రెసిపీ చేసి ఇంటిల్లీపాదికి పెట్టేయండి. 



Also Read : టేస్టీ సగ్గుబియ్యం పాయసం.. నిమిషాల్లో చేసుకోగలిగే రెసిపీ ఇదే