Hyderabad Crime News: నీ నవ్వు బాగుంటుంది... నువ్వు అందంగా ఉన్నావ్... అన్న రెండు మాటలు ఆమె బ్యాగ్ సర్దుకొని లండన్ నుంచి వచ్చేసింది. 17 ఏళ్ల వివాహ బంధాన్ని, ఇద్దరు బిడ్డలను కాదని వేరే వ్యక్తి వ్యామోహంతో చిక్కుల్లో పడింది. హైదరాబాద్‌ో జరిగిన ఘటన పోలీసులను కూడా పరిగెత్తించింది.  


హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు 17 క్రితం వివాహమైంది. భర్తకు ఏడాదిన్నర క్రితం లండన్‌లో ఉద్యోగం వచ్చింది. భార్యాబిడ్డలను హైదరాబాద్‌లోనే విడిచిపెట్టి లండన్‌ వెళ్లిపోయారు. కొన్ని రోజుల క్రితం తన తల్లి చనిపోయింది. ఆమె అస్తికలను పుణ్యనధుల్లో కలిపేందుకు ట్యాక్సీ బుక్ చేసింది. ఇదే ఆమె జీవితంలో పెను తుపాను రేపింది. 


ట్యాక్సీ బుక్ చేసుకున్న ఆమె... గూగుల్‌పే ద్వార పేమెంట్ చేసింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఓ ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. చూస్తే గతంలో తాను బుక్ చేసిన క్యాబ్‌డ్రైవర్‌దిగా గుర్తించింది. పొరపాటున వచ్చిందేమో అనుకుంది. గుడ్‌ మార్నింగ్, గుడ్‌నైట్ మెసేజ్‌లు రోజూ రావడంతో ఒకరోజు స్పందించింది. అంతే అక్కడి నుంచి స్టోరీ మొత్తం మారిపోయింది.  


ఇద్దరి మధ్య మెసేజ్‌లు కొనసాగాయి. మేడమ్‌తో మొదలైన మెసేజ్‌లు చాలా దూరం వెళ్లిపోయాయి. నీ నవ్వు బాగుంటుంది... నీవు చాలా అందంగా ఉంటావంటూ ఆ డ్రైవర్ ఇంప్రెస్ చేయడం మొదలు పెట్టాడు. ఇది చాటింగ్‌తో స్టార్టైన పరిచయం మీటింగ్స్ వరకు వెళ్లింది. ఇలా తరచూ బయటకు వెళ్తుండటంతో ఇంట్లో వాళ్లకు అనుమానం వచ్చింది.  


విషయాన్ని లండన్‌లో ఉన్న భర్తకు అత్తింటి వాళ్లు చెప్పారు. పరిస్థితి దారి తప్పుతుందని గ్రహించిన భర్త కూడా ఆమెను సెప్టెంబర్‌ 16న లండన్ తీసుకెళ్లిపోయాడు. అక్కడకు వెళ్లినా ఇద్దరి మధ్య మాట్లాడుకోవడం ఆగలేదు.చాటింగ్ కూడా సాగుతోంది. 


ఇంతలో ఆ ఫ్యామిలీలో మరో విషాదం జరిగింది. ఈసారి వివాహిత తల్లి మరణించారు. మళ్లీ సెప్టెంబర్‌ 29న భర్త హైదరాబాద్ వచ్చాడు. లండన్‌లోనే ఉన్న తల్లి సెప్టెంబర్ 30న ఇద్దరు పిల్లల్ని తీసుకొని పార్క్‌కు వెళ్లింది. ఆ పిల్లల్ని పార్కులో ఆడుకోమని చెప్పి ఉడాయించింది. 


ఇప్పుడే వెళ్లి వస్తానని చెప్పిన తల్లి చీకటిపడినా రాకపోవడంతో పార్కులో ఆడుకుంటున్న పిల్లలు కంగారు పడ్డారు. తండ్రికి ఫోన్ చేశారు. అమ్మలేదని, తాము ఒంటరిగా ఉన్నామని చెప్పారు. వెంటనే తండ్రి లండన్ చేరుకున్నారు. భార్య ఫోన్‌కు ఫోన్ చేశారు. ఫోన్ కలవలేదు. 


లండన్ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్‌ వచ్చిన ఆ వివాహిత నేరుగా ట్యాక్సీ డ్రైవర్‌ శివను కలిసింది. భర్త ఫోన్ కలవడంతో అసలు విషయం చెప్పింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పుకొచ్చింది. శంషాబాద్‌ మధురానగర్‌ నుంచి బాలాపూర్‌ వైపు తీసుకెళ్తున్నట్లు వివరించింది.  


కంగారుపడ్డ ఆమె భర్త తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారి సలహా మేరకు ఆర్‌జీఐఏ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాడు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఆర్‌జీఐఏ, రాజేంద్రనగర్, బోయిన్‌పల్లిలో గాలింపు చేపట్టారు. ఆమె ఫోన్‌ ట్రాక్ చేశారు. చివర లొకేషన్‌ రాజేంద్రనగర్‌లో ఉన్నట్టు గుర్తించారు. 


తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. ఆమె తరచూ మాట్లాడే ట్యాక్సీ డ్రైవర్‌ ఫోన్‌ నెంబర్‌కు పోలీసులు కాల్ చేశారు. ఓ సారి వివాహిత మాట్లాడి  డ్రైవర్ తనను ట్రాప్ చేశాడని గోవా తీసుకొచ్చినట్టు చెప్పింది. గోవా నుంచి బస్‌లో వస్తున్నట్టు వాట్సాప్ చేసింది. సోమవారం ఉదయం ఆరాంఘర్‌ ఆ బస్‌ను ట్రాక్ చేసిన పోలీసులు వారిద్దర్ని స్టేషన్‌కు తరలించారు. 


చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లినందుకు సీటీపై పేరు రాసి చనిపోతానంటూ బెదిరించడంతో తాను రావాల్సి వచ్చిందని వివాహిత వివరించింది. తన పుట్టిన రోజు వేడుకకు రావాలని చెప్పడంతో ఆమె వచ్చిందని ట్యాక్సీ డ్రైవర్‌ చెప్పాడు. ఇష్టపూర్వకంగానే వచ్చిందని పోలీసులకు తెలిపాడు. 


మొత్తానికి ఇరువైపుల నుంచి ఇష్టపూర్వకంగానే వ్యవహరం నడిచిందని పోలీసుల విచారణలో తేలడంతో ఎలాంటి కేసులు లేకుండా వివాహితను లండన్ పంపించేశారు. పోలీసులే స్వయంగా ఆమెను లండన్‌ విమానం ఎక్కించారు. ఇలాంటివి చేయొద్దని చెప్పి ట్యాక్సీ డ్రైవర్‌కు క్లాస్ పీకి వదిలేశారు.