Visual Impairment and Dementia Risk : కంటి ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే.. భవిష్యత్తులో మీ మెదడు సమస్యలను అంత దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. జాన్స్ హాప్​కిన్స్ బ్లూమ్​బెర్గ్​ స్కూల్​ ఆఫ్ పబ్లిక్​ హెల్త్ ఎపిడెమియాలజిస్ట్ జాసన్ స్మిత్ నేతృత్వంలో దృష్టి లోపం, దృష్టి సమస్యలపై తాజాగా ఓ అధ్యయనం చేశారు. అయితే ఈ పరిశోధనలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వారు కనుగొన్నారు. ఇంతకీ అవి ఏంటి? నిజంగానే కంటిచూపు ప్రభావం మెదడుపై ఉంటుందా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  


పరిశోధనల్లో తేలింది ఇదే


ప్రపంచవ్యాప్తంగా చిత్తవైకల్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధిన ప్రమాద కారకాలను గుర్తించి పరిష్కరించే పనిలో నిపుణులు చూస్తున్నారు. దీనిలో భాగంగా చేసిన అధ్యయనంలో దృశ్య సమస్యలు చిత్తవైకల్యానికి ఓ రకంగా కారణమవుతున్నాయని గుర్తించారు. అభిజ్ఞా సమస్యలతో బాధపడుతున్న వారిపై పరిశోధనలు చేశారు. వారి రెటీనాలోని మార్పులు జ్ఞాపకశక్తి, గ్రహణశక్తికి బాధ్యత వహించే మెదడులోని ప్రాంతాలలో మార్పులు కలిగిస్తుందని గుర్తించారు. 


మెదడుపై భారం పెరుగుతుంది..


ఈ మార్పులను బట్టి చూస్తే.. కంటి సమస్యలు, చిత్త వైకల్యం(అల్జీమర్స్​)కు మధ్య పరస్పర సంబంధం కలిగి ఉందనే వాదన బలపడింది. సాధారణంగా వయసుతో పాటు అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. అయితే గ్లోకామా బదులుగా వాస్కులర్ డిమెన్షియాతో లింక్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. దృష్టి లోపం చిత్రవైకల్యం ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధన బృందం గుర్తించింది. అలాగే వినికిడి లోపం కూడా న్యూరోడెజెనరేషన్​తో లింక్ కలిగి ఉన్నట్లు తేలింది. ఈ లోపాలు మెదడుపై డిమాండ్​ని పెంచి నష్టాలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాయట. దీనికోసం శరీరంలోని ఇతర భాగాల నుంచి వనరులు తీసుకుని ప్రెజర్​కు గురవుతుందని చెప్తున్నారు. 


ఇవే కాకుండా.. 


ఆర్థిక మాంద్యం, సామాజిక ఒంటరితనం, శారీరక శ్రమ లేకపోవడం కూడా అల్జీమర్స్​కు దారి తీస్తుందని డ్యూక్ యూనివర్సిటీ న్యూరాలజిస్ట్ హీథర్ విట్సన్ గతంలోనే గుర్తించారు. అందుకే వీటిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని చెప్తున్నారు. అలాగే దృష్టి సమస్యలను కూడా పరిష్కరించుకోవడం వల్ల చిత్తవైకల్యం తగ్గే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. 



ఇలా కంట్రోల్ చేయవచ్చు


రీసెంట్​గా చేసిన అధ్యయనంలో 19 శాతం చిత్తవైకల్యం కేసుల్లో ఒకరు దృష్టి సమస్యలతో రిలేట్ అయి ఉన్నారని కనుగొన్నారు. కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడం, కంటి శుక్లం వంటి పరిస్థితుల్లో కాంట్రాస్ట్ సెన్సిటివిటీని కోల్పోతున్నట్లు గుర్తించారు. కంటి సమస్యల్లో దాదాపు 80 శాతం వరకు సమస్యలకు చికిత్స చేయవచ్చు లేదా కంట్రోల్ చేయవచ్చని.. దీనివల్ల మెదడుపై ఎలాంటి ప్రెజర్ ఉండదని చెప్తున్నారు. అయితే అన్ని లోపాలు ఒకే స్థాయి ప్రమాదాన్ని కలిగి ఉండవని తెలిపారు. 


Also Read : బ్రెయిన్ బ్లీడింగ్ అంటే ఏమిటీ? శివరాత్రికి యాక్టివ్‌గా ఉన్న సద్గురుకు సడన్‌గా సర్జరీ ఎందుకు చేశారు?
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.