South Indian Dosa in Uniqe Way : దోశలంటే చాలామందికి ఇష్టముంటుంది. కానీ పిండి ప్రోసెస్​ పెద్దగా ఉంటుంది. బ్యాటర్ రెడీ చేసుకునే ఆర్డర్ చేసుకునే దోశలు వేసుకుంటారు. కానీ దోశ పిండి లేనప్పుడు టేస్టీగా దోశలు తినాలంటే బయటకే వెళ్లాలా? ఇంట్లోనే టేస్టీగా చేసేసుకోవచ్చు. అదేంటి దోశపిండి లేకుండా దోశలు ఎలా వేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీ సందేహాలు పక్కన పెట్టి.. ఈ సింపుల్ రెసిపీ ఫాలో అయిపోండి. మరి ఈ దోశలు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో? దానిని ఎలా తయారు చేయాలో? ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


శనగపిండి - 1 కప్పు


సాల్ట్ - రుచికి తగినంత


బంగాళదుంప - 1 


ఎండుమిర్చి - 1


వెల్లుల్లి - 3 రెబ్బలు


పెరుగు - 2 స్పూన్లు


బియ్యం పిండి - 1 కప్పు


నీళ్లు - తగినంత


బేకింగ్ సోడా - 1 టీస్పూన్


పంచదార - చిటికెడు


తయారీ విధానం


ముందుగా బంగాళదుంపపై తొక్కను చెక్కి.. దానిని ముక్కలుగా కోయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. దానిలో బియ్యం పిండి, శనగపిండి, బంగాళదుంప ముక్కలు వేయాలి. ఎండు మిర్చి, వెల్లుల్లి, పంచదార, తగినంత ఉప్పు, నీళ్లు, పెరుగు వేసి పిండిని మిక్సీ పట్టాలి. బంగాళ దుంప పిండిలో బాగా మిక్స్ అయ్యేవరకు మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్​లోకి తీసుకుని.. దానిలో బేకింగ్ సోడా వేసుకుని కలిపి.. ఓ పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చితో కొంచెం కారం, పంచదారతో దోశలు మంచి టేస్ట్, రంగును వస్తాయి.


స్టౌవ్ వెలిగించి దానిపై దోశ పాన్ పెట్టండి. అది వేడి అయ్యాక నూనె అప్లై చేసి.. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని మరోసారి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని పాన్​పై వేయాలి. చుట్టూ అంచులకు నూనె వేసి దోశను రోస్ట్ చేసుకోవాలి. ఒకవైపు పూర్తిగా రోస్ట్ చేసుకుంటే మరోవైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మిగిలిన పిండితో దోశలు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పైన ఆనియన్స్ వేసుకుని కూడా ఈ దోశలు వేసుకోవచ్చు. అంతే దీనిని మీకు ఇష్టమైన చట్నీతో లేదా పొడి కాంబినేషన్​తో తినవచ్చు. ఇది మీకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. ఇన్​స్టాంట్​గా తయారు చేసుకోవడంలో, బ్యాచ్​లర్స్​ దోశ తినాలనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. 


ఇన్​స్టాంట్ చట్నీ కోసం 


స్టౌవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టండి.  దానిలో నూనె వేయాలి. అనంతరం పల్లీలు వేసి వేయించండి. అవి వేగుతున్నప్పుడు.. పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి మీకు తగినంత కారం క్వాంటింటీలో వేసుకోండి. అవి వేగుతున్నప్పుడు కాస్త జీలకర్ర వేసి.. మరోసారి వేయించి స్టౌవ్ ఆపేయండి. అవి చల్లారే లోపు కాస్త చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన పల్లీల మిశ్రమాన్ని మిక్సీజార్​లో వేసుకుని గ్రైండ్ చేయాలి. దానిలో వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు గుజ్జు వేసుకుని మరోసారి గ్రైండ్ చేయాలి. తగినంత నీటిని వేసుకుంటూ చట్నీగా తయారు చేసుకోవాలి. ఈ చట్నీని తాళింపు వేసుకోకపోయినా.. నేరుగా, హాయిగా లాగించేయవచ్చు. 


Also Read : అమ్మాయిలకు ఈ లడ్డూలు పెడితే చాలా మంచిది.. పీరియడ్స్ సమయంలో ఆ ఇబ్బందులు తగ్గుతాయి