Crispy Dosa Recipe : బ్రేక్​ఫాస్ట్​గా ఏమి వండుకోవాలో తెలియనప్పుడు ఇన్​స్టాంట్ (Instant Breakfast Recipe)​ రెసిపీలు బాగా హెల్ప్ చేస్తాయి. అలాంటివాటిలో ఈ దోశల రెసిపీ కూడా ఒకటి. అదే ఓట్స్ దోశ (Oats Dosa). ఇవి మంచి రుచిని అందిచడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తాయి. మరి వీటిని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఏ టిప్స్ ఫాలో అయితే మంచిది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


ఓట్స్ - సగం కప్పు


పెరుగు - పావు కప్పు


ఉప్పు - రుచికి తగినంత 


జీలకర్ర - అర టీస్పూన్


బియ్యం పిండి - పావు కప్పు


రవ్వ - పావు కప్పు 


ఉల్లిపాయముక్కలు - 2 టేబుల్ స్పూన్లు


కరివేపాకు - 1 రెబ్బ


కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్


అల్లం తురుము - అర టీస్పూన్


పచ్చిమిర్చి - 1 సన్నగా తురుముకోవాలి.


నీళ్లు - బ్యాటర్​కి సరిపడ


తయారీ విధానం


ముందుగా ఓట్స్​ని బ్లెండర్​లో వేయాలి. వీటిని చక్కని పొడిగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం పిండిని మిక్సింగ్ చేయడం ఈజీ అవుతుంది. ఈ పొడిని ఓ మిక్సింగ్ బౌల్​లో తీసుకోవాలి. ఇప్పుడు దానిలో ఉప్పు, జీలకర్ర, బియ్యం పిండి, రవ్వ వేసి మిక్స్ చేయాలి. అనంతరం దానిలో సన్నగా తురుమిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తురుము, పచ్చిమిర్చి తురుము వేయాలి. కొత్తిమీరను కూడా సన్నగా తురిమి వేయాలి. అల్లం తురుము వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. 


ఆ మిస్టేక్ చేయొద్దు..


ఇప్పుడు ఈ మిశ్రమంలో పావు కప్పు పెరుగు వేయండి. అది కాస్త మిక్స్ చేసిన తర్వాత.. దోశలు వేసుకోవడానికి వీలుగా ఉండేలా నీటిని పోస్తూ.. పిండిని కలపాలి. పిండిలో నీరు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అలా అని తక్కువ కాకుండా నీటిని లెవెల్​గా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన పిండిని ఓ పది నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల పిండి నానుతుంది. అంతేకాకుండా దోశలు మంచిగా వస్తాయి. 


పిండి ఎలా ఉండాలంటే..


ఈలోపు మీకు ఎక్స్​ట్రా ఆనియన్స్ కావాలి అనుకుంటే దోశలపై చల్లుకునేలా కట్ చేసుకోవాలి. అనంతరం స్టౌవ్ వెలిగించి దానిపై దోశ పాన్ ఉంచుకోవాలి. అది వేడి అయ్యాక నూనె అప్లై చేయాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని.. మరోసారి కలపాలి. మరింత నీరు అవసరం అనుకుంటే వేయాలి. ఎందుకంటే పిండి నీటిని అబ్జార్వ్ చేసుకుంటుంది కాబట్టి.. కాస్త నీరు పట్టే అవకాశముంది. పిండి పాన్ మీద వేసి తిప్పేంత గట్టిగా కాకుండా.. నీళ్లు చిలకరిస్తున్నట్లు.. రవ్వ దోశ వేసుకునేంత పలుచగా ఉండాలి. పిండిని సిద్ధం చేసుకున్న తర్వాత.. పాన్​పై దోశల్లా వేసుకోవడమే. 


పిండిని రాత్రి సిద్ధం చేసుకోవచ్చా?


ఇలాగే మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవాలి. వీటిని మీకు నచ్చిన చట్నీతో హాయిగా లాగించవచ్చు. ఇన్​స్టాంట్​గా బ్రేక్​ఫాస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇది మంచి రుచిని అందించడంతో పాటు.. ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. ఈ పిండిని మీరు రాత్రి కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. కాకుంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వంటి వాటిని మార్నింగ్ ఫ్రెష్​గా పిండిలో వేసి కలుపుకోవాలి. 


Also Read : హాట్ చాక్లెట్ తాగితే బరువు తగ్గుతారా? తాజా పరిశోధనల్లో ఏం తేలిందో తెలిస్తే షాకవుతారు