Hot chocolate weight loss: చాక్లెట్స్ తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. అయితే చాకెట్లు తింటే సులభంగా బరువు తగ్గవచ్చని అంటున్నారు నిపుణులు. తాజా పరిశోధనల్లోనూ ఈ విషయాలు వెలుగుచూశాయి. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం బరువు తగ్గాలనుకునేవారు చాలా కఠినమైన డైట్ ప్లాన్ ఫాలో అవుతారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రాక నిరాశ చెందుతారు. అలాంటి వారు ఒక కప్పు హాట్ చాక్లెట్ తాగితే బరువు తగ్గుతారని చెబుతున్నారు. చాక్లెట్లకు శరీర మాస్ ఇండెక్స్ కు సంబంధం ఉందంటున్నారు. హాట్ చాక్లెట్ తాగితే..తాగని వారికంటే బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కోకోలోని పాలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజం పనితీరును మెరుగుపరచడమే దానికి కారణమని చెబుతున్నారు. 


అయితే రోజుకు 30 గ్రాములకు మించి తింటే క్యాలరీల కౌంట్ పెరుగుతుంది. కాబటి మితంగా తాగాలని చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధిక బరువుతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ హాట్ చాక్లెట్ తాగితే మంచి ప్రయోజనాలను పొందవచ్చని డైటీషిన్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ హాట్ చాక్లెట్ ఫైబర్ పుష్కలంగా  ఉంటుంది. ఈ ఫైబర్ బరువు తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. 


ప్రస్తుతం మార్కెట్లో దొరికే చాక్లెట్ తోపాటు కోకో పౌడర్ మిల్క్ తో తయారు చేసిన చాక్లెట్లను కూడా కంపెనీలు విక్రయిస్తున్నాయి. అయితే కోకో పౌడర్ తో తయారు చేసిన చాక్లెట్స్ తినడం వల్ల బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. అంతేకాదు శరీరంలోని షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ చాక్లెట్స్ కి బదులుగా హాట్ చాక్లెట్ , డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ హాట్ చాక్లెట్ లో ఉండే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఒక కప్పు హాట్ చాక్లెట్ తాగినట్లయితే కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. చిరుతిండి తినాలనే కోరికను తగ్గిస్తుంది. మీ ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలను చేర్చుకుంటే తక్కువగా తింటారు. ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలిగి ఉంటారని ప్రముఖ డైటీషియన్ చెబుతున్నారు. 


ప్రముఖ డైటీషియన్లు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రతిరోజు హాట్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే గుణాలు మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తాయి. ప్రతిరోజూ హాట్ చాక్లెట్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 200 మిల్లిలీటర్ గోరువెచ్చని పాలలో రెండు టేబుల్ స్పూన్ల సాదా కోకో పౌడర్, రెండు టీస్పూన్ల స్టెవియా స్వీటెనర్ కలుపుకుని తీసుకోవాలని చెబుతున్నారు. పెద్దలు అయితే రోజుకు 30 గ్రాములు తీసుకుంటారు. కోకోపౌడర్ లో 28 శాతం ఫైబర్ ఉంటుంది. 2015లో 240 మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో కేవలం రోజుకు 30 గ్రాముల బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు ఏడాదిలో 5 పౌండ్ల బరువు తగ్గిస్తునట్లు తేలింది. 


Also Read : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.