Kajal Aggarwal: ఒకప్పుడు హీరోయిన్‌కు పెళ్లి అయ్యిందంటే చాలు.. తను ఇంక సినిమాలకు పనికిరాదు అన్నట్టుగా విమర్శించేవారు ప్రేక్షకులు. కానీ రోజులు మారిపోయాయి. హీరోయిన్స్‌కు పెళ్లి అయినా, పిల్లలు ఉన్నా కూడా వాళ్లు సినిమాల్లో నటించగలుగుతున్నారు. నచ్చిన పాత్రలు చేయగలుగుతున్నారు. దానికి మరో ఉదాహరణగా మారింది కాజల్ అగర్వాల్. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్న సమయంలోనే కాజల్‌కు పెళ్లయ్యింది. అప్పటికీ తన చేతిలో పలు సినిమాలు ఉన్నా కూడా వాటిని వద్దనుకొని నీల్‌కు జన్మనిచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన మార్పుపై కాజల్ స్పందించింది.


నార్మల్ అయిపోయాయి..


‘‘ఇండస్ట్రీలో వచ్చిన మార్పును జడ్జి చేయడానికి నేను కరెక్ట్ మనిషిని కాదు ఎందుకంటే నాకు బిడ్డ పుట్టి ఇప్పటికీ పదేళ్లు ఏమీ కాలేదు. కానీ ఇంకా నాకు మంచి రోల్స్, మంచివాళ్లతో పనిచేసే అవకాశాలు వస్తున్నాయంటే అదృష్టంగానే భావిస్తున్నాను. పెళ్లి అవ్వడం, పిల్లలు పుట్టడం అనేది ఏ ప్రొఫెషన్‌లో కూడా అడ్డుకాదు. అలాగే సినీ పరిశ్రమలో కూడా మెటర్నిటీ లీవ్ గురించి అర్థం చేసుకునేవాళ్లు పెరిగారు. ఇలాంటివి ఇండస్ట్రీలో కూడా నార్మల్ అయిపోయాయి’’ అని సంతోషం వ్యక్తం చేసింది కాజల్ అగర్వాల్. నీల్ పుట్టకముందు, పుట్టిన తర్వాత వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ తనకు ఉన్న తక్కువ టైమ్‌లో మంచి రోల్స్ చేయాలనే ఆశ మరింత పెరిగిందని చెప్పింది.


నీల్ అర్థం చేసుకుంటాడు..


‘‘ముందులాగా ఏడాదికి 8,9 సినిమాలు ఓకే చేయాలని అనుకోవడం లేదు. దానికంటే నాలుగు మంచి సినిమాలపై ఫోకస్ చేద్దామనుకుంటున్నాను. నావైపు నుండి ప్రాధాన్యత మారిపోయింది’’ అని క్లారిటీ ఇచ్చింది కాజల్. నీల్ గురించి మాట్లాడుతూ.. ‘‘పిల్లలు పెరుగుతున్నకొద్దీ తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందులో పాజిటివ్ విషయం ఏంటంటే నీల్ అర్థం చేసుకుంటాడు. తనకు తన తల్లి పనిచేస్తుందని తెలుసు. తనతో మనం ఏదైనా చెప్తే తను అర్థం చేసుకొని తిరిగి సమాధానం చెప్తాడు’’ అని గర్వంగా తన బిడ్డ గురించి చెప్పింది. తల్లి అవ్వడం వల్ల తనలో చాలా మార్పులు వచ్చాయని కాజల్ చెప్పుకొచ్చింది.


రిస్కులు తీసుకోను..


‘‘నేను అన్నింటిని చూసే దృష్టి మారింది. రిస్కులు తీసుకునే లక్షణం తగ్గింది. ఇప్పుడు కేవలం నా గురించి మాత్రమే ఆలోచించను కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడూ బాధ్యతతోనే ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఆ బాధ్యత మరింత పెరిగింది. చాలా ఓపిక పెరిగింది’’ అంటూ తనలో వచ్చిన మార్పులు గురించి బయటపెట్టింది కాజల్. ఓటీటీలో యాక్ట్ చేస్తారా అని అడగగా.. తనకు నచ్చే కథ వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తానని స్పష్టం చేసింది. యాక్టింగ్ అనేది తన ఫస్ట్ లవ్ అని, దానికోసం తను ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమని చెప్పింది. తను ఇప్పుడు ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్స్ కోసం చూస్తున్నానని తెలిపింది. లోకేశ్ కనకరాజ్, వెంకటేశ్ మహా, సందీప్ రాజ్, అర్జున్ వైకే వంటి దర్శకులతో తనకు కలిసి పనిచేయాలని ఉందని కోరికను బయటపెట్టింది కాజల్.


Also Read: బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్లు ఎక్కడ? మలయాళ చిత్రాల్లో మహిళల ప్రాధాన్యత తగ్గుతోందా?