చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఆదివారం (మే 26) రాత్రి జరిగిన లో స్కోరింగ్ IPL) 2024 ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విజయం సాధించింది. మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన సన్‌రైజన్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ టీమ్ ఆడుతూపాడుతూ కేవలం 10.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగించి, మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో ఫైనల్లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా హైదరాబాద్ టీమ్ నిలిచింది. ఐపీఎల్ సీజన్ 17 విజేత కేకేఆర్‌కు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్రోఫీ అందజేశారు.
Photo: Twitter/@IPL
మిచెల్ స్టార్క్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వైభవ్ అరోరా సమష్టిగా రాణించి ఫైనల్లో హైదరాబాద్ పై కేకేఆర్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. బ్యాటింగ్ లో ఓపెనర్ నరైన్ విఫలమైనా, మరో ఓపెనర్ గుర్బాజ్, వన్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యార్ హాఫ్ సెంచరీతో రాణించారు. స్వల్ప స్కోరు కావడంతో కేవలం గంటన్నరలోపే 8 వికెట్ల తేడాతో్ కేకేఆర్ టీమ్ విజయం సాధించింది.
IPL 2024 అవార్డులు గెలుచున్నది వీరే
IPL 2024 విన్నర్ టీమ్: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)
IPL 2024 రన్నరప్ టీమ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)
ఆరెంజ్ క్యాప్ విజేత (అత్యధిక పరుగులు): విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 741 పరుగులు
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు ఆరెంజ్ క్యాప్ నెగ్గిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో 2016లో ఒక సీజన్‌లో 4 సెంచరీలతో ఏకంగా 973 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు కోహ్లీ.
పర్పుల్ క్యాప్ విజేత (అత్యధిక వికెట్లు): హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్ (PBKS)- 24 వికెట్లు
అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్: సునీల్ నరైన్ (KKR)
అత్యధిక సిక్సర్లు: అభిషేక్ శర్మ (42 సిక్సర్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)
అత్యధిక ఫోర్లు: ట్రావిస్ హెడ్ (64 ఫోర్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)
అత్యంత విలువైన ఆటగాడు: సునీల్ నరైన్ (KKR)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్: నితీష్ కుమార్ రెడ్డి (SRH)
ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: మిచెల్ స్టార్క్ అతని 3 ఓవర్లలో 2/14
ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (DC)
ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్: రమణ్‌దీప్ సింగ్ (KKR)
ఫెయిర్ ప్లే అవార్డు: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ (SRH)
సీజన్‌లో బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (Uppal Stadium)