చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఆదివారం (మే 26) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ బలం అనుకుంటే, ఆ విభాగంలోనే హైదరాబాద్ పూర్తిగా విఫలమైంది. ట్రావిస్ హెడ్ డకౌట్ కావడం, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగా పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో 18.3 ఓవర్లలో సన్‌రైజర్స్ ఆటగాళ్లు 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దాంతో IPL ఫైనల్‌లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా చెత్త రికార్డు హైదరాబాద్ ఖాతాలో పడింది. గతంలో తక్కువ టార్గెట్లను డిఫెండ్ చేసినప్పటికీ, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు, అత్యధిక ఛేజింగ్ జరిగిన సీజన్ కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఈ స్కోరును డిఫెండ్ చేసుకోవడం కష్టమే. ఏదైనా సంచలనం జరిగి మ్యాచ్ నెగ్గితే సన్‌రైజర్స్ రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకోనుంది.
మే 26న చెన్నై వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ 113 రన్స్‌కు ఆలౌట్ అయింది. IPL 2024 ఫైనల్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి, డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్లు ఇలా ఉన్నాయి.
2017 హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్ (MI) - 129/8 vs రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS)
2009 జోహన్నెస్‌బర్గ్‌లో డెక్కన్ ఛార్జర్స్ (DC) - 143/6 vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
2013 కోల్‌కతాలో ముంబై ఇండియన్స్ (MI) - 148/9 vs చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
2019 హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్ (MI)- 149/8 vs చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
2010 ముంబైలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) - 168/5 vs ముంబై ఇండియన్స్ (MI)