Ullipaya Pachadi Recipe : ఉల్లిపాయతో నిల్వ పచ్చడి చేయొచ్చా? అనే డౌట్ ఉందా? అయితే అస్సలు కంగారు పడకండి. ఆనియన్స్​తో బేషుగ్గా పచ్చడి చేసుకోవచ్చు. ముఖ్యంగా దోశ, ఇడ్లీలకోసం ఈ చట్నీ చేసుకోవచ్చు. ఉదయాన్నే ఎక్కువ పనులు చేసుకోలేనివారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. పైగా ఈ నిల్వపచ్చడిని చాలా సింపుల్​గా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. దోశలకు క్రేజీ కాంబినేషన్​గా చెప్పే ఈ టేస్టీ పచ్చడిని ఎలా తయారు చోయాలో.. కావాల్సన పదార్థాలేమిటో చూసేద్దాం. నెలరోజులు నిల్వ ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఈ పచ్చడి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 



కావాల్సిన పదార్థాలు


ఉల్లిపాయలు - 2 పెద్దవి


ఎండుమిర్చి - 10


బెల్లం - రెండు టేబుల్ స్పూన్లు


చింతపండు - 30 గ్రాములు


తాళింపు కోసం


నూనె - పావు కప్పు


ఆవాలు - 1 టీస్పూన్


జీలకర్ర - అర టీస్పూన్


మినపప్పు - టీస్పూన్


ఇంగువ - చిటికెడు


వెల్లుల్లి రెబ్బలు - 5


కరివేపాకు - 1 రెబ్బ


తయారీ విధానం


ముందుగా ఎండుమిర్చిని ఓ అరగంట నానబెట్టుకోవాలి. ఈలోపు చింతపండు నాబెట్టుకోవాలి. ఉల్లిపాయలను కడిగి తొక్కలు తీసి పెద్దగా కోసుకోవాలి. బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి నానిన వాటిని నీళ్లతో సహా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.దానిలో ఉల్లిపాయ ముక్కలు, నాబెట్టిన చింత పండు.. బెల్లం తురుము వేసి పేస్ట్ చేసుకోవాలి. 



ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టండి. దానిలో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. మిర్చికాస్త వేగిన తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం జీలకర్ర, కరివేపాకు వేసి మరోసారి వేయించుకోవాలి. మినపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత.. ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్​ని వేసుకోవాలి. ఇప్పుడు దానిని అడుగుపట్టకుండా కలుపుతూ.. నూనె పైకి తేలేవరకు ఆనియన్స్ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయాల్లోని నీరు ఇంకి పోయి.. ఆయిల్ ఈ మిశ్రమంలో పూర్తిగా కలిసిపోతుంది. ఉల్లిపాయల్లో నీరు ఉంటే పచ్చడి త్వరగా పాడై పోతుంది. అప్పటికప్పుడు తినేందుకు చేసుకుంటే పచ్చడి కాస్త లూజ్గా ఉన్నా పర్లేదు.


Also Read : టేస్టీ, స్పైసీ మినపప్పు పచ్చడి.. నెల్లూరు స్టైల్​లో ఇలా చేసేయండి


నూనె పైకి వస్తేనే.. ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. కాబట్టి అడుగుపట్టకుండా తిప్పుతూ ఉండాలి. పచ్చడి సిద్ధమయ్యే సరికి ముదురు ఎరుపు రంగు వస్తుంది. దీనిని మీరు నచ్చిన బ్రేక్​ఫాస్ట్​తో కలిపి తినొచ్చు. రైస్​లోకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అన్నంలోకి తినే ముందు దీనిని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయమేంటి అంటే ఈ పచ్చడిని ఇలా చేస్తే నెలరోజులు నిల్వ ఉంటుంది. ముఖ్యంగా దోశలకు ఇది టేస్టీ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ ఆనియన్ నిల్వ పచ్చడిని రెడీ చేసుకుని.. హాయిగా లాగించేయండి. బ్యాచిలర్స్ కూడా ఈ టేస్టీ పచ్చడిని చాలా సులభంగా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకున్నా ఇది రెండు, మూడు వారాలు స్టోర్ చేసుకోవచ్చు. 


Also Read : టేస్టీ, స్పైసీ దొండకాయ పచ్చడి.. ఇలా చేసుకుని తింటే ఎంతైనా లాగించేస్తారు..