Paneer Capsicum Masala Restaurant Style Recipe : ఆదివారం దాదాపు అందరూ ఇండ్లలోనే ఉంటారు. ఈ సమయంలో పిల్లలనుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరూ ఏదైనా టేస్టీగా తినాలనుకుంటారు. కానీ కార్తీక మాసం వల్ల ఇంట్లో నాన్‌వెజ్ చేసుకోలేకపోవచ్చు. అయితే వెజ్‌లో కూడా మీరు కొత్త వెరైటీలు ట్రై చేయవచ్చు. ఇవి నాన్‌వెజ్‌కు ఏమాత్రం తీసిపోవు. పైగా ఇవి టేస్ట్‌తో పాటు.. ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు చేకూరుస్తాయి. వాటిలో పనీర్ క్యాప్సికమ్ మసాల ఒకటి. ఇది మీ సండేకు మంచి హెల్తీ, టేస్టీ రెసిపీ అవుతుంది.
పనీర్ క్యాప్సికమ్ మసాలను తయారు చేయడం చాలా తేలిక. దీనిలో గ్రేవీ మసాలా కోసం ఉల్లిపాయ, టమోటో, జీడిపప్పును ఉపయోగిస్తాము. ఇవి కూడా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. అంతేకాకుండా డిష్‌కు మంచి టేస్ట్ ఇస్తుంది. మరి ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పనీర్ - 150 గ్రాములు (క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్ - 2 పెద్దవి
ఉల్లిపాయలు - 2 పెద్దవి
టమోటాలు - 2
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
సొంపు పొడి - అర టీస్పూన్
కసూరి మేథి - 1 టేబుల్ స్పూన్
ధనియా పొడి - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - 1 కట్ట (చిన్నది)
జీడిపప్పు - 10
మలాయ్ క్రీమ్ - 2 స్పూన్స్
ఉప్పు - రుచికి తగ్గట్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా కూరగాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి.. దానిపై పాన్ ఉంచాలి. కొద్దిగా నూనె వేసి పనీర్ క్యూబ్స్ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కసూరి మేతిని తక్కువ మంట మీద రోస్ట్ చేసి.. చల్లార్చి.. పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి.. నూనె వేయాలి. దానిలో జీలకర్ర వేసి వేయించాలి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమం బంగారు రంగులోకి మారిన తర్వాత దానిలో పసుపు, కారం, ధనియా పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమం నూనె విడిపోయే వరకు వేయించాలి. దానిలో కసూరి మేతి, క్యాప్సికమ్, టమోటో ప్యూరీ వేసి బాగా కలపాలి. అనంతరం వేయించిన పనీర్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు జీడిపప్పులో నీరు వేసి పేస్ట్ చేసుకోవాలి. దీనిని కర్రీలో వేయాలి. దీనిని బాగా కలిపి మూతపెట్టి ఉడికించాలి. అనంతరం కొత్తిమీరు ఆకులతో, మలాయ్ క్రీమ్ వేసి గార్నిష్ చేయాలి. అంతే వేడి వేడి పనీర్ క్యాప్సికమ్ రెసిపీ రెడీ. దీనిని మీరు రైస్, వెజ్ బిర్యానీ, రోటీలలో కూడా తీసుకోవచ్చు. పనీర్ ప్రోటీన్‌కు మంచి సోర్స్. ఇది మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.
Also Read : బరువు తగ్గాలనుకుంటే కొత్తిమీర రైస్ ట్రై చేయండి.. రెసిపీ ఇదే
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.