Pregnancy Planning Tips: గర్భం దాల్చాలి.. పిల్లలతో న్యూ లైఫ్ ప్రారంభించాలనుకున్నప్పుడు గర్భధారణ ప్రణాళిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల మీ ఆరోగ్యంతో పాటు.. సంతానోత్పత్తిని రక్షించడానికి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్​ గురించి తెలుసుకుని.. దాని నివారణ చర్యలు తీసుకోవడం వల్ల మీరు, పిల్లలు హెల్తీగా ఉంటారని సూచిస్తున్నారు. 

Continues below advertisement


ప్రెగ్నెన్సీ సమయంలో గర్భాశయ క్యాన్సర్​ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. వయసుతో పాటు ఈ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశముంది. కాబట్టి పిల్లలను ప్లాన్ చేసుకునేవారు దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి అంటున్నారు. 35 నుంచి 44 సంవత్సరాల వయుసున్నవారిలో ఇది ఎక్కువగా నిర్థారణ అవుతున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. 


గర్భాశయ క్యాన్సర్


సర్వైకల్ క్యాన్సర్​ను గర్భాశయ క్యాన్సర్ అంటారు. ఇది యోని దగ్గర గర్భాశయం దిగువ భాగంలో సంభవించే క్యాన్సర్. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వల్ల ఇది సంక్రమిస్తుంది. దీనివల్ల గర్భాశయ కణాల్లో మార్పులు సంభవించి.. క్యాన్సర్​గా మారుతాయి. అయితే ఈ క్యాన్సర్​ను తగిన నివారణ చర్యలు ఫాలో అవుతూ నివారించుకోవచ్చు. ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించడం సులువు అవుతుంది. 


స్క్రీనింగ్.. 


రెగ్యూలర్​గా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చర్యలు తీసుకోవాలి. HPV టెస్ట్ స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్​కు దారితీసే వైరస్​లను గుర్తిస్తుంది. ఈ స్క్రీనింగ్​ని 21 సంవత్సరాల వయసునుంచి చేయించుకోవచ్చు. 30 ఏళ్ల నుంచి.. ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారైన ఈ టెస్ట్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ ద్వారా ఈ క్యాన్సర్​ని గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవడం ప్రారంభించవచ్చు. 


నివారణ చర్యలు 


గర్భాశయ క్యాన్సర్​కు కారణమయ్యే హై రిస్క్ HPV ద్వారా సంక్రమణను నివారించవచ్చు. HPV టీకా ఈ క్యాన్సర్​ను నివారించడంలో అత్యంత ప్రభావవంతమైనది. ఈ టీకా తీసుకోనట్లైతే.. వైద్యుల సూచనలతో తీసుకోవచ్చు. 


లైంగిక చర్యల ద్వారా వైరస్ సంక్రమిస్తుంది కాబట్టి.. సురక్షితమైన సెక్స్​ను ఫాలో అవ్వాలి. ఇది ఇన్​ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండోమ్​లు ఈ క్యాన్సరన్​ పూర్తిగా నిరోధించకపోయినా.. ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. సురక్షితమైన లైంగిక చర్యలు చాలా అవసరం. ఈ విషయంలో మీ భాగస్వామితో ఓపెన్ కమ్యూనికేషన్ చేస్తే మరీ మంచిది. 


రోగనిరోధక శక్తి.. 


ఆరోగ్యకరమైన అలవాట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ధూమపాన అలవాటు ఉంటే.. ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కచ్చితంగా ధూమపానం మానేయాలి. గర్భాశయ ఆరోగ్యానికి కూడా ఇది మంచిది కాదు. 


డైట్


బ్యాలెనెస్డ్​ డైట్​, వ్యాయామం విషయంలో కాంప్రిమైజ్ కాకుండా ఉండాలి. పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అలాగే శారీరక వ్యాయామం మీరు స్ట్రాంగ్​గా ఉండేలా చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, డీప్ బ్రీతింగ్ చేయాలి. 



Also Read : అమ్మాయిలు రాత్రుళ్లు లేట్​గా పడుకుంటున్నారా? అయితే మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టమేనట