రొయ్యలంటే నాన్ వెజ్ ప్రియులకు ప్రాణం. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రొయ్యలు ఇగురు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే చాలా మంది ఇగురు అధికంగా రాదు. ఇగురు అధికంగా వచ్చేలా వండడంమెలాగో  ఇక్కడ చెప్పాం. టేస్టు కూడా అదిరిపోతుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు. 


కావాల్సిన పదార్థాలు
రొయ్యలు - ఒక కప్పు
ఉల్లిపాయ తరుగు - అర కప్పు
టమోటా - పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులు
మిరియాల పొడి - అర స్పూను
పసుపు - అర స్పూను
ధనియాల పొడి - ఒక టీస్పూను
గరం మసాలా - అర స్పూను
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూనులు
జీలకర్ర పొడి - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
కరివేపాకులు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు


తయారీ ఇలా
1. రొయ్యలు శుభ్రంగా కడగాలి. రొయ్యలపైనా నల్లటి గీతలా ఉన్న అవయవాన్ని తీసేయాలి. 
2. ఇప్పుడు ఒక గిన్నెల్లో రొయ్యలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లి తరుగు వేసి వేయించాలి. 
4. పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్లు వేసి వేయించాలి. తరువాత టమోటా తరుగు వేసి వేయించాలి.
5. కాస్త ఉప్పు వేస్తే ఆ మిశ్రమం మెత్తగా ఉడుకుతుంది.ఎంత మెత్తగా ఉడికితే ఇగురు అంత బాగా వస్తుంది. 
6. ఈ మిశ్రమం బాగా ఉడికాక మారినేషన్ చేసిన రొయ్యలు వేసి కలపాలి. 
7. మూత పెట్టి పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. రొయ్యల్లోని నీరంతా దిగుతుంది. 
8. 80 శాతం నీరు ఇంకిపోయాక జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి కలపాలి. 
9. కరివేపాకులు కూడా వేసి బాగా కలపాలి. 
10. చిన్న మంట మీద ఉడికిస్తే రొయ్యల ఇగురు మంచి టేస్టుగా వస్తుంది. 
11. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలిపి, పైన కొత్తిమీర చల్లి స్టవ్ కట్టేయాలి. రొయ్యల ఇగురు తయారైనట్టే. 


Also read: ఇచ్చిన బొమ్మలో మీ మెదడు మొదట ఏం గమనించింది? దాన్ని బట్టి మీ మనసు ఎలాంటిదో చెప్పవచ్చు


Also read: అల్యూమినియం పాత్రల్లో వండితే మతిమరుపు త్వరగా వచ్చేస్తుందా? అవునంటోంది ఈ అధ్యయనం


Also read: మామిడి పొడి కూడా మసాలానే, వంటల్లో కలుపుకుంటే ఎన్ని లాభాలో, నియంత్రణలోనే మధుమేహం