Supreme Court Judgments: సుప్రీం కోర్టు ఓ రికార్డ్ సృష్టించింది. ఒకే రోజులో 44 తీర్పులిచ్చింది. ఇది ఇటీవలి కాలంలో అరుదైన రికార్డుగా పేర్కొంటున్నారు. వేసవి సెలవుల అనంతరం విచారణలు పునఃప్రారంభమైన జులై 11న ఈ ఘనత నమోదైంది.


20 ఆయనవే


ఈ 44 తీర్పుల్లో 20 తీర్పులను జస్టిస్ ఎంఆర్ షా ఇచ్చారు. క్రిమినల్ అపీళ్లు, సివిల్ వివాదాలు, బ్యాంకింగ్, నేరస్థుల అప్పగింత ఒప్పందాలు, దేశీయ చట్టాలు, వ్యాపార వివాదాలు, కోర్టు ధిక్కారం కేసులు, కాంట్రాక్టుల అమలు వంటి అంశాలకు సంబంధించిన కేసుల్లో ఈ తీర్పులు వచ్చాయి. మే 23 నుంచి జులై 10 వరకు అత్యున్నత న్యాయస్థానానికి వేసవి సెలవులు ఉన్నాయి.


పెండింగ్ కేసులు


మరోవైపు దేశంలో ప్రస్తుతం దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఔరంగాబాద్‌లోని మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఇటీవల ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా



దేశంలోని అన్ని కోర్టుల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై చర్యలు తీసుకోకపోతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.  నేను న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య నాలుగు కోట్లకు దగ్గరగా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 5 కోట్లకు దగ్గరగా ఉంది. ఇది మనందరికీ ఆందోళన కలిగిస్తోంది. న్యాయ నిపుణులను నియమించుకోవడం సాధారణ ప్రజలకు చాలా కష్టసాధ్యమవుతుంది.                                                                         "
-  కిరణ్ రిజుజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి



భారత న్యాయవ్యవస్థ


" భారత న్యాయవ్యవస్థ నాణ్యత, గౌరవం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. నేను ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లాను. అక్కడ న్యాయవ్యవస్థకు చెందిన కొంతమందితో భేటీ అయ్యాను. వారికి కూడా భారత న్యాయవ్యవస్థపై మనలాంటి గౌరవమే ఉంది. మన సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులను అప్పుడప్పుడు యూకేలో కొన్ని కేసుల్లో రిఫర్ చేస్తారని వారు తెలిపారు.  "




-  కిరణ్ రిజుజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి



రిజుజు ఇలా అన్నారు.


Also Read: Nature Flaunting Tricolour: ప్రకృతి దిద్దిన మువ్వన్నెల జెండా- ఎగరాలి ప్రగతి పథానా, మన గగన జగానా!


Also Read: Bomb Hurled at RSS Office: RSS కార్యాలయంపై బాంబు దాడి- ఎవరు చేసి ఉంటారు?