మీ పర్సులో రంగురంగుల కరెన్సీ నోట్లు ఉన్నాయి కదా, వాటిని చూసి చేతితో తాకి చూడండి. చాలా మందంగా, స్మూత్ గా ఉంటాయి. వాటిని దేనితో తయారుచేశారో ఎప్పుడైనా ఆలోచించారా? కాగితమే కదా అనుకుంటారు చాలామంది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని ఎక్కువ మన్నికైన మెటిరీయల్ ఉపయోగించి చేస్తుంది. పూర్తి కాగితంతో చేస్తే వాటి మన్నిక చాలా తక్కువ కాలమే. అందుకే కొంతమంది డబ్బులను పాకెట్లో మర్చిపోయి, వాషింగ్ మెషీన్లో వేసేస్తారు. అయినా మన కరెన్నీ నోట్లు చిరగకుండా, రంగు వెలియకుండా బయటికి వస్తాయి.
ఇదే ఆ ముడి పదార్థం
మన దేశమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు కరెన్సీ నోట్లను తయారుచేసేందుకు పత్తిని ఉపయోగిస్తాయి. ఇది దీర్ఘకాలం మన్నుతుంది, తేలికగానూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారం మన నోట్లలో కాగితం కొద్ధి శాతం కూడా లేదు. 75 శాతం పత్తి, 25 శాతం నార మిశ్రమాన్ని వాడతారు. ప్రింటింగ్ ప్రక్రియలో పత్తిని జెలటిన్ అనే అతుక్కునే లక్షణం ఉన్న పదార్థంతో మిక్స్ చేస్తారు. అదే ఐరోపాలో అయితే కరెన్సీ నోట్ల కోసం కాంబర్ నోయిల్ పత్తిని ఉపయోగిస్తారు. అయిత పత్తి, నార, ఇతర పదార్థాలను ఏ నిష్పత్తిలో కలుపుతారన్నది మాత్రం రహస్యంగా ఉంచుతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 22 ప్రకారం, భారతదేశంలో నోట్లను జారీ చేసే హక్కు రిజర్వ్ బ్యాంక్‌కు మాత్రమే ఉంది.
ఎక్కడ ముద్రిస్తారు?
కరెన్సీ నోట్లను ముద్రించేందుకు, నాణాలను ముద్రించేందుకు వేర్వేరు ప్రింటింగ్ ప్రెస్ లు ఉన్నాయి. కరెన్సీ నోట్లను ముద్రించేందుకు మహారాష్ట్రాలోని నాసిక్, మధ్యప్రదేశ్లోని దేవాస్, కర్ణాటకలోని మైసూర్, పశ్చిమ బంగాలోని సల్బోనిలలో ప్రింటింగ్ ప్రెస్ లు ఉన్నాయి. అలాగే నాణాలను ముద్రించేందుకు మింట్ లు దేశంలో నాలుగు చోట్ల ఉన్నాయి. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాలో ఉన్నాయి. దేవాస్ ప్రింటింగ్ ప్రెస్ లో ఏడాదికి దాదాపు 265 కోట్ల నోట్లను ప్రింట్ చేస్తుంంది. అందులో రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం మనదేశంలో ఏటా 2000 కోట్ల కరెన్సీ నోట్లను ముద్రిస్తారు.
మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్‌లో మిల్లు ఉంది. అక్కడే పత్తి, నార, ఇతర పదార్థాలతో పేపర్ రెడీ అవుతుంది. అక్కడ్నించి పేపర్ మిగతా నాలుగు ప్రింటింగ్ ప్రెస్‌లకు చేరుతాయి.
Also read: ఈ బొమ్మలో ఉన్న రెండు జీవులను 20 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం, 99 శాతం మంది ఓడిపోయారు
Also read: షాకింగ్ ఫలితం, చక్కెర కలుపుకుని కాఫీ తాగితే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికం