ఆప్టికల్ ఇల్యూషన్... ఉండీ లేనట్టు కనిపించే ఒక భ్రమ. ఆ భ్రమ కూడా ఎంతో ఆటవిడుపును అందిస్తుంది.కాసేపు తదేకంగా చూస్తూ, ఆ చిత్రంలో ఏముందు కనిపెట్టే ప్రయత్నం చేస్తాము కాబట్టి, మెదడుకు, కళ్లకు ఉన్న సమన్వయం మరింత బలపడుతుంది. మెదడు - కళ్లు మధ్య ఉన్న బంధం చాలా అవసరం. ఇక్కడ మీకిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ చూడండి. మీకు ఒక పక్షి నోట్లో ఆహారాన్ని పట్టుకుని కూర్చున్నట్టు ఉంది కదా. ఆ చిత్రంలోనే మరొక జీవి కూడా దాక్కొని ఉంది. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా దాన్ని కనిపెట్టేస్తారు. కేవలం 20 సెకన్లలోనే కనిపెట్టాలి. కేవలం ఒక్క శాతం మంది మాత్రమే కనిపెట్టగలిగారు. 99శాతం మంది ఆ జీవిని కనిపెట్టేందుకు సుమారు అయిదు నుంచి పదినిమిషాల సమయం తీసుకున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కాస్త తెలివి ఉపయోగిస్తే రెండో జీవి ఇట్టే దొరికేస్తుంది. 


ఇదిగో జవాబు...
ఆ ఫోటోను తదేకంగా చూడండి. మీకూ మరో జీవి ఉన్నట్టు ఇట్టే తెలిసి పోతుంది. పక్షి కాళ్ల భాగాన్ని పరిశీలనగా చూస్తే మరో జీవి దొరికిపోతుంది. ఇంకా దొరక్కపోతే ఆ ఫోటోను తిరగేసి చూడండి, జవాబు మీకే దొరుకుతుంది. ఈ ఇల్యూషన్ ‘రానా ఇల్యూషన్స’ అనే ఖాతాలో టిక్ టాక్ లో అప్ లోడ్ చేశారు. అది వైరల్ గా మారి మనవరకు చేరింది. టిక్ టాక్ మనదేశంలో బ్యాన్ చేశారు కానీ చాలా దేశాల్లో ఇంకా అమల్లోనే ఉంది. చాలా మంది నాకు పక్షి తప్ప ఇంకే కనిపించడం లేదు అంటూ కామెంట్లు కూడా చేశారట టిక్ టాక్. మరికొందరు మాత్రం అందులో దాగున్న మరో జీవి నక్కను పట్టేశారు. 


ఆప్టికల్ ఇల్యూషన్లు వేల ఏళ్ల నాటి చరిత్రను కలిగి ఉన్నాయి. పూర్వపు రోజుల్లో కూడా ఇవి వినోదాన్ని పంచేవని చెబుతారు చరిత్రకారులు. ఇప్పుడున్నని వినోద ఉత్పత్తులు అప్పుడు లేవు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు, ఆటల ద్వారానే ఉపశమనం పొందేవారు. ఇవి అప్పట్నించి ఎంతో పాపులర్ అయ్యాయి. అయితే ఇప్పటికీ ఇవి ఏ కాలంలో పురుడు పోసుకున్నాయి, ఎవరు మొదలుపెట్టారన్నది మాత్రం తెలియరాలేదు. మెదడుకు మేతగా వీటిని కనిపెట్టి ఉంటారనే వాదన ఉంది. వీటి వల్ల వల్ల మెదడుకు - కంటికి సమన్వయం పెరుగుతుంది. అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చూపు మెరుగుపడుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అందుకే అప్పడప్పుడు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు చూడడం చాలా అవసరం.  


Also read: షాకింగ్ ఫలితం, చక్కెర కలుపుకుని కాఫీ తాగితే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికం


Also read: ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా? కేవలం ఒక్క శాతం మంది మాత్రమే చెప్పగలిగారు