మీ మెదడు - కళ్లు సమన్వయంగా పనిచేస్తే ఏ పనినైనా విజయవంతంగా పూర్తిచేయగలరు. మీ కళ్లు - మెదడు కోర్డినేషన్ సరిగా ఉందో లేదో ఈ ఆప్టికల్ ఇల్యూషన్ తేల్చేస్తుంది. ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పండి.చాలా జాగ్రత్తగా గమనిస్తేనే పులులను కనిపెట్టగలరు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లోని పులుల సంఖ్యను నిమిషంలోపు గుర్తించిన వారు కేవలం ఒక శాతం మంది మాత్రమే. ఆ ఒక్క శాతం తెలివైన వారిలో మీరు ఉన్నారో లేదో ఓసారి చెక్ చేసుకోండి.
హింట్: క్లియర్ గా కనిపిస్తున్న పులులు నాలుగింటిని అందరూ గుర్తించేస్తారు. కానీ దాక్కున్న పులులను కనిపెట్టడమే టాస్క్. అయితే వాటి కోసం మీరు తోకలు, కాళ్ల కోసం వెతకద్దు. పులుల ముఖాల కోసం వెతకండి.
జవాబు ఇదిగో...
పులులు లెక్కపెట్టడం మొదలుపెట్టారా? దాదాపు 10 వరకు త్వరగానే కనిపెట్టేసి ఉంటారు, కానీ ఆ తరువాత నుంచి కనిపెట్టడానికే కష్టపడతారు. ఎంతకీ కనిపెట్టలేని వారి కోసమే మేము ఇక్కడ జవాబు ఇస్తున్నాం. మొత్తం ఆ చిత్రంలో 16 పులులు ఉన్నాయి. రాళ్లపై, చెట్టు కొమ్మలపై, కొమ్మల మధ్య, మొక్కలపై ఇలా చాలా చోట్ల పులి ముఖాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తే అవన్నీ కనిపిస్తాయి.
ఆప్టికల్ ఇల్యూషన్ వంటి చిత్రాలు మంచి టైమ్ పాస్ లా ఉంటాయి. మెదడుకు మేత అని కూడా చెప్పుకోవచ్చు. వీటిని తదేకంగా చూడడం వల్ల చూపు మెరుగుపడడంతో పాటూ ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తాయి. ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా విచిత్రంగా ఉంటాయి. కళ్ల ముందే అంతా కనిపిస్తున్నట్టే ఉంటుంది, కానీ జవాబు తెలుసుకునేందుకు మాత్రం చాలా కష్టపడాలి. ఆ కష్టంలో కూడా ఎంతో ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. వీటి పుట్టుక ఈనాటిది కాదు. ఎన్నో వేల ఏళ్ల క్రితం మనిషి వినోదంలో భాగంగా వీటిని క్రియేట్ చేశాడు. అప్పట్నించి ఇది వాడుకలో ఉంది. అయితే వీటిని ఎప్పుడు, ఎవరు కనిపెట్టారన్నది మాత్రం చరిత్ర కారులు కూడా చెప్పలేకపోతున్నారు.