జుట్టు సంరక్షణ కోసం చాలా మంది మందార నూనె వాడటం, కొబ్బరి నూనె రాసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ కేశాల అందం కోసం ఉల్లిపాయ నూనె కూడ ఉందండోయ్. అదేంటి కూరల్లో ఉల్లిపాయ వేసుకుంటాం కానీ జుట్టుకు కూడా రాసుకుంటారా అని ఆశ్చర్యపోతున్నారా..! కానీ ఇది నిజం ఈ ఉల్లిపాయ నూనెని మనం ఇంట్లోనే సులభంగా తయారు కూడా చేసుకోవవచ్చు. కానీ ఇది కాస్త ఘాటుగా ఉంటుందండోయ్. ఎంతైనా ఉల్లిపాయ కదా మరి. ఆ మాత్రం ఘాటు లేకుండా ఉంటుందా చెప్పండి. ఈ ఎర్ర ఉల్లిపాయ నూనెలో చాలా పోషకాలు కూడా ఉంటాయి. జుట్టు రాలడాన్ని ఇది నివారిస్తుంది. దీని వల్ల ఉన్న ప్రయోజనాలేంటో ఓసారి చూసేద్దాం.. 


జుట్టు పెరుగుదల 


ఎర్ర ఉల్లిపాయ నూనె మాడు ph స్థాయిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అంతే కాదు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఈ నూనెను రాసుకోవడం వల్ల తలకి కావలసిన పోషణ అందించడంతో పాటు జుట్టు బలంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.  జుట్టుకి అదనపు మెరుపు ఇవ్వడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీ జుట్టు, స్కాల్ఫ్ ను కండిషనింగ్ గా చేయడంతో పాటు జుట్టు మెరిసేలా చేస్తుంది. 


చుండ్రుని నివారిస్తుంది 


ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గించి చుండ్రుని నివారిస్తుంది. 


కండిషనింగ్ 


క్రమం తప్పకుండా ఎర్ర ఉల్లిపాయ నూనెతో మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్‌కు పోషణ మరియు కండిషనింగ్ అందిస్తుంది. దీని ద్వారా పొడి ,చిట్లిన జుట్టు సమస్యలను నివారిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను నిర్ధారిస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. 


ఉల్లిపాయ నూనె అప్లై చేసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 


ఈ నూనె చాలా వాసన చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి డానికి కొన్ని చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవాలి. ఎర్ర ఉల్లిపాయ నూనె శరీరానికి చాలా వేడి. అందుకే అది రాసుకోవడానికి ముందు అందులో కొద్దిగా కొబ్బరి నూనె లేదా కొంచెం కలబంద కలపడం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ నూనెని ఎటువంటి రసాయనాలు జోడించకుండా ఇంట్లోనే చాల ఆసులభంగా తయారు చేసుకోవచ్చు.


ఉల్లిపాయ నూనె తయారీ విధానం.. 


స్టెప్1: కొద్దిగా ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు చేసుకోవాలి.


స్టెప్ 2: వాటిని మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి రసం చేసి పెట్టుకోవాలి.  


స్టెప్ 3: స్టౌ మీద పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. 


స్టెప్ 4: అందులో ఉల్లిపాయ పేస్ట్, జ్యూస్ వేసి కలపాలి. అది బాగా దగ్గర పడే వరకు తిప్పాలి. 


స్టెప్ 5: ఆ మిశ్రమం అంతా బాగా దగ్గర పది ఆయిల్ పైకి తేలేనట వరకు స్టౌ సిమ్ లో పెట్టుకోవాలి. 


స్టెప్ 6: ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత వడకట్టి గాలి చొరబడని ఒక కంటైనర్ లోకి దీన్ని పోసుకుని స్టోర్ చేసుకోవాలి. 


Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!


Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!