ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం అందుకునే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)... ఆ డబ్బును ఏం చేస్తారు? కొంత మందికి అయినా సరే ఈ సందేహం వచ్చి ఉంటుంది. ఘట్టమనేని ఫ్యామిలీకి హైదరాబాద్ శివార్లలో ఒక స్టూడియో ఉంది. అది కాకుండా మహేష్ సపరేట్‌గా వ్యాపారంలో అడుగు పెడుతున్నారు.


మహేష్ బాబుకు సొంతంగా ఒక మ‌ల్టీప్లెక్స్‌ ఉంది. ఏషియన్ గ్రూప్‌తో కలిసి గచ్చిబౌలిలో ఏఎంబి మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసింది. హైదరాబాద్ సిటీలో బెస్ట్ మల్టీప్లెక్స్‌ల‌లో మహేష్ బాబుది బెస్ట్ అని చాలా మంది చెబుతున్నారు. లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... ఫుడ్ బిజినెస్‌లోకి మహేష్ బాబు అడుగు పెడుతున్నారు.


బంజారా హిల్స్‌లో మహేష్ రెస్టారెంట్
అవును... మీరు చదివింది నిజమే! మహేష్ బాబు ఫుడ్ బిజినెస్ స్టార్ట్  చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే... సోలోగా కాదు. మినర్వ గ్రూప్‌తో కలిసి పార్ట్‌న‌ర్‌షిప్‌లో రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బంజారా హిల్స్‌లో రెస్టారెంట్ కోసం ఒక ప్లేస్ కూడా ఫైనలైజ్ చేశారని టాక్. త్వరలో మహేష్ రెస్టారెంట్ గురించి ప్రకటన రావచ్చు.


Also Read : ఫ్యాట్ టు ఫిట్, 88 నుంచి 75 కేజీల వరకూ - నందమూరి కళ్యాణ్ రామ్ కష్టం అంతా ఇంతా కాదు


ఆగస్టులో త్రివిక్రమ్ సినిమా షురూ!
సినిమాలకు వస్తే... ఆగస్టులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి హీరోగా నటించనున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి మహేష్ బాబు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయని, త్వరలో షెడ్యూల్ డేట్స్ ఫైనలైజ్ చేయనున్నారని టాక్. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 


Also Read : థియేటర్లకు జనాలు రావడం లేదంటే నమ్మను, ఇండస్ట్రీకి ఇది గడ్డు కాలం కాదు - ఎన్టీఆర్