టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు వ్యవస్థాపకుడిగా, బిలినియర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్న ఎలోన్ మస్క్.. ఏ మాత్రం ఎలోన్(ఒంటరి) కాదు. ఎలోన్ మస్క్ పిల్లల లిస్ట్ చెబితే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మస్క్‌కు 9 మంది పిల్లలు ఉన్నారు. ఆయన మాజీ భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు, జిలిస్‌తో కవలలు(ఇద్దరు), గాయని గ్రిమ్స్‌తో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఆయన అలా ఉంటే ఆయన తండ్రి ఇంకెలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఎలోన్ తండ్రి ఎర్రోల్ ఏకంగా తన రెండో భార్య హీడే బెజుడెన్‌హౌట్‌ కూతురి(మొదటి భర్త సంతానం)ని పెళ్లి చేసుకున్నాడు. కూతురు వరసయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి సిగ్గులేదా? అని అడిగితే.. ‘‘భూమి మీద మనం ఉన్నది పిల్లల్ని పుట్టించడానికే’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన అంతటితో ఆగలేదు. 76 ఏళ్ల వయస్సులో కూడా వీర్య దానం చేస్తూ.. మరింత మంది ఎలోన్ మస్క్‌లు పుట్టేందుకు సహకరిస్తున్నానని తెలుపుతున్నాడు. 


ఎర్రోల్ మస్క్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, మేధావి ఎలోన్ మస్క్‌కు జన్మనిచ్చిన తండ్రిని నేను. ఆ జన్యువులు నా నుంచే వెళ్లాయి. అలాంటి వాడిని కనాలంటే నా వీర్యంతోనే సాధ్యం. ఎలోన్‌తో సాధ్యం కాదు. అందుకే, చాలామంది మహిళలు నా వీర్యం కోసం క్యూ కడుతున్నారు. కానీ, నేను ఎవరికి పడితే వారికి వీర్యాన్ని ఇవ్వాలని అనుకోవడం లేదు. అందుకే, కొలంబియాలోని ఓ సంస్థ ఆ బాధ్యత స్వీకరించింది. వీర్యదానం చేసేందుకు నేను డబ్బులు తీసుకోవడం లేదు. కొన్ని ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్నాను. కేవలం హై-క్లాస్ మహిళలు గర్భం దాల్చడానికి మాత్రమే ఆ సంస్థ నా స్పెర్మ్‌ను దానం చేస్తోంది’’ అని తెలిపారు.  


‘‘ఎలోన్‌ను సృష్టించిన అసలు వ్యక్తిని నేను. కాబట్టి, వాళ్లు ఎలోన్‌ వద్దకు ఎందుకు వెళ్లాలి? నా స్పెర్మ్ కోసం ఆ సంస్థ నాకు ఫస్ట్ క్లాస్ ప్రయాణం, ఫై‌వ్ స్టార్ హోటల్ సదుపాయాలు, వివిధ వస్తువులు తదితర సదుపాయాలను అందిస్తోంది. ఎర్రోల్‌కు ఇప్పటివరకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య మాయెతో అతడు ఎలోన్, కింబాల్, టోస్కాలకు జన్మనిచ్చాడు. రెండో భార్య హీడ్‌తో ఇద్దరు పిల్లలను కన్నాడు. హీడ్ మొదటి భర్తకు పుట్టిన జానాతో డేటింగ్ చేసి మరో ఇద్దరు పిల్లలను కన్నాడు. మరి, వీర్య దానంతో ఆయన ఇంకెంతమంది ఎలోన్ మస్క్‌లకు బీజం వేస్తాడో చూడాలి. 


Also Read: ప్రియురాలి చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్


Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!