రోగ్యంగా ఉండాలంటే నిత్యం మంచి ఆహారం తీసుకోవాలి. పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శరీరానికి కాల్సిన కాల్షియం ఇతరాత్ర పోషకాలు లభిస్తాయి. ఆవు, గేదె పాలతో పోల్చితే.. తల్లిపాలలో చాలా పోషకాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అందుకే పసిపిల్లలకు డబ్బా పాలకు బదులు.. తల్లిపాలే ఇవ్వాలని గట్టిగా చెప్పడానికి కారణం కూడా ఇదే. అయితే, తల్లి పిల్లలు పిల్లలు తాగితే ఓకే. కానీ, పెద్దలు తాగితేనే కాస్త వినడానికి, చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదూ. ఇదిగో ఈ టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పిన తన హెల్త్ సీక్రెట్ గురించి తెలుసుకుంటే ఫ్యూజులు ఎగిరిపోతాయ్. మీరు తప్పకుండా అతడి ప్రియురాలికి దన్నం పెడతారు. ఎందుకంటే.. అతడు చేసే పనులు అలాంటివి మరి. 


చికాగోన్ బోబన్ సిమిక్ అనే టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవల ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో పచ్చి మాంసం, పాలు తాగుతూ కనిపించాడు. తాను రోజు పచ్చి మాంసం తింటానని తెలిపాడు. అక్కడితే ఆగితే పర్వాలేదు. ఎందుకంటే ఇప్పటికే కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ పచ్చిమాంసం తింటున్నట్లు చెప్పారు. అయితే, పచ్చిమాంసంతోపాటు తన ప్రియురాలి చనుబాలు కూడా తాగుతున్నట్లు వెల్లడించాడు. అంతేగాక పెరుగులో మరొకటి కూడా కలుపుకుని తింటున్నాడు.  దాని గురించి చెబితే చాలా జుగుప్సకరంగా ఉంటుంది. అందుకే, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం లేదు. 


బోబన్ నాలుగేళ్ల కిందట పచ్చి గొడ్డు మాంసం తినడం ప్రారంభించాడు. ప్రారంభంలో అతడికి అది రుచించలేదు. కానీ ఫిట్‌నెస్ కోసం దాన్ని అలవాటుగా చేసుకున్నాడు. తన మాజీ ప్రియురాలి నుంచి రొమ్ము పాలు సేకరించి.. అవి తాగడం మొదలుపెట్టాడు. దాని వల్ల అతడు మానసికం, శరీరకంగా చాలా హెల్తీగా ఉంటున్నానని తెలుపుతున్నాడు. మార్నింగ్ టిఫిన్ కింది రోజూ 12 నుంచి 30 పచ్చిగుడ్డు సొనలు, మధ్యాహ్నం భోజనంలో 2 పౌండ్ల పచ్చి మాంసం, రాత్రి భోజనంలో పచ్చి గుడ్డు సొనలు తింటాడు. ఈ ఆహారం వల్ల తాను ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని బోబన్ తెలిపాడు. 


తింటే తిన్నాడు గానీ.. అతడు ఆ పచ్చి మాంసాన్ని తింటూ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాడు. ఇటీవల పోస్ట్ చేసిన వీడియోలో అతడు ఓ గొర్రె తలను పట్టుకుని దాని నాలుకను నమిలాడు. దాని కనుగుడ్డును చెంచాతో బయటకు తీసి.. మింగేశాడు. జంతు ప్రేమికులను ఆందోళనకు గురిచేసేలా ఆ వీడియో ఉంది. తన తిండి గురించి అతడు ఆ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘నేను తినేవన్నీ పచ్చివే. నేను పచ్చి గొర్రెను తింటాను. ఇది నాకు చాలా ఇష్టమైనది. ఎందుకంటే ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది కాకుండా నేను పచ్చి గొడ్డు మాంసం, పచ్చి చికెన్ బ్రెస్ట్ కూడా తింటాను. పచ్చి పంది మాంసం కొద్దిగా చప్పగా ఉంటుంది. కాబట్టి నేను అప్పుడప్పుడు దాన్ని తింటాను. పచ్చి మేక మాంసం లేతగా, తినేందుకు వీలుగా ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ చేపల్లా మృదువుగా ఉంటుంది. ఇవి తినడం వల్ల నాకు ఏ జబ్బు రాలేదు’’ అని వెల్లడించాడు. ఇతడి గురించి చదివిన తర్వాత.. వీడు మనిషా? జంతువా? అనే సందేహం కలుగుతుంది కదూ. కచ్చితంగా రెండోదే కరెక్ట్ అనిపిస్తుందా?!