జూలై 9 గౌరీ వ్రతం ప్రారంభంగౌరీ వ్రతం అనేది పార్వతీ దేవికి అంకితం చేసిన ఉపవాస వ్రతం. ఆషాడ మాసంలో గౌరీవ్రతాన్ని ఐదు రోజుల పాటూ నిర్వహిస్తారు. మంచి భర్త రావాలంటూ ఆడపిల్లలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవాలు ఆషాఢ ఏకాదశి తిథి రాగానే ప్రారంభమై ఆషాడ పూర్ణిమతో ముగుస్తాయి. అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్థశి, పౌర్ణమి..ఈ ఐదు రోజులు వ్రతం సాగుతుంది. గౌరీ వ్రతాన్ని అమ్మాయిలు మాత్రమే కాదు వివాహిత స్త్రీలు కూడా చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఏకాదశి తిథి - జులై 09, 2022 సాయంత్రం 04:39 గంటల నుంచి జులై 10, 2022 మధ్యాహ్నం 02:13 గంటల వరకు గౌరీ వ్రతాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు. జులై 9న ప్రారంభమయ్యే గౌరీ వ్రతం జులై 13న ముగుస్తుంది.
Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే
గౌరీ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలిఅనుకూలమైన జీవిత భాగస్వామిని ఇమ్మని అమ్మను కోరుతూ అవివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతీ దేవి శివుడిని పెళ్లిచేసుకునేందుకు తీవ్రమైన తపస్సు చేసింది. అందుకే పార్వతీదేవిని తలుచుకుంటూ గౌరీ వ్రతం చేసిన ఆడపిల్లలకు అర్థనారీశ్వరుడి లాంటి భర్త లభిస్తాడని విశ్వాసం.
గౌరీ వ్రతం ఎలా జరుపుకోవాలివ్రతం ఆచరణ ఐదు రోజులే అయినప్పటికీ కొందరు మహిళలు 7 నుంచి 9 రోజుల పాటూ నిత్యం ఉపవాసం ఉంటారు. గోధుమలు, పాలు, ఆవునెయ్యితో తయారు చేసిన ప్రసాదం స్వీకరిస్తారు. వ్రతం చేసేవారు మొదటి రోజు మట్టికుండలో గోధుమ గింజలు విత్తుతారు. వ్రతం చివరి రోజు రాత్రంతా జాగరణ చేసి అమ్మవారి సేవలో తరిస్తారు. వ్రతం ఆచరించిన అన్ని రోజులూ గోధుమ గింజలకు నీళ్లు పోస్తారు. వ్రతం పూర్తయ్యేసరికి అవి మొలకెత్తుతాయి. అప్పుడు తమ ఉపవాశాన్ని విరమిస్తారు.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
అర్థనారీశ్వర అష్టకం (ఉపమన్యు కృతం) ardhanareeswara ashtakam
అంభోధరశ్యామలకున్తలాయైతటిత్ప్రభాతామ్రజటాధరాయ ।నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయనమః శివాయై చ నమః శివాయ ॥
ప్రదీప్తరత్నోజ్వలకుణ్డలాయైస్ఫురన్మహాపన్నగభూషణాయ ।శివప్రియాయై చ శివప్రియాయనమః శివాయై చ నమః శివాయ ॥
మన్దారమాలాకలితాలకాయైకపాలమాలాఙ్కితకన్ధరాయై ।దివ్యామ్బరాయై చ దిగమ్బరాయనమః శివాయై చ నమః శివాయ ॥
కస్తూరికాకుఙ్కుమలేపనాయైశ్మశానభస్మాత్తవిలేపనాయ ।కృతస్మరాయై వికృతస్మరాయనమః శివాయై చ నమః శివాయ ॥
పాదారవిన్దార్పితహంసకాయైపాదాబ్జరాజత్ఫణినూపురాయ ।కలామయాయై వికలామయాయనమః శివాయై చ నమః శివాయ ॥
ప్రపఞ్చసృష్ట్యున్ముఖలాస్యకాయైసమస్తసంహారకతాణ్డవాయ ।సమేక్షణాయై విషమేక్షణాయనమః శివాయై చ నమః శివాయ ॥
ప్రఫుల్లనీలోత్పలలోచనాయైవికాసపఙ్కేరుహలోచనాయ ।జగజ్జనన్యై జగదేకపిత్రేనమః శివాయై చ నమః శివాయ ॥
అన్తర్బహిశ్చోర్ధ్వమధశ్చ మధ్యేపురశ్చ పశ్చాచ్చ విదిక్షు దిక్షు ।సర్వం గతాయై సకలం గతాయనమః శివాయై చ నమః శివాయ ॥
అర్ధనారీశ్వరస్తోత్రం ఉపమన్యుకృతం త్విదమ్ ।యః పఠేచ్ఛృణుయాద్వాపి శివలోకే మహీయతే ॥
॥ ఇతి ఉపమన్యుకృతం అర్ధనారీశ్వరాష్టకమ్ ॥
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం