Uber Helicopter: క్యాబ్ బుక్ చేసుకొనేప్పుడు ముందుగా ఏం చూస్తారు? ఏది చీప్‌గా ఉంటే అదేగా బుక్ చేసుకుంటారు. మరి, మీరు బుక్ చేసుకునే క్యాబ్ లిస్టులో హెలికాప్టర్ కూడా ఉంటే? ‘‘వామ్మో, హెలికాప్టరా? దానికంత డబ్బు పెట్టగలమా?’’ అని ఆశ్చర్యపోతాం. కానీ, ఈ మహిళకు వచ్చిన బంపర్ ఆఫర్ గురించి తెలిస్తే.. ‘‘అంత చీపా?’’ అని నోరెళ్లబెడతారు.
న్యూయార్క్ నగరానికి చెందిన ఓ మహిళ ఇటీవల జాన్ ఎఫ్ కెన్నెడీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ‘ఉబెర్’ యాప్ ఓపెన్ చేసింది. అందులో క్యాబ్ ధరలు చూస్తుంటే.. ఆమెకు కళ్లు మిరిమిట్లు గొలిపే ఆఫర్ కనిపించింది. క్యాబ్ ధరలు 102 నుంచి 126 డాలర్లు వరకు ఉంటే.. హెలికాప్టర్ రైడ్ ధర కేవలం 101.39 డాలర్లు మాత్రమే ఉంది. దీంతో ఆమె తన నిర్ణయాన్ని చెప్పలేక.. ‘ఉబెర్’ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read: భూమి తిరగడం ఆగిపోతే అంత భయానకంగా ఉంటుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త
ఈ పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. అయితే, చాలామంది దీనిపై ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘క్యాబ్ కంటే హెలికాప్టర్ రైడ్ చీపా?’’ అని కొందరు అంటుంటే.. ‘‘ఒక వేళ హెలికాప్టర్ బుక్ చేసుకుంటే, ఎక్కడ ఎక్కాలి? ఇంటి మీద ఆగదు కదా? దాని కోసం మళ్లీ క్యాబ్ బుక్ చేసుకుని హెలిప్యాడ్ వరకు వెళ్లాలా??’’ అంటూ వ్యంగ్య బాణాలు విసురుతున్నారు. నెటిజనుల కామెంట్లను ఈ కింది ట్వీట్లో చూడండి.
Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?