ల నొప్పి నుంచి కడుపు, కాళ్ల నొప్పి వరకు ఏది వచ్చినా ఏదో ఒక మాత్ర మింగేసి రిలీఫ్ అవుతాం. కొందరైతే కండలు పెంచేందుకు, ఫిట్‌గా ఉండేందుకు, జిమ్ వర్కవుట్స్‌లో వెంటనే అలసిపోకుండా ఉండేందుకు కూడా మాత్రలను మింగుతారు. మనం తీసుకొనే మాత్రల్లో ఎన్నో రకాల ఔషదాలు ఉంటాయి. వాటిలో ఏం కలుపుతారనేది చాలామందికి తెలీదు. 


ఈ నేపథ్యంలో స్టోనీ బ్రూక్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ క్వింగ్పింగ్ యావో ‘న్యూయార్క్ పోస్ట్’తో మాట్లాడుతూ ఓ షాకింగ్ విషయం చెప్పాడు. ‘ప్రోబయోటిక్ పిల్’ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ‘‘మీరు ప్రోబయోటిక్ పిల్ పిల్‌ను తీసుకోడానికి సిద్ధమేనా? దీన్ని తీసుకున్న ఓ వ్యక్తి ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందాడు. అతడు జిమ్‌లో వ్యాయామాలను చేసే సామర్థ్యాన్ని 10 శాతానికి పెంచుకోగలిగాడు. ఫలితంగా అతడి బరువు ఏడు పౌండ్లకు తగ్గింది’’ అని తెలిపారు.  


ఈ మాత్ర(ట్యాబ్లెట్)లను ‘నెల్లా’ పేరుతో మార్కెట్లో విక్రయించడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ మాత్రల్లో అథ్లెట్ల మలం నుంచి సేకరించిన బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడించారు. ఇది వినడానికే జుగుప్సాకరంగా ఉంది కదూ. జోనాథన్ స్కీమాన్ అనే డాక్టర్ ఈ మాత్రలను సృష్టించారు. సూపర్ హెల్దీ పీపుల్(మంచి ఆరోగ్యం గల వ్యక్తులు) గట్ మైక్రోబయోమ్‌లను పరిశీలించిన ఆయన.. ప్రతి ఒక్కరిలో కామన్‌గా ఉన్న ఒక విషయాన్ని తెలుసుకున్నారు. 


మైక్రోబయోమ్‌లు మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, శరీరంలోని సెరోటోనిన్‌లో 95 శాతం గట్ బ్యాక్టీరియా ద్వారా తయారవుతుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ సైతం కనుగొంది. అందుకే ఈ ‘నెల్లా’ మాత్రల తయారీ మొదలెట్టారు. ఈ మాత్రలను తీసుకొనే వ్యక్తి పేగులను ప్రోబయోటిక్ స్వాధీనం చేసుకుంటుంది. అథ్లెట్ మైక్రోబయోమ్‌ను పోలీ ఉండేవరకు బ్యాక్టీరియాను నింపుతుంది. ఫలితంగా ఆ మాత్రలు తీసుకొనే వ్యక్తి అథ్లెట్లకు ఉండే శక్తిని పొందగలడు. 


Also Read: వేసవిలో కూడా జలుబు, తుమ్ములు వేదిస్తున్నాయా? కారణం ఇదే!


బోస్టన్ మారథాన్ కోసం శిక్షణ పొందిన 15 మంది ఎలైట్ రన్నర్లు, సాధారణ వ్యక్తుల మలం నమూనాలను పరిశీలించిన తర్వాత డాక్టర్ స్కీమాన్ ఈ ఆవిష్కరణ చేశారు. రన్నర్లలో అధిక స్థాయిలో ‘బాక్టీరియం వీల్లోనెల్లా అటిపికా’ అపూ మైక్రోబ్(సూక్ష్మజీవి)ని కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇది ఎక్కువగా శ్రమించేవారిలో పెరిగే సూక్ష్మజీవి. ఇది లాక్టిక్ ఆమ్లాన్ని తింటుంది. ముందుగా దీన్ని ఎలుకలపై ప్రయోగించి సత్ఫలితాలు చూశారు. బ్రూక్లిన్‌కు చెందిన 52 ఏళ్ల నిక్ వెండికోస్ అనే వ్యక్తి దీర్ఘకాలికంగా Irritable Bowel Syndrome(IBS), బరువు సమస్యలతో బాధపడ్డాడు. దీంతో అతడు ఈ మాత్రలను ప్రయత్నించేందుకు ముందుకొచ్చాడు. ఇప్పుడు అతడి ఆరోగ్యం కుదుటపడిందని, దాదాపు 20 పౌండ్ల బరువును కోల్పోయాడని వైద్యులు తెలిపారు. 


Also Read: గుండె నొప్పిని మీ కాళ్లు ముందే హెచ్చరిస్తాయి, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!


గమనిక: వివిధ పరిశోధనలు, నిపుణులు తెలిపిన విషయాలు, మీడియా కథనంలో పేర్కొన్న వివరాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న ‘మాత్ర’ ఇంకా ప్రయోగ దశలో ఉంది. వైద్యుడి సూచన లేకుండా ఇలాంటి మాత్రలను తీసుకోరాదు. అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఈ కథనంలోని అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.