గుండె ఎప్పుడు ఎలా ఆగుతుందో చెప్పలేం. దీర్ఘకాలికంగా గుండె జబ్బులతో బాధపడేవారికి కనీసం తమ సమస్యల మీద అవగాహన ఉంటుంది. కానీ, ఏ గుండె జబ్బు లేని వ్యక్తులే అకస్మాత్తు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. అయితే, మీ గుండె సమస్యను మీ శరీరం ముందే చెప్పేస్తుంది. కొన్ని శరీర భాగాల్లో ఎప్పుడూ లేని మార్పులు జరుగుతున్నట్లయితే తప్పకుండా సందేహించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా, మీ కాళ్లు, చేతులు గుండె సమస్యల గురించి వివిధ రూపాల్లో హెచ్చరిస్తాయి. కాబట్టి, మీరు ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. 


నేషనల్ హార్ట్, లంగ్, బ్లడ్ ఇన్స్టిట్యూట్ (NHLBI) సహకారంతో UCLA పరిశోధకులు 2013లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. గుండె సమస్యలు కలిగిన వ్యక్తుల కాళ్ల కండరాలు చాలా బలహీనంగా ఉంటాయి. ‘హార్ట్ ఫెయిల్యూర్’ అనే జర్నల్‌లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. 2009లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. ‘‘దీర్ఘకాలిక గుండె సమస్యలు (HF) ఉన్న రోగులు ఎక్కువగా ఎముక కండరాల బలహీనతతో బాధపడుతున్నట్లు పేర్కొంది.  


‘మైయోసిన్’ అనే అణువు పరిమాణం, కార్యాచరణలో మార్పు వల్ల కాళ్లు బలహీనంగా మారుతాయి. ‘మైయోసిన్’ అనేది రసాయన శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే ప్రోటీన్. దానివల్లే కండరాల కదలిక ఏర్పడుతుంది. ఈ ప్రొటీన్‌ను కోల్పోవడం వల్ల గుండె సమస్యలతోపాటు కండరాల బలహీనత ఏర్పడుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. 


గుండె జబ్బులతో బాధపడేవారే కాకుండా, సాధారణ ప్రజలు కూడా వీలైనంత వరకు బరువు పెరగకుండా జాగ్రత్తపడాలని UCLA అధ్యయనం పేర్కొంది. గుండె పోటుకు గురైన చాలా మంది.. కాలు కండరాల బలహీనతతో బాధపడినట్లు తెలిపారని, దీనివల్ల వ్యాయమం కూడా చేయలేరని తెలిపింది. బరువు ఎక్కువగా ఉండే రోగులకు ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతుందన్నారు. 


Also Read: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!


హార్ట్ ఎటాక్‌కు ముందు కనిపించే మరికొన్ని లక్షణాలివే:
మాయో క్లినిక్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలు బలహీనతతో పాటు గుండె ఆగిపోవడానికి ముందు అనేక శరీరం అనేక సంకేతాలు ఇస్తుంది.  వ్యాయామం చేసేటప్పుడు లేదా పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, నిరంతర దగ్గు, గురక, పొత్తికడుపు వాపు, బరువు పెరగడం, వికారం, ఆకలి లేకపోవడం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గుండె నొప్పి సమయంలో ఛాతీ నొప్పి, మూర్ఛ లేదా తీవ్రమైన బలహీనత, వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన, శ్వాస తీసుకోవడానికి బాగా ఇబ్బందిగా ఉండటం, పింక్ ఫోమ్ లేదా శ్లేష్మం ఏర్పడటం, నిరంతర దగ్గు వంటివి ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు బాధితుడి వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. అంతేకాదు, గుండె సమస్యలను మీ చేయి కూడా ముందుగానే చెప్పేస్తుంది. ఈ కింది లింక్ క్లిక్ చేసి ఆ లక్షణాల గురించి కూడా తెలుసుకోండి. 


Also Read: హార్ట్ ఎటాక్‌‌ను ముందుగా మీ చెయ్యే చెప్పేస్తుంది.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!