Heart Attack Symptoms | ఒకప్పుడు గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయస్సు పైబడిన తర్వాతే కనిపించేవి. కానీ ఈ రోజుల్లో.. అరవైలో వచ్చే వ్యాధులు ఇరవైలోనే దాడి చేస్తున్నాయి. నిండు నూరేళ్లు జీవించాల్సిన మనిషి.. మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నాడు. ముఖ్యంగా మన దేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. చిన్న వయస్సులోనే గుండెపోటుతో ఎంతోమంది మరణిస్తున్నారు. ఇటీవల జరిపిన పలు అధ్యయనాల్లో మరెన్నో భయానక వాస్తవాలు బయటపడ్డాయి. ఇండియాలో చాలామంది 30 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సులోనే తీవ్రమైన గుండె నొప్పితో మరణిస్తున్నారని తెలిసింది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కూడా చిన్న వయస్సులోనే కన్ను మూశారు. ఎంతో ఫిట్‌‌గా కనిపించే ఆయన 49 ఏళ్లకే గుండెపోటుతో చనిపోయారు. అయితే, కార్డియాక్ అరెస్టా? లేదా హార్ట్ ఎటాకా అనేది తెలియాల్సి ఉంది. ఆయన రెండు సార్లు కోవిడ్-19 వైరస్‌కు గురయ్యారు. పోస్ట్ కోవిడ్ లక్షణాల వల్ల కూడా గుండె నొప్పి ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నుంచి కోలుకున్న వైరస్ బాధితులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పిని కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదించవచ్చు. ముందుగా మీరు కార్డియక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ మధ్య ఉండే తేడాను తెలుసుకోవాలి. 


హార్ట్ ఎటాక్ అంటే?: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడి కలిగే సమస్యే హార్ట్ ఎటాక్. దీన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తుపట్టవచ్చు. గుండెలోని ధమనుల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడినప్పుడు లేదా కొవ్వు పేర్కొన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల గుండెకు రక్తం సరఫరా కాదు. ఫలితంగా వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. ఛాతి నొప్పి ఎక్కువ సేపు ఉన్నా.. శరీర భాగాలు అసౌకర్యంగా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా గుండె వైపు భాగాలు లేదా ఎడమ చేయి లాగుతున్నా.. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, చల్లని చెమటలు పట్టినా అప్రమత్తం కావాలి. కొందరిలో తలనొప్పి, వికారం కూడా లక్షణాలు కూడా కనిపిస్తాయి. 


కార్డియక్ అరెస్ట్ అంటే?: గుండెలో ఏర్పడే ఎలక్ట్రానిక్ సమస్య వల్ల కార్డియక్ అరెస్ట్ అవుతుంది. అయితే, కార్డియక్ అరెస్ట్‌ను ముందుగా గుర్తించలేం. గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడి వల్ల గుండె లయ తప్పుతుంది. దీంతో రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. ఫలితంగా గుండెతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. దీనివల్ల బాధితుడు క్షణాల్లో కుప్పకూలతాడు. ఆ సమయంలో వెంటనే సీపీఆర్ ఇవ్వడం ద్వారా మళ్లీ ప్రాణం పోయవచ్చు. అయితే, పైన జరిగిన ఘటనలో అది సాధ్యం కాలేదు. వెంటనే అతడికి సీపీఆర్ చేసి ఉంటే బతికే అవకాశాలుండేవి. 


Also Read: భర్త వీర్యాన్ని కేకులు, డ్రింక్స్‌లో కలిపి విద్యార్థులకు పంచిన టీచర్, చివరికిలా చిక్కింది


ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం అవ్వండి.. ఇవి గుండె నొప్పికి సంకేతాలు కావచ్చు.
⦿ ఎడవ వైపు చేయి ఎక్కువగా లాగడం లేదా నొప్పిగా అనిపించడం. 
⦿ కొందరికి రెండు చేతులు, భుజాలు కూడా నొప్పిగా, అసౌకర్యంగా ఉంటాయి.
⦿ ఛాతి నొప్పి లేదా అసౌకర్యం.
⦿ నీరసంగా అనిపించడం, తల తిరుగుతున్నట్లుగా అనిపించడం. సొమ్మసిల్లడం. 
⦿ ఛాతి మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యం. అది ఎక్కువసేపు ఉంటే ప్రమాదమే.
⦿ ఛాతి మొత్తం పట్టేసినట్లుగా అసౌకర్యంగా ఉంటుంది. 
⦿ మూర్ఛ వచ్చినట్లుగా అనిపించడం. 
⦿ చల్లని చెమట. 
⦿ దవడ, మెడ లేదా వెనుక భాగంలో నొప్పి లేదా అసౌకర్యం.
⦿ శ్వాస ఆడకపోవుట. ఇ
⦿ ఛాతీలో అసౌకర్యానికి ముందు కూడా శ్వాస ఆడదు.
⦿ కొందరిలో వికారం లేదా వాంతులు ఏర్పడవచ్చు. 


Also Read: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!


ఇలా రక్షించవచ్చు: హార్ట్ ఎటాక్ వచ్చిన మొదట గంట సమయాన్ని ‘గోల్డెన్ అవర్’ అంటారు. ఆ సమయంలో రోగికి ఇచ్చే ప్రథమ చికిత్స అతడి ప్రాణాలను కాపాడుతుంది. ఆ గోల్డెన్ అవర్లో ఏం చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వాళ్లకైనా, బయటి వాళ్లకైనా... ఎప్పుడైనా మన కళ్ల ముందే ఇలాంటి ఆరోగ్య స్థితి ఏర్పడినప్పుడు ఇలా చేస్తే వారికి పునరుజ్జీవితాన్ని ఇచ్చినవారమవుతాము. హార్ట్ ఎటాక్ అని తెలియగానే ముందుగా అంబులెన్స్ కు సమాచారం అందించమని పక్కనున్న వాళ్లకి చెప్పండి. మీరే చేస్తే సమయం వేస్టువతుంది. మీరు రోగిని వెల్లకిలా నేలపై పడుకోబోట్టండి. అతని ఛాతీపై సీపీఆర్ చేయండి. సీపీఆర్ ఎలా చేయాలో చాలా వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి అవి చూసి నేర్చుకోండి. రెండు చేతులతో ఛాతీకి మీద ఒత్తుతూ ఉండాలి. ఆగకుండా కనీసం 15 సార్లు ఒత్తాలి. అలా ఒత్తాక మధ్యలో నోట్లోకి గాలిని ఊదాలి.  దీన్నే కృత్రిమ శ్వాస‌ అందించడం అంటారు. ఇలా చేయడం వల్ల గుండె పూర్తిగా ఆగిపోకుండా తిరిగి కొట్టుకునే అవకాశాలు పెరుగుతాయి. రోగి కూడా అపస్మారక స్థితికి చేరకుండా ఉంటారు. అంబులెన్స్ వచ్చే వరకు అలా చేస్తూ ఉండండి. దీని వల్ల ఒక ప్రాణాన్ని కాపాడినవారవుతారు.