గుప్పెడంత మనసు ఫిబ్రవరి 21 సోమవారం ఎపిసోడ్
వసుధార దగ్గరకు వెళుతున్న రిషి వెనుకే ఫాలో అవుదామనుకున్న గౌతమ్ ని తప్పించుకుని రిషి వెళ్లిపోతాడు. బయట కారు హారన్ వినిపించగానే రిషి సార్ అనుకుంటూ హడావుడిగా వెళ్లిపోతుంటే వసూ అని పిలుస్తుంది జగతి మేడం. బాయ్ మేడం అన్న వసు సమాధానానికి ముందు షాక్ అయి ఆ తర్వాత నవ్వుకుంటుంది. ఏంటి విశేషాలు అంటూ మొదలు పెట్టి, మ్యూజిక్ ఆన్ చేయనా అని అడుగితే వద్దులెండి సార్ అంటుంది. మేడంకి కాల్ చేయి అనడంతో...మళ్లీ ఏం కొంప మునుగుతుందో అనుకుంటూ కాల్ చేస్తుంది వసుధార. ఇప్పుడేకదా వెళ్లింది ఇంతలో కాల్ ఏంటి అంటూ లిఫ్ట్ చేస్తుంది. రిషిసార్ మీతో మాట్లాడుతారంట అంటూ స్పీకర్ ఆన్ చేస్తుంది. షార్ట్ ఫిలిం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అనేసి కాల్ కట్ చేస్తాడు. వసు-జగతి షాక్ లో ఉండిపోతారు.
దేవయాని-ఫణీంద్ర
కాలేజీలో షూటింగ్ చూసేందుకు వెళుతున్నా అంటూ ఫణీంద్రకి చెబుతుంది దేవయాని. అస్సలు నువ్వు రిషికి చెప్పావా అంటే... మన కాలేజీలో జరిగే దానికి పర్మిషన్ తీసుకోవాలా అంటుంది. అలా ఆలోచించుకోవడం అహంకారం అవుతుంది..పద్ధతి ప్రకారం నడుచుకోవాలి కదా అని క్లాస్ పీకుతాడు. ఇప్పుడే కాల్ చేసి కనుక్కుంటా అంటాడు ఫణీంద్ర. నా కాలేజీలో నా కొడుకు దగ్గరకు వెళ్లేందుకు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి ఇది నాకు అవమానం అంటుంది. అయినప్పటికీ రిషికి కాల్ చేసిన ఫణీంద్ర...మీ పెద్దమ్మ కాలేజీలో షూటింగ్ చూసేందుకు బయలుదేరింది నేను వద్దన్నాను అని చెబుతాడు. అదేంటి అలా చెప్పారని క్వశ్చన్ చేస్తుంది దేవయాని. నిజమే నువ్వు షూటింగ్ చూసేందుకు వెళుతున్నావని నేను అనుకోవడం లేదు, నువ్వెందుకు వెళుతున్నావో నీకు తెలుసు నాక్కూడా తెలుసు అందుకే వద్దన్నాను అంటాడు. అంటే నేను జగతిని ఏమైనా అంటానని భయపడుతున్నారా అంటే...జరిగేది అదే కదా దేవయాని, ఇంటికి పెద్దకోడలిగా నిన్ను గౌరవిస్తున్నాం నువ్వు నిలబెట్టుకో...నువ్వు చిన్న చిన్న పొరపాట్లు చేసినా, నోరు జారినా నీ స్థానానికి ఉన్న విలువ చూసి విషయాన్ని పెద్దది చేయడం లేదు...ఇది నువ్వు తెలుసుకుంటే నీకు మంచిది అని హెచ్చరిస్తాడు ఫణీంద్ర. ఇంట్లో అందరూ నాకు వ్యతిరేకంగా తయారవుతున్నారంటూ.... ధరణిపై ఫైర్ అయి వెళ్లిపోతుంది. చాలా మంచి మాట చెప్పారు... రిషికి జగతి అత్తయ్య మంచితనం గురించి ఇలాగే చెప్పొచ్చు కదా అని అడుగుతుంది కోడలు ధరణి. రిషికి నేను దేవయాని-జగతి గురించి చెబితే వార్త అవుతుంది...వాడు తెలుసుకుంటే నిజం అవుతుంది. వార్త కొన్ని రోజులే ఉంటుంది-నిజం నిలిచిపోతుంది క్లారిటీ ఇస్తాడు ఫణీంద్ర.
Also Read: దీప ముందు మోనితని లాగిపెట్టి కొట్టిన కార్తీక్, బాబు కావాలంటూ మోనిత కొత్త డ్రామా, కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
మరోవైపు కాలేజీలో షార్ట్ ఫిలిం షూటింగ్ జరుగుతుంటుంది. వసుధార-గౌతమ్ ని పిలిచి సీన్ వివరిస్తాడు డైరెక్టర్. అప్పుడే కారు దిగిన రిషి లోపలకు వెళ్లిపోతూ చీరకట్టుకున్న వసుధారని అలా చూస్తూ నిల్చుండిపోతాడు. మేడం అంతా ఓకేనా అని అడుగుతాడు. స్క్రిప్టులో చిన్న చిన్న మార్పులు చేశాం అని చెబుతుంది జగతి. డైరెక్టర్ గారూ షూటింగ్ స్టార్ట్ చేద్దాం అంటాడు రిషి. గౌతమ్ సార్ మీ వెనుక నుంచివసుధార మేడం వస్తారు పిలిచాక వెనక్కు తిరిగి చూడండని డైరెక్టర్ చెబుతాడు. ఏవండోయ్ శ్రీవారూ అంటూ వసుధార వస్తే...హాయ్ వసు డియర్ అంటాడు. కట్ చెప్పిన డైరెక్టర్... పంతులమ్మ అనాలని చెబుతాడు. అలా ఎందుకు ఇలా చెబితే బావుంటుందని గౌతమ్ అనడంతో..రిషి క్లాస్ వేస్తాడు. ప్రామ్టర్ ని పిలవండి అనగానే నాకు అవసరం లేదు పేజీ డైలాగ్ కూడా సింగిల్ టేక్ లో చెప్పేస్తాను అంటాడు. వన్ మోర్ అంటూ మళ్లీ యాక్షన్ అంటారు. ఏవండోయ్ శ్రీవారు అంటే గుడ్ మార్నింగ్ పంతులమ్మ అంటాడు గౌతమ్. మళ్లీ కట్ చెప్పిన డైరెక్టర్ డైలాగ్ ఒకటుంటే మీరు మరొకటి చెబుతారేంటి అని క్వశ్చన్ చేస్తాడు. వన్ మోర్ అంటూ మళ్లీ స్టార్ట్ చేస్తారు. వరుస టేక్స్ మీద టేక్స్ తీసుకుంటాడు. రిషి మాత్రం వసుధారని చూస్తూ కూర్చుంటాడు.
గౌతమ్ యాక్టింగ్ బాలేదని డైరెక్టర్ ఫైర్ అవుతాడు. రాంగ్ డైలాగ్ చెబుతారేంటని అంటే.. యాక్టింగ్ అంటే ఇలాగే ఉండాలని ఏం అనుకువోద్దు, ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు నా నుంచి యాక్టింగ్ రాబట్టుకోండి అంటాడు. పాపం పూర్ డైరెక్టర్ అనుకుంటూ వసు-రిషి ఎక్కడున్నారో అనుకుంటూ వెతుకుతాడు. మహేంద్ర-రిషి మాట్లాడుకుంటుండగా అక్కడకు వెళ్లిన గౌతమ్.. నాయాక్టింగ్ ఎలా ఉందంటున్నారని అడిగితే..యాక్టింగ్ లానే ఉందంటున్నారు అని రిప్లై ఇస్తాడు. ఆ యాక్టింగ్ ఏంట్రా, బాగా చేయరా, చెప్పింది వినరా అని రిషి అంటే.. నేను హీరో అయ్యానని నీకు కుళ్లురా బాబు, నువ్వు నన్ను సంతోష పడనివ్వవు అంటాడు. ఇంతలో జగతి-మహేంద్ర మూగసైగలు గమనించిన రిషి... నేను తర్వాత భోజనం చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మహేంద్ర తనవైపు రావడం చూసి..మహేంద్ర ఏంటి ఇటువైపు వస్తున్నాడు-ఏది వద్దంటానో, ఏది రిషికి నచ్చదో అదే చేస్తాడు అనుకుంటుంది జగతి. ఎపిసోడ్ ముగిసింది.
Also Read: వసుకోసం రిషి-గౌతమ్ ప్రేమ యుద్ధం, హీరో ఎవరు-విలన్ ఎవరు, గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
రేపటి ( మంగళవారం) ఎపిసోడ్ లో
టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్న గౌతమ్ ని అక్కడినుంచి పంపించేసి యాక్టింగ్ చేసేందుకు కూర్చుంటాడు రిషి. రిషి సార్ ని ఏవండోయ్ శ్రీవారు అని పిలవాలా అని తడబడుతుంది. మూడు నాలుగు సార్లు తడబడిన వసుకి రిషి ధైర్యం చెప్పడంతో సీన్ హైలెట్ అవుతుంది.