కార్తీకదీపం ఫిబ్రవరి21 సోమవారం ఎపిసోడ్


సౌందర్య-మోనిత బాబాయ్
మోనిత బాబాయ్ ని కలిసిన సౌందర్య...మీకు నా కొడుకు ఆపరేషన్ చేస్తాడు, ఆ తర్వాత మోనితని తీసుకుని అమెరికా వెళ్లిపోండి అని చెబుతుంది. అప్పటిలా లేదు మోనిత మారిందని చెప్పడంతో, మోనిత మారడం అనేది జరగదు అని క్లారిటీ ఇస్తుంది. ఓ పెళ్లైన స్త్రీ, తల్లైన స్త్రీ అత్తారింట్లో ఉండాలి  కానీ అమెరికాలో కాదంటాడు. తనకున్న ఏకైక బంధం చుట్టరికం మీరే అని తెలిసింది, సరైన దార్లో పెట్టండి, బుద్ధి చెప్పండని సౌందర్య అంటే... దోష నివారణ పూజ మీరు దగ్గరుండి చేయించారు కదా అంటాడు. అప్పుడు అలా చేయించాల్సి వచ్చిందని చెబుతుంది. స్పందించిన మోనిత బాబాయ్ ఎంత కాదన్నా తను నా అన్న కూతురు తన బతుకు బావుండాలని నేను కోరుకుంటాను కదా అంటాడు. ఏదేమైనా ఆపరేషన్ అయిన తర్వాత అమెరికా తీసుకెళ్లిపోండి, ఎలాంటి న్యూసెన్స్ ఉండకూడదని సౌందర్య అన్నమాటలకు కౌంటర్ గా ఎలాంటి న్యూసెన్స్ ఆంటీ అంటూ ఎంటరవుతుంది మోనిత. 


మోనిత-సౌందర్య
 ఏవేవో చెబుతారు బాబాయ్ కానీ...కార్తీక్ పై నా ప్రేమ నిజం, ఆ బిడ్డ నిజం అన్న మోనిత మీరు లోపలకు వెళ్లండని చెబుతుంది. అమెరికాకు తీసుకెళ్లమని చెప్పారని నేను ఊహించగలను, నేను మీకు న్యూసెన్స్ అయ్యానా, నా బతుకు ఏం కావాలి, ఇలా జీవితాంతం ఏడవాల్సిందేనా, ఒంటరిగా నా కార్తీక్-నా కొడుకు లేకుండా ఉండాల్సిందేనా, ఈ ఆపరేషన్ అవ్వనీయండి, నా కొడుకు దొరకనీయండి అప్పుడు మీకు నానుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని మరోసారి క్లారిటీ ఇస్తుంది., నీతో గొడవ పడే ఉద్దేశం లేదు అందుకే వెళుతున్నా అంటూ సౌందర్య వెళ్లిపోతుంటే...మోనిత ఇక్కడ....ఎక్కడికీ వెళ్లదు అనుకుంటుంది. 


Also Read: వసుకోసం రిషి-గౌతమ్ ప్రేమ యుద్ధం, హీరో ఎవరు-విలన్ ఎవరు, గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
సౌందర్య ఇంట్లో
తాడికొండ నుంచి వచ్చిన దీప-బాబుని చూసి పిల్లలిద్దరూ సంతోషిస్తారు. ఇంతలో అక్కడకు వెచ్చిన సౌందర్యతో ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది దీప. బస్తీకి వెళ్లి మోనిత బాబాయ్ తో మాట్లాడి వచ్చానంటూ, మోనిత ఏమందో చెబుతుంది సౌందర్య. మనం ఎంత టెన్షన్ పడినా ఏం లాభం, డాక్టర్ బాబు మోనితని ఎందుకు నమ్ముతున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదని దీప అంటే..ఆ ఆపరేషన్ ఏదో వేరేవాళ్లతో చేయిస్తే అయిపోతుంది కదా అంటుంది సౌందర్య. కట్ చేస్తే హాస్పిటల్లో ఆపరేషన్ కి అంతా సిద్ధంగా ఉందా అని అడుగుతాడు కార్తీక్. అంతా సిద్ధం చేయండని చెప్పేసి... ఆ తర్వాత మోనిత మాటలు, సౌందర్య హెచ్చరికలు, దీప మాటలు గుర్తుచేసుకుంటాడు. మోనిత  అంటేనే మోసం, కుట్ర...మాటలు ఆలోచనలు అన్నింటా తాను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న దీప మాటలు గుర్తుచేసుకుని ఆలోచనలో పడతాడు.


మోనిత-బాబాయ్
ఎప్పుడు చూసినా డల్ గా ఉంటారేంటి ఏంటి అంటూ బాబాయ్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది మోనిత. పేపర్ చదవండి, న్యూస్ చూడండి అంటే.. నేరాలు, ఘోరాలు చూసి గుండె ముందే అగిపోతుందేమో అని పిస్తోందంటాడు. హాస్పిటల్ మనదే, ఎందుకు టెన్షన్, మనం పరాయి వాళ్లం కాదు కదా, కార్తీక్ మీ అల్లుడే కదా అంటుంది. నువ్వేమో అల్లుడు అంటావ్, వాళ్లేమో అలా అంటారు నాకేం అర్థం కావడం లేదు, నాకు ఆపరేషన్ అవుతుందంటావా , దేవుడా ముందే నన్ను తీసుకెళ్లిపో అంటాడు. దేవుడా బాబాయ్ ఏదో కోరుకుంటున్నాడు ఆపని ఏదో చెయ్యి అనుకుంటుంది, ఆపరేషన్ కన్నా ముందే బాబాయ్ చనిపోతే నేను కార్తీక్ దగ్గరకు వెళ్లి నెత్తీ, నోరు కొట్టుకుని ఏడుస్తూ దగ్గరవొచ్చు అనుకుంటుంది.


సౌందర్య ఇంట్లో
నేను ఎంత గట్టిగా చెప్పి చూసినా కూడా వాడు నా మాట వినడం లేదని ఆనందరావు అంటాడు. నేను బస్తీకి వెళ్లొచ్చాక నా నమ్మకం బలపడింది అని సౌందర్య అంటుంది. మోనిత ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో అర్థంకావడం లేదంటుంది దీప. తెలుసుకునే లోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, ఇప్పటి వరకూ దాని పాపపు ఆలచోనల వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, డాక్టర్ బాబే ఈ ఆపరేషన్ చేయాలని ఎందుకు పట్టుబడుతోందో అర్థం కావడం లేదంటుంది. ఆపరేషన్ చేయొద్దు అనడం లేదు, కార్తీక్ తో కాకుండా వేరేవాళ్లతో చేయించమని నేను అడుగుతున్నా అంటుంది సౌందర్య. ఆనందరావు కూడా అదే అంటాడు. ఇప్పుడేం చేద్దాం అని సౌందర్య అంటే...నువ్వు టెన్షన్ పడకు ఆలోచిద్దాం అంటుంది సౌందర్య. 


Also Read:  మోనిత విషయంలో కార్తీక్ ని హెచ్చరిస్తూ పులి-బంగారు కడియం కథ గుర్తుచేసిన సౌందర్య, కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
మోనిత-అప్పారావ్
పైకి వెళ్లడానికి బాబాయ్ చాలా తొందర పడతున్నారు, ఏంటో ఈ మనుషులకు ఇంకా బతకాలని కోరిక అనుకుంటూ కార్ సడెన్ బ్రేక్ వేస్తుంది. ఎదురుగా ఉన్న అప్పారావుని తిట్టేలోగా...నన్ను గుర్తుపట్టలేదా..నేను అప్పారావుని అంటాడు. గుర్తుపట్టానులే ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అంటే..సినిమా ఆడిషన్స్ అని వచ్చానంటాడు. మీ ఇల్లెక్కడ అంటూ లొడలొడ వాగుతుంటే వెళ్లు అంటుంది మోనిత. డాక్టర్ బాబు అడ్రస్ అడిగితే చెబుతుందా తిడుతుందా అనుకుంటూ కార్తీక్ అడ్రస్ అడగుదాం అనుకునే లోగా మోనిత పోపో అంటుంది. వెళుతుండగా అప్పారావు చేతిలోంచి సంచి జారిపడడం అందులోంచి కోటేష్-శ్రీవల్లి (మోనిత బాబుని ఎత్తుకెళతాడు కోటేష్) ఫొటో చూసి షాక్ అయి వీడు నీకు తెలుసా అంటుంది. తెలుసు అని చెప్పి వాళ్లు చనిపోయిన విషయం చెబుతాడు. తన బాబుని ఎత్తుకెళ్లిన వీడియో-కోటేష్ ఫొటో ని మరోసారి పోల్చి చూసిన మోనిత...ఇప్పుడా బాబు ఎక్కడున్నాడని మోనిత అడిగితే మా అక్క బావ దగ్గరున్నాడని చెప్పి  కార్తీక్ బాబుని ఎత్తుకున్న ఫొటో చూపిస్తాడు. మోనిత షాక్ అవుతుంది...


రేపటి (మంగళవారం) ఎపిసోడ్ లో
మోనితని లాగిపెట్టి కొట్టిన కార్తీక్... ఎవరే నువ్వు ...నేను ప్రశాంతంగా బతకాలంటే నా బాబు కావాలి..ఇంకెప్పుడూ ఇబ్బంది పెట్టను అంటుంది. ఇదే మాట మీద ఉంటావా, నీ బాబుని వెతికి తీసుకొస్తే అన్నీ వదిలేస్తావా అని అడుగుతాడు...