గుప్పెడంత మనసు (Guppedantha Manasu ) ఫిబ్రవరి 19 శనివారం ఎపిసోడ్


రిషికి గుడ్ నైట్ చెప్పి ఏదో ఆలోచనలో వస్తున్న వసుని చూసి...ఏంటో నవ్వుకుంటూ వస్తున్నావ్ అంటుంది జగతి. ఏం లేదు మేడం మా ఎండీ గారు ఓ చిక్కు లెక్క ఇచ్చారంటుంది. నేనేమైనా సాయం చేయగలా అంటే అది అంత ఈజీగా తేలే లెక్క కాదులెండి అనేస్తుంది. అవునా...అయితే తొందరగా తేల్చేయ్ లేకపోతే మీ ఏండీగారు కాస్త కోపం వస్తే నా కొడుకు అయిపోతాడు అంటుంది. మరోవైపు ఇంటికెళుతూ వసుధార ఊహల్లో తెలుతూ ఉంటాడు రిషి. వసుధారలో ఏదో ప్రత్యేకత ఉంది అది ఇప్పటివరకూ ఎవ్వరిలోనూ కనిపించ లేదు అనుకుంటాడు. నేను ఎన్నిసార్లు లిఫ్ట్ ఇచ్చాననే లెక్క చేస్తుందా, ఎక్కడైనా రాసిపెట్టుకుని ఉంటుందా...మరి నేను ఎన్నిసార్లు రెస్టారెంట్ కి వెళ్లి కాఫీ తాగానో ఎలా లెక్కెట్టాలి అనుకుంటాడు. ఫైనల్ గా వసుధారతో జర్నీ బావుంటుంది అనుకుంటాడు.


కట్ చేస్తే ఇంటి బయట వర్కౌట్స్ చేస్తున్న మహేంద్ర దగ్గరకు వచ్చిన గౌతమ్...నేను బావుంటానా, హీరోగా పనికొస్తానా అని అడుగుతాడు. పనికొస్తావ్ గౌతమ్ అంటాడు మహేంద్ర. కానీ సమాజం ఏంటి నన్ను గుర్తించడం లేదు, ఆ మిత్రద్రోహి రిషిగాడు నాపై కక్ష తీర్చుకుంటున్నాడు, తెలియకుండా నన్ను తొక్కేస్తున్నాడు అంటాడు. ఏమైంది మళ్లీ ఏమైనా గొడవ పడ్డారా అంటే...గొడవ కాదు అంకుల్ ఆ రిష గాడు నన్ను అనేలోగా...రిషి ఎంట్రీ ఇస్తాడు. రిషిని చూసి గౌతమ్ మాట మార్చేయగా మహేంద్ర నవ్వుతాడు. రేయ్ నటించకు నా గురించి ఏదో చెబుతున్నావ్, నేను రాగానే ఆపేశావ్, నేను విన్నాను అంటాడు రిషి. నువ్వు నాకు నిజాలు చెప్పాలి కదా, నువ్వు మోసగాడివి, నాకు అబద్ధాలు చెప్పావ్ అని గౌతమ్ అంటే..ఏం మాట్లాడుతున్నావ్ రా అని రిషి అంటాడు. నేను మేడంని కలిశాను ఆమె నాకు మొత్తం చెప్పారు, నాకు అంతా తెలిసిపోయింది అంటాడు గౌతమ్. మేడం దగ్గరకు వెళ్లావా, ఏం చెప్పారు అని రిషి క్వశ్చన్ కి...నిజాలు చెప్పారు అని రిప్లై ఇస్తాడు. చీటర్, ద్రోహి నాకు చెప్పాలి కదరా అని గౌతమ్ తన ధోరణిలో మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు. 


Also Read: మోనిత విషయంలో కార్తీక్ ని హెచ్చరిస్తూ పులి-బంగారు కడియం కథ గుర్తుచేసిన సౌందర్య, కార్తీకదీపం శనివారం ఎపిసోడ్


ఇంతకీ జగతి మేడం ఏం చెప్పారని మహేంద్ర అడిగితే..షార్ట్ ఫిలింలో రోల్ ఇవ్వొద్దని వీడు డిసైడ్ అయ్యాడట అని క్లారిటీ ఇస్తాడు. నువ్వు షార్ట్ ఫిలిం గురించి మాట్లాడుతున్నావా అని రిషి అంటే...మరి నువ్వేమనుకున్నావ్ అంటాడు గౌతమ్. మేడం-రిషి కలసి నన్ను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు తెలుసా అని బాధపడతాడు గౌతమ్. నేను షార్ట్ ఫిలిం హీరోకి పనికిరానా రేయ్ నువ్వు కావాలని చేస్తున్నావని నాకు తెలుసు, నీ మనసులో ఏదో పెట్టుకున్నావ్...ఒక ఛాన్స్ ఇవ్వొచ్చు కదా అని గౌతమ్ అడిగితే... తర్వాత మాట్లాడుదాం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు రిషి. ఛాన్స్ ఇవ్వరా అని కాళ్లు పట్టుకుంటాడు గౌతమ్. ఇద్దర్నీ చూసి మహేంద్ర నవ్వుకుంటాడు. కాళ్లు పట్టుకోవడం ఏంటి అసహ్యంగా లేదా అన్న రిషి...ఆలోచిద్దాంలే అంటాడు. ఆలోచించడం ఏంటి, నిర్ణయం తీసుకునేది నువ్వేకదా అంటాడు గౌతమ్. కాలేజీ విషయాలు కాలేజీలో మాట్లాడుకుందాం అని రిషి మాట వినగానే.... జగతి మేడం కూడా సేమ్ మాట అన్నారని చెబుతాడు. ఎంతైనా సేమ్ బ్లడ్ కదా అని తనలో తాను అనుకుని నవ్వుకుంటాడు మహేంద్ర. వీడు ఫ్రెండ్ కాదు...పోయిన జన్మలో శత్రువు అయి ఉంటాడు...మీరు చెప్పినా నాకు క్యారెక్టర్ ఇవ్వడం లేదంటాడు. కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో నేను ఒకడిని, రిషి ఎండీ ...ఎవరి మాట చెల్లుతుంది చెప్పు అంటాడు. వాడి మనసులో ఏదో ఉందంటాడు గౌతమ్. 


కాలేజీలో అటు ఇటు తిరుగుతున్న గౌతమ్..వీడు రాగానే సంగతేంటో తేల్చేస్తా అనుకుంటాడు. ఇంతలో రానేవస్తాడు రిషి. షార్ట్ ఫిలింలో క్యారెక్టర్ ఉందా లేదా, నేను హీరోగా ఫిక్సయ్యాను, నువ్వే అడ్డుపడుతున్నావ్, టాలెంట్ ని తొక్కేయకురా, నాకు అవకాశం ఇవ్వరా అంటాడు గౌతమ్. అవకాశాన్ని డిమాండ్ చేయకూడదు, మర్యాదగా అడగాలని రిషి చెబుతాడు. రిషి సార్ అంటూ మొదలుపెట్టి తన స్టైల్లో ఆఫర్ అడుక్కుంటాడు గౌతమ్. ఆలోచిస్తానులే అని రిషి అంటే..ఉందో లేదో చెప్పేసెయ్ అంటే...నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి నీకు క్యారెక్టర్ ఇస్తాను కానీ నేను చెప్పిన రూల్స్ పాటించాలని షరతులు పెడతాడు. క్యారెక్టర్ ఎలా ఉంటే అలా బిహేవ్ చేయాలి, అందులో నీ ఒరిజనల్ క్యారెక్టర్ పెట్టకూడదు, డైరెక్టర్ గారు చెప్పింది చేయాలి, నువ్వు చేస్తున్న క్యారెక్టర్ మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది, ఇది నీ సొంతం కాదు..నిన్ను నువ్వు గొప్పగా చూపించుకునేందుకు వాడకూడదు. యాక్టింగ్ చేసేటప్పుడు వసుధారకి వీలైనంత దూరంలో నీ పాత్ర ఆగిపోవాలి అంటాడు. నువ్వేంటిరా ఇన్ని కండిషన్స్ పెడుతున్నావ్ అంటే...సరే వేరేవాళ్లతో చేయిస్తాలే అన్న రిషితో...వద్దురా బాబు నీ కండిషన్స్ అన్నింటినీ ఒప్పుకుంటాను అంటాడు గౌతమ్. ఇంతలో జగతి మేడం అక్కడకు వచ్చి ఓ ఫైల్ చూడమని ఇచ్చి వెళ్లిపోతారు. మేడం..షార్ట్ ఫిలింలో ఆ క్యారెక్టర్ కి గౌతమ్ ని తీసుకోండి అని చెబితే సరే అంటుంది జగతి. 


Also Read:  మనసులోనే రిషి-వసు నిశ్శబ్ద ప్రేమ యుద్ధం, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్


వసుధారతో ఫోన్ మాట్లాడుతున్న రిషి..ఇంకా ఏంటి చెప్పు అంటాడు. ఏముంటుంది అంటే.. నీకు ఎన్నిసార్లు లిఫ్ట్ ఇచ్చానో లెక్కెట్టావా అంటే ఇంకా పూర్తిగా లెక్కపెట్టలేదు అంటుంది. మీ లెక్క ఎంత వరకూ వచ్చిందని అడిగితే...ఏంటి నేనిది చెబితేనే నువ్వు చెబుతావా అంటాడు రిషి. సరే నేను కూడా ఆలోచిస్తాను...చూద్దాం ఎవరు ముందుగా చెబుతారో అనుకుంటారు. రేపటి షార్ట్ ఫిలింకి సంబంధించి కొంచెం ప్రిపేర్ అయి రావాలంటూ కొన్ని జాగ్రత్తలు చెబుతాడు. అర్థమైంది సార్ అని వసు అంటే..మార్నింగ్ నేను వచ్చి పికప్ చేసుకుంటాను రెడీగా ఉంటు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇదంతా వినేసిన గౌతమ్..రేపు పొద్దున్నే నువ్వు వసుధార ఇంటికి వెళతావన్నమాట...అయితే నేను కూడా నీతో వస్తానన్నమాట అనుకుంటూ లోపలకు వెళతాడు. రిషి పొద్దున్నే బయలుదేరుతుండగా గుడ్ మార్నింగ్ ఎండీగారూ అంటూ వెనుకే వస్తాడు గౌతమ్. ఎండీ అంటున్నావేంటని రిషి అంటే... ఎండీ అంటే మ్యానేజింగ్ డైరెక్టర్ కాదు మిత్రద్రోహి అని మనసులో అనుకుంటాడు. నువ్వు ఎటు వెళితే నీతోపాటే నేనూ వస్తానంటాడు. కానీ నువ్వు నాతో రావడం లేదు నువ్వు వేరేకార్లో వస్తావంట అని చెప్పేసి వెళ్లిపోతాడు.