ఏప్రిల్ 27 బుధవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 27- 04 - 2022
వారం: బుధవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం
తిథి : ద్వాదశి బుధవారం రాత్రి తెల్లవారుజామున 1.10 వరకు తదుపరి త్రయోదశి
వారం : బుధవారం
నక్షత్రం: పూర్వాభాద్ర సాయంత్రం 6.14 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం : తెల్లవారుజామున 3.50 నుంచి 5.24 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.34 నుంచి 12.24
అమృతఘడియలు : ఉదయం 10.27 నుంచి 11.57 వరకు
సూర్యోదయం: 05:40
సూర్యాస్తమయం : 06:14
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: సునామీని కూడా తిప్పికొట్టిన అమ్మవారు, గంట సమర్పిస్తే చాలు మీ కోర్కె నెరవేరతుందట
సనాతన ధర్మంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి అంకితం చేసి ప్రత్యేకంగా పూజిస్తారు. బుధవారం గణేషుడికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. కైలాస పర్వతంపై పార్వతీ దేవి తన చేతులతో వినాయకుడిని సృష్టించిన రోజు బుధవారం అని భక్తుల విశ్వాసం. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా విజయం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు.
గణేష్ గాయత్రీ మంత్రం
ఏకదన్తాయ విద్మహే వక్రతుణ్డాయ ధీమః తన్నో బుద్ధే ప్రచోదయాత్ ।
గణేష్ గాయత్రి మంత్రాన్ని 11 రోజుల పాటూ 108 సార్లు జపిస్తే జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
గణేష్ కుబేర మంత్రం
ఓం నమో గణపతయే కుబేర యేకాద్రికో ఫట్ స్వాహా ।
గణేష్ కుబేర మంత్రాన్ని జపిస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు.
ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ॥
ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం
ప్రస్యం దన్మథులుబ్ధ మధుపవ్యాలోల గండస్థలమ్
దంతాఘాత విదారితాం రుధిరైః । సింధూర శోభాకరం
వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదమ్ కామదమ్ ॥
Also Read:ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!