2022 ఏప్రిల్ 27 బుధవారం రాశిఫలాలు


మేషం
ముఖ్యమైన పనులు ముందుగానే పూర్తి చేయండి. ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి.ఈ రోజు మీరు ఏదో ఒక విషయంలో కలత చెందుతారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఏదైనా పాత పెట్టుబడి ఖాతా నుంచి లాభం వస్తుంది. కెరీర్ సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటుంది.


వృషభం
ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీరు కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు. కుటుంబంలో పరస్పరం సామరస్యం ఉంటుంది. కుటుంబం, స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఓ శుభవార్త వింటారు. 


మిథునం
కార్యాలయంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి మీరు ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండండి. పని విషయంలో ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. మీ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.


Also Read: హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి


కర్కాటకం
భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి రావొచ్చు. అధికారులతో వాగ్వాదం తలెత్తే అవకాశం ఉంది.వ్యాపారం మెరుగుపడుతుంది. మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. 


సింహం
ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి జీతం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. ఎక్కువ ఒత్తిడికి లోనై పనిచేయొద్దు. కుటుంబం మరియు వ్యాపారం మధ్య సమతుల్యతను సృష్టించండి. మీరు సామాజిక సేవలో చాలా చురుకుగా ఉంటారు. ఎవరి పట్లా చెడు వైఖరి కలిగి ఉండకండి.


కన్యా
ఆఫీసులో మీ ఆధిపత్యం కనిపిస్తుంది. వ్యాపారంలో తోటి వ్యాపారుల మద్దతు ఉంటుంది. మీరు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. రోజంతా సానుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి జరుగుతుంది. 


Also Read: శనివారం సాయంత్రం ఈ చెట్టుకింద దీపం వెలిగిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి


తులా 
ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. కెరీర్ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవించండి. మానసిక ప్రశాంతత తోసం ధ్యానం చేయండి.  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


వృశ్చికం
మీ ఆర్థిక స్థితి బావుంటుంది. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తోబుట్టువుల నుంచి సహకారం అందుతుంది. మీరు ఎవరినీ అవమానించకుండి. స్నేహితులను కలుస్తారు. కార్యాలయంలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 


ధనుస్సు 
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీ  కుటుంబ సభ్యుల నుంచి ఆప్యాయత పొందుతారు. స్పైసీ ఫుడ్ తినడం వల్ల పొట్ట సంబంధింత సమస్యతో ఇబ్బంది పడతారు.  కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. విలువైన వస్తువుల భద్రతను నిర్లక్ష్యం చేయవద్దు.


మకరం
మీరు ప్రశాంతంగా ఉంటారు. ప్రత్యర్థులు మీకు హానికలిగించే అవకాశం ఉంది జాగ్రత్త. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. మీ నైపుణ్యం, సామర్థ్యం మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. దూరప్రాంత ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటారు.


Also Read:  బుధుడి సంచారం ఈ రాశులవారికి అద్భుతంగా ఉంటుంది


కుంభం
అక్రమాలకు మద్దతు ఇవ్వకండి. మీ తప్పులకు ఇతరులను నిందించవద్దు. కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. యువత తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. ధైర్యం పెరుగుతుంది. టెన్షన్ తగ్గుతుంది.


మీనం
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. వ్యాపార ఒప్పందాన్ని పూర్తి చేయగలుగుతారు.జీవిత భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వండి.ఇంట్లో ఉన్న ఉద్రిక్తతలు చాలా వరకు దూరమవుతాయి. కొత్త వాహనం కొనుగోలుకు ప్రణాళిక రూపొందిస్తారు. రిస్క్ తీసుకోవద్దు.


Also Read:  వృషభరాశిలో బుధుడు ఈ 4 రాశులవారికి కొన్ని ఇబ్బందులు తప్పవ్