భూమి మీద సౌరశక్తిని గ్రహించుకోవడంతో చెట్లది ముఖ్యమైన పాత్ర. కాయలు, పళ్లు, పూలు, ఔషధాలు ఇవ్వడంతో పాటూ మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతున్నాయి. అందుకే చెట్లతో సహా ప్రకృతిని పూజిస్తారు.  ఇందులో భాగంగా భారతీయ రుషులు కొందరు...కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. అవేంటంటే...


తులసి
దాదాపు ప్రతి ఇంట్లో ఉండే మొక్క ఇది.  శ్రీ మహావిష్ణువికి అత్యంత ప్రీతికరమైనది.
""యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం""
మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు ఉన్న తులసికి నమస్కరిస్తున్నా అని అర్థ.  తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే యోగులు, సాధువులు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. ఇంకా చెప్పాలంటే తులసిని స్పృశించడంతోనే శుద్ధి చేస్తుందని చెబుతారు.


రావి
దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. 
""మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణీ
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:""
ఈ వృక్షం మూలం వద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టును శ్రీ మహావిష్ణువు  స్వరూపం అని చెబుతారు. అందుకే అశ్వత్థనారాయణుడు అని కూడా అంటారు. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓ సందర్భంలో దేవతలు ఓటమిపాలవగా విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురా ణాలు చెబుతున్నాయి.  కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని , బుద్ధుడికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందంటారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు ఎర్రని వస్త్రం, దారం కట్టే ఆచారం ఉంది. చెబుతారు. ప్రతి శనివారం సంధ్యా సమయంలో రావి చెట్టు మొదల్లో దీపం వెలిగిస్తే జాతక దోషాలు తొలిగిపోతాయని విశ్వాసం.


వేప
వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందుకే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోటకు చేర్చి వాటికి వివాహం చేసే ఆచారం ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేప చెట్టులో అణువణువూ ఔషధమే. 


మారేడు
మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అది దేవతా వృక్షమై నందునే కొన్ని రోజుల్లో, తిథుల్లో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి కోయాలి. 
"అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్"
మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్ష మని పేర్లు.  మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ మూడు పత్రాల దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. జైను లకు కూడా ఇది పవిత్ర వృక్షం. వారి గురువుల్లో ఒకరైన 23వ తీర్థంకరుడు భగవాన్ పరస్నాథ్జీ మారేడు వృక్షం కిందే నిర్వాణం (జ్ఞానోదయం పొందారని) భావిస్తారు. మారేడులో ఔషధ గుణాలూ అధికం.


Also Read:   మీరు తినే ఆహారంపైనా నవగ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసా


జమ్మి
జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి. సంస్కృతంలో దీన్ని శమీ వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం కూడా పుణ్యప్రదమంటారు. 
"శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శిని"
శమి శత్రువులను నశింపజేస్తుందని, పాండవుల ఆయుధాలను మోసినదని, రామునికి ప్రియమైనదని దీని అర్థం. ఈ వృక్షం పైనే అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధా లు దాచారు. అలాగే రాముడు లంకపై యుద్ధానికి వెళుతు న్నపుడు ఈ వృక్ష అధిష్ఠాన దేవతే ఆయనకు విజయం సిద్ధిస్తుందని చెప్పినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది.  ఈ చెట్టు బెరడనును కుష్ఠు రోగం, గాయాలు సహా పలు రోగాలకు ఉపయోగిస్తారు. 


ఉసిరి
ఉసిరి చెట్టుని కూడా  శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తా రు. కార్తీక మాసంలో ఈ చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. ఉసిరి కాయల మీద వత్తులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. ఆయుర్వేదం లో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం.


మేడి
మేడి చెట్టుకింద దత్తాత్రేయుల వారు కూర్చు ని ఉంటారు. త్రిమూర్త్యాత్మకుడు ఎప్పుడూ ఏ చెట్టు నీడనుంటాడో అది పవిత్రమైనదే కదా. 


మర్రి
మర్రి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును చాలా సంస్కృతుల్లో జీవానికి, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల్లనే సంతానం లేనివారు మర్రి చెట్టును పూజించే ఆచారం ఉంది. సర్వ లోకాలకూ గురువుగా భావించే జ్ఞాన స్వరూపుడైన మేధా దక్షిణామూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు. 


అశోక
ఈ చెట్టును కామ దేవునికి ప్రతీకగా భావిస్తారు. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తారు. బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెబుతారు. అందువల్ల వీటిని బౌద్ధారామాల్లో ఎక్కువగా నాటుతుంటారు. అశోక అంటే సంస్కృతంలో శోకంలేనిది లేదా శోకాన్ని దూరం చేసేది అని అర్థం. 


Also Read:  అఖండ సినిమాలో బాలయ్య చెప్పిన చక్రాలు విన్నారు కదా-అవేంటో తెలుసా


మామిడి
మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయ ణం, మహాభారతం, ఇతర పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. ఈ మామిడిపండు పండుగా ప్రేమకు, సంతానసాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభ కార్యమైనా మామిడి ఆకు తోరణాలు కట్టకుండా ప్రారంభం కాదు. ఈ ఆకులకు కాలుష్యాన్ని తొలగించే గుణం ఉంది


కొబ్బరి
కొబ్బరి చెట్టును కల్ప వృక్షంగా వ్యవ హరిస్తారు. అన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయ తప్పనిసరిగా ఉంటుంది. పూర్ణకుంభం, కలశలోనూ కొబ్బరికాయే కనిపిస్తుంది. కొబ్బరికాయను శివ స్వరూపంగా భావిస్తారు. 


అరటి,కదళి
అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవునికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభ కార్యాసమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల భోజనాలకు వీటిని ఉపయోగి స్తారు. కొన్ని ప్రాంతాల్లోకదలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజచేస్తారు.


హరిచందనం
చందనం చెక్క ఆరగదీయడం వల్ల వచ్చే చందనం నిత్య పూజలో ఒక భాగం. అందుకే చందన వృక్షాన్ని దేవతా వృక్షంగా భావిస్తారు.