ఐకూ జెడ్6 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. గతేడాది లాంచ్ అయిన ఐకూ జెడ్5కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఐకూ జెడ్6 5జీ స్మార్ట్ ఫోన్ ధర లాంచ్‌కు ముంగిట మనదేశంలో లీక్ అయింది. ఇందులో 120 హెర్ట్జ్ డిస్‌ప్లేను కంపెనీ అందించనుందని తెలుస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 8 జీబీ వరకు ర్యామ్ ఉండనుందని తెలుస్తోంది. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండనుంది.


ఐకూ జెడ్6 5జీ ఇండియా లాంచ్
ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం ఐకూ ఇండియా ప్రత్యేకమైన మైక్రోసైట్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ మైక్రో సైట్‌కు ‘కమింగ్ సూన్’ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. కాబట్టి త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


ఐకూ జెడ్6 ధర (అంచనా)
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.15 వేలలోపే ఉండనుంది. అంతేకాకుండా దీనిపై పలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐకూ జెడ్5 స్మార్ట్ ఫోన్ మనదేశంలో రూ.23,990 ధరతో లాంచ్ అయింది.


ఐకూ జెడ్6 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. దీనికి సంబంధించిన రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్ ఆప్షన్ ఇందులో ఉండే అవకాశం ఉంది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?