కరోనా ముందు కరోనా తర్వాత ఆహారపు అలావాట్లు చాలా మారిపోయాయ్. గతంలో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ని ఇష్టంవచ్చినట్టు తిన్నవారంతా ఇప్పుడు రూట్ మార్చారు. డైట్, ఆర్గానిక్ ఫుడ్స్, మిల్లెట్స్ అంటూ ఫుడ్ స్టైల్ మార్చారు. ఇంతకీ నవగ్రహాలకు ఆహారానికి సంబంధం ఏంటంటారా... మీ జాతకంపై ప్రభావం చూపించే నవగ్రహాలు ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తాయట.  మొక్కలు, పండ్లు , ఆకుకూరలు, కూరగాయలు కొన్ని గ్రహ సంచారంపై ఆధారపడి కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ఆయా రోజుల్లో ఆ గ్రహాలను శాంతపరిచే ఆహారం తినడం ద్వారా మీ శరీరంలో ఔషద విలువలు పెరుగుతాయంటారు. 


Also Read: అఖండ సినిమాలో బాలయ్య చెప్పిన చక్రాలు విన్నారు కదా-అవేంటో తెలుసా


ఏ వారం ఏ ఆహారం తీసుకోవాలి
ఆదివారం 
ఈ రోజు మనపై సూర్యుడి ప్రభావం వుంటుంది. అందుకే ఏం తిన్నా జీర్ణమైపోతుంది. శరీరం పీల్చేస్తుంది. అందుకే గోధుమలు, రాగులతో చేసినవి తినాలి.


సోమవారం 
సోమవారం చంద్రుడి ప్రభావం ఉంటుంది. చంద్రుడు నీటి సంబంధ గ్రహం. అందుకే నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు...గుమ్మడి, దోస, పుచ్చ పండు తింటే బాగా జీర్ణం అయిపోతాయి.


మంగళవారం 
ఈ రోజు కుజుడి ప్రభావం వుంటుంది. కుజుడు వేడి గ్రహం  కనుక వేడిపుట్టించే ఆహారపదార్థాలు తీసుకోవాలి.   మామిడిపండు, పైన్ ఆపిల్,  మిరియం, వెల్లుల్లి ఇవి త్వరగా జీర్ణమవుతాయి. 


బుధవారం 
బుధవారం బుధుడి ప్రభావం ఉంటుంది. కనుక ఈ రోజు ఏ ఆహారం తీసుకున్నా పర్వాలేదు. పెసలు, పచ్చి బఠానితో చేసిన ఆహార పదార్థాలు తినొచ్చు. 


గురువారం
గురుగ్రహ ప్రభావం ఉంటుంది. అందుకే పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహార పదార్థాలు, పండ్లు తినాలి. ఆరెంజ్, నిమ్మ, అరటిపండు లాంటివి.


శుక్రవారం 
శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు సంబంధించి గ్రహం.  ఈ రోజు  బాదం, పిస్తా, డార్క్ చాక్లెట్స్, వేయించిన గుమ్మడి గింజలు సహా జింక్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవచ్చు. 


శనివారం 
శనిగ్రహం ఆధిపత్యం ఎక్కువగా నూనెలపై ఉంటుంది. అందుకే నూనె ఆహారాలు, జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం అవుతుంది. 


Also Read: గుడిలో అడుగుపెట్టే ముందు ద్వారానికి( గడపకి) ఎందుకు నమస్కారం చేస్తారు


ఇలా ఏ రోజు పరిస్థితి, గ్రహస్థితిని బట్టి ఆహారంలో స్వల్పమార్పులు చేసుకుంటే జీర్ణక్రియ  సమస్యలు పరిష్కారమవుతాయంటారు పండితులు.అయితే తరచూ జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే మాత్రం వైద్యులను సంప్రదించాల్సిందే. ఎందుకంటే కొన్ని కొంతవరకూ మాత్రమే పట్టించుకోవాలి..ఇలా చేస్తే మంచిది అని చెప్పాపన్నదే ఉద్దేశం కానీ ఇలా చేయకపోతే ఏదో జరుగుతుందనే ఆలోచన పెట్టుకోకండి.