మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః


Also Read: గుడిలో అడుగుపెట్టే ముందు ద్వారానికి( గడపకి) ఎందుకు నమస్కారం చేస్తారు


భూలోకానికి ఊర్థ్వలోకాలు, అధోః లోకాలు ఉంటాయి. వీటిలో శరీరంలో ఉన్న షట్చక్రాలను ఊర్థ్వలోక సప్తకంతో పోలుస్తారు. అవేంటంటే. 
1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం


1. మూలాధారచక్రం 
ఈ చక్రం మలరంధ్రానికి రెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎర్రగా ఉంటుంది. నాలుగురేకులుగల తామరపువ్వు ఆకారంలో ఉండే ఈ చక్రానికి అధిపతి వినాయకుడు, వాహనం ఏనుగు, బీజాక్షరాలు వం – శం – షం.
2. స్వాధిష్ఠాన చక్రం 
ఇది జననేంద్రియం వెనుక భాగంలో ఉన్న వెన్నెముకలో ఉంటుంది. అధిపతి బ్రహ్మతత్త్వం, వాహనం మకరం. సింధూరవర్ణంలో ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీని బీజాక్షరాలు బం – భం – యం – యం – రం – లం. 
3. మణిపూరక చక్రం 
బొడ్డుకు మూలంలో వెన్నెముక దగ్గర ఉంటుంది.ఈ చక్రం అధిపతి శ్రీ మహావిష్ణువు. వాహనం కప్ప. ఈ చక్రం  పదిరేకుల పద్మాకారంలో బంగారపు వర్ణంతో ఉంటుంది. బీజాక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. 
4. అనాహత చక్రం 
ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికి అధిదేవత రుద్రుడు. నీలం రంగులో పన్నేండు రేకుల తామరపూవులా ఉంటుంది. వాయుతత్వం అయిన ఈచక్రానికి వాహనం లేడి. దీని బీజాక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం.
5. విశుద్ధచక్రం 
ఇది కంఠం దగ్గరుంటుంది. దీనికి అధిపతి జీవుడు. ఆకాశతత్వం అయిన ఈచక్రం నలుపు రంగులో ఉంటుంది. వాహనం ఏనుగు. బీజాక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః.
6. ఆజ్ఞాచక్రం 
ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీనికి అధిపతి ఈశ్వరుడు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉండే ఈ చక్రం తెలుపురంగులో ఉంటుంది.  బీజాక్షరాలు హం – క్షం.
7. సహస్రారం 
ఇది కపాలం పై భాగంలో ఉంటుంది.  మనం మాడు అని పిలిచే చోట అన్నమాట. దీన్నే బ్రహ్మరంధ్రం అంటారు. దీనికి అధిపతి కూడా శివుడే. వేయిరేకుల పద్మాకృతితో ఉండే ఈ చక్రం బీజాక్షరాలు విసర్గలు. దీనికి ఫలితం ముక్తి. 


Also Read: మీ బెడ్‌రూమ్‌ నుంచి బాత్‌రూం వరకు అంతా ఆ ఎనిమిది మంది డైరెక్షన్‌లోనే, బిగ్‌ బాస్‌ కంటే ఎక్కువ ఫోకస్ ఉంటుంది


శ్లో|| మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి |
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే ||


అర్థం ఏంటంటే... ఓ పరాశక్తీ..మూలాధార చక్రమందు భూతత్వం, స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వం, మణిపూర చక్రంలో జలతత్వం, అనాహత చక్రమందు వాయు తత్వం, దానిపైనున్న విశుద్ధ చక్రంలో ఆకాశ తత్వం, ఆగ్నేయ చక్రంలో మనస్తత్వను వీడి సమస్తమైన సుషుమ్నా మార్గాన్ని భేదించి సరస్రార పద్మంలో ఏకాంతముగా భర్తతో విహరించుచున్నావు.


ఇలా మానవశరీరంలో ఒక్కో స్థానంలో ఒక్కో చక్రం లీనమై ఉంటుంది.  ఆరు చక్రాలు కారణంగా శరీరం శుద్ధి జరుగుతుంది. వీటి ఫంక్షనింగ్  నిలిచిపోతే జీవుడు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాడని అర్థం.