Apple Event 2022: మ్యాక్ స్టూడియో, స్టూడియో డిస్‌ప్లేలను యాపిల్ తన లేటెస్ట్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఈ కొత్త డివైస్‌లను ప్రొఫెషనల్స్ లక్ష్యంగా రూపొందించారు. ఇందులో ఎం1 మ్యాక్స్, ఎం1 అల్ట్రా ప్రాసెసర్లను అందించారు. ఇందులో యాపిల్ తాజాగా లాంచ్ చేసిన ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేను అందించారు.


మ్యాక్ స్టూడియో ధర
మనదేశంలో మ్యాక్ స్టూడియో ధర రూ.1,89,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎం1 మ్యాక్స్ ప్రాసెసర్, 32 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఒకవేళ ఎం1 అల్ట్రా ప్రాసెసర్ కావాలనుకుంటే... ఇందులో 64 జీబీ ర్యామ్, 1 టీబీ ఎస్ఎస్‌డీ ఉండనుంది. దీని ధర రూ.3,89,900గా నిర్ణయించారు.


యాపిల్ స్టూడియో డిస్‌ప్లే ధర
ఇక యాపిల్ స్టూడియో డిస్‌ప్లే విషయానికి వస్తే... స్టాండర్డ్ గ్లాస్ వేరియంట్ ధరను రూ.1,59,900గానూ, నానో టెక్చర్ గ్లాస్ వేరియంట్ ధరను రూ.1,89,900గానూ నిర్ణయించారు.


మ్యాక్ స్టూడియో స్పెసిఫికేషన్లు
గతంలో లాంచ్ అయిన మ్యాక్ ప్రో కంటే దీని సైజు కొంచెం చిన్నగా ఉండనుంది. మ్యాక్ మినీ తరహాలోనే దీని డిజైన్ ఉండనుంది. కాకపోతే పొడవు కాస్త పెద్దది. దీన్ని అల్యూమినియంతో రూపొందించారు. పైభాగంలో యాపిల్ లోగో ఉంది. యూఎస్‌బీ టైప్-సీ, థండర్ బోల్డ్ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. ఇక ముందువైపు ఎస్‌డీఎక్స్‌సీ కార్డు స్లాట్ కూడా ఉంది.


32 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఎం1 అల్ట్రా ప్రాసెసర్‌లో 20 సీపీయూ కోర్లు, 64 జీపీయూ కోర్లు అందించారు. 128 జీబీ వరకు ర్యామ్, 8 టీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌ను టాప్ ఎండ్ వేరియంట్‌లో అందించారు. దీని ధర మనదేశంలో రూ.7,89,900గా నిర్ణయించారు.


యాపిల్ స్టూడియో డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు
ఈ డిస్‌ప్లే సైజు 27 అంగుళాలుగా ఉంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 5కేగా ఉంది. ట్రూ టోన్ కలర్ అడ్జస్ట్ మెంట్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఇది ట్రూ 10-బిట్ కలర్‌ను సపోర్ట్ చేయనుంది. ఇందులో ఏ13 ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఇందులో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను అందించారు.డాల్బీ అట్మాస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.


ఇందులో 10 జీబీపీఎస్ యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను అందించారు. దీంతోపాటు థండర్‌బోల్ట్ పోర్టు కూడా ఇందులో ఉండనుంది. టచ్ ఐడీ, మ్యాజిక్ హౌస్, మ్యాజిక్ ట్రాక్‌ప్యాడ్ వంటి ఆప్షన్లు ఉన్న యాపిల్ మ్యాజిక్ కీబోర్డు కూడా లాంచ్ అయింది. దీని ధరను రూ.19,500గా నిర్ణయించారు.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?